ఎయిర్‌టెల్‌ ‘డియర్‌ కామ్రేడ్‌’ డీల్‌ : బంపర్‌ ఆఫర్లు

Airtel and Dear Comrade Movie Deal Special Recharge Packs - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ :  టెలికాం సేవల సంస్థ భార‌తీ ఎయిర్‌టెల్ (ఎయిర్‌టెల్‌), టాలీవుడ్‌ అప్‌ కమింగ్‌ మూవీ  ‘డియ‌ర్ కామ్రెడ్‌’తో వ్యూహాత్మ‌క ఒప్పందాన్ని కుదుర్చుకుంది.  తాజా ఒప్పందం ద్వారా  ఎయిర్‌టెల్‌  ప్రీ పెయిడ్‌,  పోస్ట్‌ పెయిడ్ కేటగిరీల‌లో  స్పెషల్‌ `డియ‌ర్ కామ్రెడ్‌` ప్యాక్‌లు లాంచ్ చేసింది.  అలాగే  ప్యాక్‌ల రీచార్జ్‌లపై  ఎంపిక చేసిన లక్కీ వినియోగదారులకు  ఉచితంగా సినిమా టికెట్లతోపాటు, డియర్‌ కామ్రేడ్‌  మూవీ నటీ నటులను కలుసుకునే బంపర్‌ ఆఫర్‌ను అందిస్తున్నామని ఎయిర్‌టెల్‌ ఒక పత్రికా ప్రకటనలో వెల్లడించింది. ఈ సినిమా ప్ర‌మోష‌న్ కోసం మైత్రి మూవీ మేక‌ర్స్‌తో తాము  క‌లిసి ప‌నిచేస్తున్నామని తెలిపింది.

రూ.169 ప్రీపెయిడ్‌తో రీచార్జ్ చేసుకున్న వారు లేదా ఎయిర్‌టెల్ లైఫ్ స్టైల్ పోస్ట్‌పెయిడ్ ప్లాన్ రూ.499 లేదా అంత‌కుమించి రీచార్జ్‌ చేసుకున్న వినియోగ‌దారులకు ఈ బంపర్‌ ఆఫర్లను అందించనుంది.   ఎంపిక చేసిన ల‌క్కీ క‌స్ట‌మ‌ర్లు ఎయిర్‌టెల్ మీట్ అండ్‌ గ్రీట్‌లో భాగంగా, డియ‌ర్ కామ్రెడ్ సినిమాలో నటీన‌టుల‌ను క‌లుసుకునే అవ‌కాశం దొరుకుతుంది. దీంతోపాటుగా వినియోగ‌దారులు ప్ర‌త్యేక‌మైన డాటా, టాక్‌టైం ప్ర‌యోజ‌నాలు తదితర మ‌రెన్నో ప్ర‌యోజ‌నాల‌ను  పొంద‌వ‌చ్చు.  ఆంధ్ర‌ప్రదేశ్,  తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా ఈ ఆఫర్లను అందిస్తోంది. 

ఏపీ, తెలంగాణ ఎయిర్‌టెల్ సీఈఓ అవ్‌నీత్ సింగ్ పూరి, మైత్రీ మూవీ మేక‌ర్స్  అధిపతులు పరస్పరం ఈ ఒప్పందంపై సంతోషాన్ని వ్యక్తం చేశారు. డియ‌ర్ కామ్రెడ్ సినిమాతో  ఒప్పందం  ద్వారా ప్రాంతీయ భాష‌ల‌ కంటెంట్ స్ప‌ష్ట‌మైన స‌మాచార మార్పిడికి ఉప‌యోగ‌ప‌డుతుంద‌ని ఎయిర్‌టెల్ భావిస్తోందని పూరి అన్నారు. సినిమా హీరో విజయ దేవర్‌కొండ స్పందిస్తూ డియ‌ర్ కామ్రెడ్ సినీ ప్ర‌యాణంలో ఎయిర్‌టెల్‌  భాగస్వామ‍్యం తనకు సంతోషాన్ని, ఉత్కంఠను కలిగిస్తోందన్నారు.  వినియోగదారులు డియర్‌ కామ్రేడ్‌ ఎయిర్‌టెల్‌ ప్యాక్‌లను రీచార్జ్‌ చేసుకోవాలని,  తద్వారా మనమంతా కలుసుకోవాలని ఆకాంక్షించారు.

కాగా విజయ్ దేవరకొండ హీరోగా మైత్రి మూవీ మేక‌ర్స్ నిర్మాణ సారధ్యంలో డియర్ కామ్రేడ్  రూపుదిద్దుకుంది. భరత్ కమ్మ దర్శకత్వంలో యాక్షన్, రొమాంటిక్ ఎంటర్టైనర్‌గా వస్తున్న ఈ  చిత్రంలో రష్మిక మందాన శృతి రామచంద్రన్ తదితరులు నటించిన సంగతి తెలిసిందే.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top