ఎయిర్‌టెల్‌ 4జీ స్మార్ట్‌ఫోన్‌.. మూడేళ్లకు మనీ రిఫండ్‌

Airtel 4G smartphone @ Rs.2,899 - Sakshi

‘కార్బన్‌ ఏ40 ఇండియన్‌’ పేరుతో ఆవిష్కరణ

దీనికోసం కార్బన్‌ మొబైల్స్‌తో భాగస్వామ్యం

మూడేళ్ల తర్వాత రూ.1,500 రిఫండ్‌   

న్యూఢిల్లీ: ఎయిర్‌టెల్‌ 4జీ స్మార్ట్‌ఫోన్‌ను తీసుకువస్తోందంటే ఎవరూ నమ్మలేదు. దీని ధర రూ.2,500 ఉండొచ్చని మార్కెట్‌ వర్గాలు అంచనా వేసినా... చాలా మంది లైట్‌ తీసుకున్నారు. ఇప్పుడు అదే నిజమైంది. రిలయన్స్‌ జియోకి దిమ్మతిరిగేలా దేశీ దిగ్గజ టెలికం సంస్థ భారతీ ఎయిర్‌టెల్‌... తాజాగా 4జీ స్మార్ట్‌ ఫోన్‌ను ఆవిష్కరించింది. అది కూడా రూ.2,899కే. ఈ మొత్తంలో మూడేళ్ల తరవాత రూ.1500 వరకూ తిరిగి వెనక్కు ఇస్తుండటంతో నికరంగా ఫోన్‌ కోసం చెల్లిస్తున్న మొత్తం రూ.1,399గానే ఉంటోంది. ఎయిర్‌టెల్‌ కంపెనీ బహుళ భాగస్వామ్యంతో బండిల్‌ ప్లాన్‌తో మొబైల్‌ హ్యాండ్‌సెట్‌ను ఆవిష్కరించడం ఇదే తొలిసారి.  

పథకం పనిచేసేదిలా...
ఎయిర్‌టెల్‌ 4జీ ఫోన్‌ను కొనాలనుకుంటున్న కస్టమర్లు రూ.2,899 డౌన్‌ పేమెంట్‌ చెల్లించాలి. అలాగే 36 నెలలపాటు వరుసగా ప్రతి నెలా రూ.169తో రీచార్జ్‌ చేసుకోవాలి. 18 నెలల తర్వాత రూ.500 రిఫండ్‌ తీసుకోవచ్చు. 36 నెలల తర్వాత మరో రూ.1,000 రిఫండ్‌ పొందొచ్చు. అంటే మొత్తంగా రూ.1,500 వెనక్కు వస్తాయి. దీంతో ఈ 4జీ స్మార్ట్‌ఫోన్‌ రూ.1,399లకే వచ్చినట్లు అవుతుంది. రిఫండ్‌ సమయంలో ఫోన్‌ను వెనక్కు ఇవ్వాల్సిన అవసరం లేదు. వినియోగదారులు దేశవ్యాప్తంగా ప్రముఖ రిటైల్‌ స్టోర్లలో ఈ స్మార్ట్‌ఫోన్‌లను కొనుగోలు చేయవచ్చు.

రూ.169 ప్లాన్‌ వద్దనుకుంటే..
కస్టమర్లు కంపెనీ ఆఫర్‌ చేసే రూ.169 ప్లాన్‌ వద్దనుకుంటే.. వారికి నచ్చిన ప్లాన్‌ను ఎంచుకోవచ్చు. అయితే రిఫండ్‌ పొందాలంటే తొలి 18 నెలల్లో రీచార్జ్‌ విలువ నికరంగా రూ.3,000 ఉండాలి. అప్పుడు రూ.500 రిఫండ్‌ పొందటానికి అర్హత లభిస్తుంది. తర్వాత 18 నెలల్లో మరో రూ.3,000 విలువైన రీచార్జ్‌ చేసుకోవాలి. అప్పుడు మరో రూ.1,000 రిఫండ్‌ పొందొచ్చు. ఇక రూ.169 ప్లాన్‌ వాలిడిటీ 28 రోజులు. ఇందులో అన్‌లిమిటెడ్‌ కాలింగ్‌ సౌకర్యం ఉంది. రోజుకు 0.5 జీబీ డేటా పొందొచ్చు.

ప్రతి ఒక్కరికీ 4జీ స్మార్ట్‌ఫోన్‌ లక్ష్యం
మేరా పెహలా 4జీ స్మార్ట్‌ఫోన్‌ కార్యక్రమంలో భాగంగానే కార్బన్‌ మొబైల్స్‌తో జత కట్టామని ఎయిర్‌టెల్‌ తెలిపింది. చౌక స్మార్ట్‌ఫోన్‌లను మార్కెట్‌లోకి తేవటానికి పలు మొబైల్‌ హ్యాండ్‌సెట్స్‌ తయారీ కంపెనీలతో భాగస్వామ్యం కుదుర్చుకోవడానికి ప్రయత్నిస్తున్నామని పేర్కొంది. ప్రతి భారతీయుడికీ 4జీ స్మార్ట్‌ఫోన్‌ అందించాలనేది ఈ కార్యక్రమం ఉద్దేశమని తెలిపింది. కాగా, జీయో ఫోన్‌ పేరుతో రిలయన్స్‌ జియో ఇప్పటికే రూ.1,500కే 4జీ ఫీచర్‌ ఫోన్‌ను తీసుకొచ్చి టెలికం రంగంలో సంచలనాన్ని సృష్టించిన సంగతి తెలిసిందే. మూడేళ్ల తర్వాత ఫోన్‌ను వెనక్కిచ్చి ఈ రూ.1,500ను కూడా తమ కస్టమర్లు తీసేసుకోవచ్చని.. దీంతో ఫోన్‌ను ఉచితంగా ఇచ్చినట్లు అవుతుందంటూ జియో ప్రచారం చేసుకుంటోంది. అయితే, ఎయిర్‌టెల్‌ మాదిరిగానే దీనికి కూడా ఇతరత్రా అనేక షరతులు ఉండటం గమనార్హం.

‘కార్బన్‌ ఏ40 ఇండియన్‌’ స్మార్ట్‌ఫోన్‌ ప్రత్యేకతలు
4 అంగుళాల స్క్రీన్, Üడ్యూయెల్‌ సిమ్, Üఆండ్రాయిడ్‌ నుగోట్‌ ఆపరేటింగ్‌ సిస్టమ్, Ü1.3 గిగాహెర్ట్‌›్జ ప్రాసెసర్, Ü1,400 ఎంఏహెచ్‌ బ్యాటరీ, Ü4జీ, 1 జీబీ ర్యామ్, Ü8 జీబీ ఇంటర్నల్‌ మెమరీ, Ü2 ఎంపీ రియర్‌ కెమెరా, 0.3 ఎంపీ ఫ్రంట్‌ కెమెరా, Üవై–ఫై, బ్లూటూత్, జీపీఎస్, Ü22 దేశీ భాషలను సపోర్ట్‌ చేస్తుంది. Üయుట్యూబ్, వాట్సప్, ఫేస్‌బుక్‌ యాప్స్‌ సపోర్ట్‌

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top