ఫ్లాట్‌గా మొదలైన స్టాక్‌మార్కెట్లు

Market opens on a subdued note

సాక్షి, ముంబై:  దేశీయ స్టాక్‌మార్కెట్లు ఫ్లాట్‌గా మొదలయ్యాయి. జియో  పొలిటికల్‌ టెన్షన్స్‌, అంతర్జాతీయమార్కెట్ల సంకేతాల నేపథ్యంలో ఇటీవలి భారీ నష్టాలనుంచి మార్కెట్లు ఫ్లాట్‌ నోట్‌లోకి మళ్లాయి.  లాభనష్టాల మధ్య  ఊగిసలాడుతున్నమార్కెట్లలో సెన్సెక్స్‌ 16 పాయింట్ల లాభంతో 31,631 వద్ద,  నిఫ్టీ 9872 వద్ద ట్రేడ్‌ అవుతోంది. అయితే సెల్లింగ్‌ ప్రెజర్‌ బాగా కనిపిస్తోంది.   షార్ట్‌ కవరింగ్‌, హై లెవల్లో మళ్లీ షాట్‌  పొజిషన్లు ఉంటాయని నిపుణులు భావిస్తున్నారు. రియల్టీ, మెటల్ రంగాలు స్వల్ప లాభాల్లో, బ్యాంకింగ్, ఎఫ్ఎంసీజీ బలహీనంగా కొనసాగుతున్నాయి.  

దీప్‌ ఇండస్ట్రీస్‌, ఇన్ఫీ బీమ్‌ టాప్‌ విన్నర్స్‌గా ఉన్నాయి.  హెచ్యూఎల్, ఏషియన్ పెయింట్స్, అల్ట్రాటెక్, బీపీసీఎల్, యస్ బ్యాంక్, టెక్ మహీంద్రా, స్టేట్ బ్యాంక్, బీవోబీ, మారుతీ, టాటా పవర్ నష్టాల్లో,  ఓఎన్‌జీసీ, ఐబీహౌసింగ్, టాటా మోటార్స్, హెచ్ సీఎల్ టెక్, అదానీ పోర్ట్స్, హీరోమోటో, పవర్ గ్రిడ్, యాక్సిస్  బ్యాంక్‌ లాభాల్లో ఉన్నాయి.

అటు డాలర్‌ మారకంలో రుపీ మరింత  కిందకి దిగజారింది. ఓపెనింగ్‌ లోనే రూ. 65 స్థాయికి పతనమైంది. పసిడి తన హవాను కొనసాగిస్తోంది.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Tags: 



 

Read also in:
Back to Top