ఏడు నెలల్లో 39 లక్షల ఉద్యోగాలు!

39 lakh jobs in seven months - Sakshi

ఈపీఎఫ్‌వో గణాంకాల వెల్లడి

న్యూఢిల్లీ: దేశంలో ఉపాధి అవకాశాల సంఖ్య గణనీయంగా పెరుగుతున్నట్టు ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ (ఈపీఎఫ్‌వో) గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. గత ఆర్థిక సంవత్సరం మార్చితో అంతమైన చివరి ఏడు నెలల కాలంలో (2017 సెప్టెంబర్‌ – 2018 మార్చి) 39.96 లక్షల కొత్త ఉద్యోగాలు ఏర్పడ్డాయి.

ఒక్క మార్చి నెలలోనే కొత్తగా 6.13 లక్షల ఉద్యోగాలు జతయ్యాయి. ఫిబ్రవరిలో ఈ సంఖ్య 5.89 లక్షలుగా ఉన్నట్టు ఈపీఎఫ్‌వో పెరోల్‌ డేటా తెలియజేస్తోంది. కొత్త ఉద్యోగాల్లో సగం నైపుణ్యంతో కూడిన సేవల విభాగంలోనే వచ్చాయి. అధికంగా ఉపాధి అవకాశాలు సమకూరిన విభాగాలను పరిశీలిస్తే... ఎలక్ట్రిక్, మెకానికల్‌ లేదా జనరల్‌ ఇంజనీరింగ్‌ ఉత్పత్తులు, దాని తర్వాత బిల్డింగ్‌ అండ్‌ కన్‌స్ట్రక్షన్‌ పరిశ్రమ, ట్రేడింగ్, వాణిజ్య సముదాయాలు, టెక్స్‌టైల్స్‌ ఉన్నాయి.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Tags: 



 

Read also in:
Back to Top