వాట్సాప్‌ బిజినెస్‌ యాప్‌కు 30 లక్షల మంది యూజర్లు 

30 lakh users to the Watsap Business App - Sakshi

శాన్‌ ఫ్రాన్సిస్కో: వ్యాపార సంస్థలు, కస్టమర్స్‌ను అనుసంధానం చేసే వాట్సాప్‌ బిజినెస్‌ యాప్‌ యూజర్ల సంఖ్య 30 లక్షల పైచిలుకు ఉందని సోషల్‌ నెట్‌వర్కింగ్‌ సైట్‌ ఫేస్‌బుక్‌ సీఈవో మార్క్‌ జకర్‌బర్గ్‌ వెల్లడించారు. వ్యాపార కార్యకలాపాలకు మరింతగా ఉపయోగపడేలా రాబోయే అయిదేళ్లలో తమ ఇన్‌స్టాగ్రామ్, వాట్సాప్, మెసెంజర్‌ వంటి యాప్స్‌ను మెరుగుపర్చడంపై దృష్టి సారించనున్నట్లు ఆయన పేర్కొన్నారు.

ప్రస్తుతం ప్రాచుర్యంలో ఉన్న వాట్సాప్‌ యాప్‌.. సాధారణ మెసేజింగ్‌ సర్వీసులకు ఉపయోగపడుతుండగా.. వ్యాపార వర్గాల కోసం వాట్సాప్‌ బిజినెస్‌ యాప్‌ ఉపయోగపడుతోంది. ప్రారంభ దశలో ఉన్న దీన్ని వాట్సాప్‌ మాతృసంస్థ ఫేస్‌బుక్‌ ఈ ఏడాది జనవరిలో భారత్‌ సహా అమెరికా, మెక్సికో, బ్రిటన్, ఇండోనేసియా, ఇటలీ దేశాల్లో అందుబాటులోకి తెచ్చింది. ఇది ప్రస్తుతం గూగుల్‌ ఆండ్రాయిడ్‌ ప్లేస్టోర్‌లో లభిస్తోంది. యాపిల్‌ బిజినెస్‌ చాట్‌ వంటి వాటికి పోటీగా ఫేస్‌బుక్‌ దీన్ని రూపొందించింది.    

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top