గ్రహం అనుగ్రహం (23-09-2019)

Daily Rasi Phalalu in Telugu (23-09-2019) - Sakshi

శ్రీవికారినామ సంవత్సరం. దక్షిణాయనం, వర్ష ఋతువు. భాద్రపద మాసం. తిథి బ.నవమి ప.1.23 వరకు, తదుపరి దశమి. నక్షత్రం ఆరుద్ర ఉ.7.43 వరకు, తదుపరి పునర్వసు. వర్జ్యం రా.7.17 నుంచి 8.50 వరకు. దుర్ముహూర్తం ప.12.17 నుంచి 1.04 వరకు, తదుపరి ప.2.40 నుంచి 3.28 వరకు. అమృత ఘడియలు తె.4.34 నుంచి 6.06 వరకు(తెల్లవారితే మంగళవారం)

సూర్యోదయం : 5.53 సూర్యాస్తమయం : 5.54
రాహుకాలం :  ఉ.7.30 నుంచి  9.00 వరకు
యమగండం : ఉ.10.30 నుంచి 12.00 వరకు

భవిష్యం
మేషం: పనులు విజయవంతంగా సాగుతాయి. ఆకస్మిక ధనలబ్ధి. ప్రముఖులతో పరిచయాలు. ఆలోచనలు అమలు చేస్తారు. చిన్ననాటి మిత్రుల కలయిక. వ్యాపారాలు, ఉద్యోగాలు మరింత అనుకూలిస్తాయి. ఆహ్వానాలు అందుతాయి.

వృషభం:  మిత్రులతో మాటపట్టింపులు. ఆధ్యాత్మిక చింతన. పనులు వాయిదా వేస్తారు. కష్టానికి తగిన ఫలితం కనిపించదు. ఆస్తి వివాదాలు. వ్యాపారాలు, ఉ ద్యోగాలలో కొన్ని మార్పులు జరిగే వీలుంది. అనారోగ్యం.

మిథునం: వ్యవహారాలు సాఫీగా సాగుతాయి. ఆప్తుల నుంచి కీలక సందేశం. విలువైన వస్తువులు కొంటారు. ఆస్తి వివాదాలు పరిష్కారం. శుభవార్తలు. వ్యాపారాలు, ఉద్యోగాలు మరింతగా కలసివస్తాయి. సత్కారాలు జరుగుతాయి.

కర్కాటకం: శ్రమ మరింత పెరుగుతుంది. ఆస్తి వివాదాలు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. కుటుంబసభ్యులతో వివాదాలు. అనారోగ్యం. వ్యాపారాలు, ఉద్యోగాలలో చికాకులు. ధనవ్యయం.

సింహం: అందరిలోనూ గుర్తింపు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. పనులు చకచకా సాగుతాయి. ఆహ్వానా లు, గ్రీటింగ్‌లు అందుతాయి. స్థిరాస్తి వివాదాల పరిష్కారం. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఒత్తిడుల నుంచి విముక్తి.

కన్య: నూతన ఉద్యోగాలు దక్కుతాయి. భూవివాదాలు కొలిక్కి వస్తాయి. సభలు, సమావేశాలలో పాల్గొంటారు. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. వాహనయోగం. వ్యాపారాలు, ఉద్యోగాలలో మరింత పురోగతి.

తుల: రుణాలు చేస్తారు. ఆకస్మిక ప్రయాణాలు. కష్టానికి తగిన ఫలితం దక్కదు. ఆరోగ్యభంగం. పనులలో అవాంతరాలు. బంధువులతో తగాదాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో కొన్ని చిక్కులు ఎదురవుతాయి. ఆకస్మిక ప్రయాణాలు.

వృశ్చికం: బంధువులతో వివాదాలు. చేపట్టిన వ్యవహారాలు ముందుకు సాగవు. శ్రమ పెరుగుతుంది. ఆరోగ్యంపై శ్రద్ధ వహించండి. అనుకోని ప్రయాణాలు. దైవదర్శనాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో గందరగోళం.

ధనుస్సు: మిత్రులతో ఉత్సాహంగా గడుపుతారు. అనుకున్న పనులు సకాలంలో పూర్తి. సంఘంలో పేరుప్రతిష్ఠలు పొందుతారు. వాహనయోగం. వ్యాపారాలు, ఉద్యోగాలలో సమస్యలు తొలగుతాయి.

మకరం: వ్యవహారాలలో పురోగతి. ఆస్తుల వివాదాలు పరిష్కారం. వాహన, గృహయోగాలు. కీలక నిర్ణయాలు. ఊహించని ఆహ్వానాలు అందుతాయి. వ్యాపారాలు, ఉద్యోగాలలో నూతనోత్సాహం. దైవదర్శనాలు.

కుంభం: పనులు వాయిదా వేస్తారు. దూరప్రయాణాలు. ఇంటాబయటా సమస్యలు. బంధుమిత్రులతో విభేదాలు. విద్యార్థుల యత్నాలు నిదానిస్తాయి. వ్యాపారాలు, ఉ ద్యోగాలలో కొన్ని ఇబ్బందులు. అనారోగ్యం.

మీనం: పరిస్థితులు అనుకూలించవు. వ్యయప్రయాసలు. మిత్రుల నుంచి ఒత్తిడులు. చేపట్టిన వ్యవహారాలలో ఆటంకాలు. ప్రయాణాలు వాయిదా. వ్యాపారాలు, ఉద్యోగాలలో కొద్దిపాటి ఇబ్బందులు.
– సింహంభట్ల సుబ్బారావు

Read latest Astrology News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top