గ్రహం అనుగ్రహం (16-12-2019)

Daily Rasi Phalalu in Telugu (16-12-2019) - Sakshi

శ్రీవికారినామ సంవత్సరం. దక్షిణాయనం, హేమంత ఋతువు. మార్గశిర మాసం. తిథి బ.చవితి ఉ.6.54 వరకు, తదుపరి పంచమి తె.4.55 వరకు (తెల్లవారితే మంగళవారం). నక్షత్రం ఆశ్లేష తె.4.35 వరకు (తెల్లవారితే మంగళవారం). వర్జ్యం సా.5.55 నుంచి 7.26 వరకు. దుర్ముహూర్తం ప.12.15 నుంచి 1.01 వరకు, తదుపరి ప.2.29 నుంచి 3.11 వరకు. అమృత ఘడియలు రా.3.01 నుంచి 4.32 వరకు.

సూర్యోదయం: 6.26 సూర్యాస్తమయం : 5.24
రాహుకాలం :  ఉ.7.30 నుంచి  9.00 వరకు. యమగండం : ఉ.10.30 నుంచి 12.00 వరకు

భవిష్యం
మేషం:  సన్నిహితులతో తగాదాలు. ఆకస్మిక ప్రయాణాలు. కొత్తగా రుణాలు చేస్తారు. శ్రమ తప్ప ఫలితం కనిపించదు. ఆస్తి వివాదాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో నిరుత్సాహం.

వృషభం: మిత్రుల సహాయం అందుతుంది. వ్యవహారాలలో విజయం. శుభవార్తలు వింటారు. ఆకస్మిక ధనలాభం. ప్రముఖులతో పరిచయాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు ఉత్సాహవంతంగా సాగుతాయి.

మిథునం: మిత్రులతో స్వల్ప వివాదాలు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. కుటుంబసభ్యులు నుంచి ఒత్తిళ్లు. దైవదర్శనాలు చేసుకుంటారు. వ్యాపారాలు, ఉద్యోగాలు మందకొడిగా సాగుతాయి.

కర్కాటకం: ముఖ్య నిర్ణయాలు తీసుకుంటారు. నూతన పరిచయాలు. సంఘంలో విశేష గౌరవం. భూలాభాలు కలుగుతాయి. శ్రమ ఫలిస్తుంది. వాహనయోగం. వ్యాపారాలు, ఉద్యోగాలలో అనుకూల మార్పులు.

సింహం: మిత్రులతో వివాదాలు. ఆలోచనలు నిలకడగా ఉండవు. పనులు వాయిదా వేస్తారు. దూరప్రయాణాలు. విద్యార్థులకు నిరుత్సాహం. వ్యాపారాలు, ఉద్యోగాలలో కొంత గందరగోళ పరిస్థితి.

కన్య: శుభకార్యాలకు హాజరవుతారు. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. సేవాకార్యక్రమాలలో పాల్గొంటారు. విచిత్ర సంఘటనలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో మరింత ప్రోత్సాహం.

తుల: కుటుంబంలో శుభకార్యాలు. ఆర్థిక ప్రగతి. రుణవిముక్తి. సంఘంలో గౌరవం. చిన్ననాటి మిత్రుల  కలయిక. విందువినోదాలు. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో అనుకూలం.

వృశ్చికం: అనుకున్న పనుల్లో అవాంతరాలు. ఆర్థిక ఇబ్బందులు. కుటుంబసభ్యులతో వివాదాలు. ఆకస్మిక ప్రయాణాలు. ఆధ్యాత్మిక చింతన. వ్యాపారాలు, ఉద్యోగాలలో స్వల్ప చికాకులు.

ధనుస్సు: శ్రమాధిక్యం. పనుల్లో  తొందరపాటు. ప్రయాణాలు వాయిదా వేస్తారు. బంధుమిత్రులతో వివాదాలు. ధార్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపారాలు, ఉద్యోగాలు నిరుత్సాహపరుస్తాయి.

మకరం: ఆసక్తికర సమాచారం. విందువినోదాలు. వ్యవహారాలలో విజయం. శుభకార్యాలలో పాల్గొంటారు. ధన, వస్తులాభాలు. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగాలలో అదనపు బాధ్యతలు తప్పుతాయి.

కుంభం: చిన్ననాటి విషయాలు గుర్తుకు వస్తాయి. సభలు, సమావేశాలలో పాల్గొంటారు. శ్రమ వృథా కాదు. కొన్ని పనులు సకాలంలో పూర్తి చేస్తారు. వ్యాపారాలలో లాభాలు. ఉద్యోగాలు ఉత్సాహవంతంగా సాగుతాయి.

మీనం: మిత్రులతో స్వల్ప వివాదాలు. అనుకోని ప్రయాణాలు. అనారోగ్యం. ధనవ్యయం. ఉద్యోగ ప్రయత్నాలు నెమ్మదిస్తాయి. వ్యాపారాలు సామాన్యంగా ఉంటాయి. ఉద్యోగాలలో మార్పులు.– సింహంభట్ల సుబ్బారావు

Read latest Astrology News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top