గ్రహం అనుగ్రహం (07-07-2019)

Daily Horoscope Telugu July07 - Sakshi

శ్రీ వికారి నామ సంవత్సరం, ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు ఆషాఢమాసం, తిథి శు. పంచమి ప.2.13 వరకు, తదుపరి షష్ఠి, నక్షత్రం పుబ్బ రా.12.36 వరకు, తదుపరి ఉత్తర వర్జ్యం ఉ.9.44 నుంచి 11.13 వరకు దుర్ముహూర్తం సా.4.47 నుంచి 5.39 వరకు, అమృతఘడియలు... సా.6.40 నుంచి 8.09 వరకు. 

సూర్యోదయం        :  5.34
సూర్యాస్తమయం    :  6.32
రాహుకాలం          :  సా.4.30 నుంచి 6.00 వరకు
యమగండం         :  ప.12.00 నుంచి 1.30 వరకు 

భవిష్యం
మేషం: కొత్తగా రుణాలు చేస్తారు. పనులలో స్వల్ప ఆటంకాలు. దూరప్రయాణాలు. ఆధ్యాత్మిక చింతన. వృత్తి, వ్యాపారాలలో ఒడిదుడుకులు. శ్రమ తప్ప ఫలితం కనిపించదు. అనారోగ్యం.

వృషభం: ఆర్థిక లావాదేవీలు అంతగా అనుకూలించవు. పనులలో జాప్యం. నిరుద్యోగులకు శ్రమాధిక్యం. దైవచింతన. వ్యాపారాలు కొంత అనుకూలం. ఉద్యోగాలలో పనిభారం. బంధువులతో మాటపట్టింపులు.

మిథునం: వృత్తి, వ్యాపారాలు మరింత ఉత్సాహంగా సాగుతాయి. ఆత్మీయులు దగ్గరవుతారు. కాంట్రాక్టర్లకు అనుకోని అవకాశాలు. యత్నకార్యసిద్ధి. విద్యార్థులకు ఫలితాలు అనుకూలిస్తాయి.

కర్కాటకం: ఆర్థిక విషయాలలో నిరుత్సాహం. ముఖ్యమైన కార్యక్రమాలు ముందుకు సాగవు. ఆరోగ్యసమస్యలు. కుటుంబసభ్యులతో వివాదాలు. వ్యాపారాలు ముందుకు సాగవు. ఉద్యోగాలలో ఒత్తిడులు.

సింహం: శ్రేయోభిలాషుల సూచనలు పాటిస్తారు. పనులు అనుకున్న విధంగా పూర్తి. గౌరవ మర్యాదలకు లోటు ఉండదు. వృత్తి, వ్యాపారాలలో పురోగతి. కళాకారులకు విశేష సన్మానాలు.

కన్య: శ్రమ పడ్డా ఫలితం అంతగా ఉండదు. దూరప్రయాణాలు. ఒప్పందాలలో ఆటంకాలు. సోదరులతో వివాదాలు. వ్యాపారాలలో కొన్ని ఇబ్బందులు. ఉద్యోగాలలో నిరుత్సాహం.

తుల: వ్యవహారాలలో విజయం. శుభవర్తమానాలు. ఆకస్మిక ధన, వస్తులాభాలు.  సన్నిహితులతో వివాదాల పరిష్కారం. ఉద్యోగయోగం. వ్యాపారాలు సాఫీగా సాగుతాయి. ఉద్యోగాలలో మంచి గుర్తింపు.

వృశ్చికం: కొత్త పనులు చేపడతారు. పరిచయాలు పెరుగుతాయి. సన్నిహితుల సాయం అందుతుంది. వృత్తి, వ్యాపారాలలో మరింత  పురోగతి. వాహనయోగం. ముఖ్య నిర్ణయాలు తీసుకుంటారు.

ధనుస్సు: కుటుంబ సభ్యులతో స్వల్ప వివాదాలు. అనారోగ్యం. ముఖ్యమైన పనుల్లో అవాంతరాలు. ధనవ్యయం. అనుకోని ప్రయాణాలు. వ్యాపారాలు మందగిస్తాయి. ఉద్యోగాలలో స్వల్ప చికాకులు.

మకరం: ఆశ్చర్యకరమైన సంఘటనలు. సోదరులతో విభేదాలు. ఆకస్మిక  «ప్రయాణాలు. శ్రమ మరింత పెరుగుతుంది. విద్యార్థుల కృషి కొంత ఫలిస్తుంది. వ్యాపారాలు మందగిస్తాయి. ఉద్యోగాలలో మార్పులు.

కుంభం: విందువినోదాలు. ప్రముఖుల నుంచి ముఖ్య సందేశం. ఆలయ దర్శనాలు. శుభవర్తమానాలు. ఆస్తిలాభ సూచనలు. వ్యాపారవృద్ధి. ఉద్యోగాలలో అనుకూల పరిస్థితులు.

మీనం: ఆత్మీయులు, బంధువులతో ఆనందంగా గడుపుతారు. విందువినోదాలు. యత్నకార్యసిద్ధి. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. వాహనయోగం. వ్యాపారాలు పుంజుకుంటాయి. ఉద్యోగాలలో సమస్యలు తీరతాయి.
– సింహంభట్ల సుబ్బారావు 

Read latest Astrology News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top