గ్రహం అనుగ్రహం (06-07-2019)

Daily Horoscope in Telugu July06 - Sakshi

శ్రీ వికారి నామ సంవత్సరం, ఉత్తరాయణం, గ్రీష్మఋతువు, ఆషాఢమాసం, తిథి శు.చవితి సా.4.40 వరకు తదుపరి పంచమి, నక్షత్రం మఖ రా.2.20 వరకుతదుపరి పుబ్బ, వర్జ్యం ప.3.06 నుంచి 4.35 వరకు
దుర్ముహూర్తం ఉ.5.33 నుంచి 7.16 వరకు అమృతఘడియలు... రా.12.04 నుంచి 1.32 వరకు. సూర్యోదయం :    5.34 సూర్యాస్తమయం    :  6.32 రాహుకాలం :  ఉ. 9.00 నుంచి 10.30 వరకు
యమగండం :  ప.1.30 నుంచి 3.00 వరకు

భవిష్యం
మేషం: అదనపు ఖర్చులు. దూరప్రయాణాలు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. పనులు ముందుకు సాగవు. వ్యాపారాలలో కొద్దిపాటి చికాకులు. ఉద్యోగాలలో అదనపు పనిభారం.

వృషభం: బంధువులతో స్వల్ప తగాదాలు. దూరప్రయాణాలు. అనుకున్న పనులలో ఆటంకాలు. వృత్తి, వ్యాపారాలలో కొన్ని చికాకులు. ఆలయాల సందర్శనం. బంధువుల కలయిక.

మిథునం: సంఘంలో పరపతి పెరుగుతుంది. సన్నిహితుల నుంచి శుభవర్తమానాలు. వృత్తి, వ్యాపారాలు ఉత్సాహంగా సాగుతాయి. ధనలాభం. ప్రముఖులతో పరిచయాలు. నూతన ఉద్యోగాలు దక్కుతాయి.

కర్కాటకం: కొన్ని కార్యక్రమాలను వాయిదా వేస్తారు. ఆకస్మిక ప్రయాణాలు. ఆరోగ్యభంగం. శ్రమ పెరుగుతుంది. వ్యాపారాలలో ఒడిదుడుకులు. ఉద్యోగాలలో మార్పులకు అవకాశం. దైవచింతన.

సింహం: అనుకోని ధనలాభం. సన్నిహితులు, శ్రేయోభిలాషుల సలహాలు స్వీకరిస్తారు. సభలు, సమావేశాలలో పాల్గొంటారు. వాహనయోగం. వ్యాపార వృద్ధి. ఉద్యోగాలలో మరింత ఆదరణ.

కన్య: ఆర్థిక వ్యవహారాలు నిరాశ పరుస్తాయి. కుటుంబంలో ఒత్తిడులు. ఆలయ దర్శనాలు. అనుకోని ప్రయాణాలు.  వ్యాపారాలు సామాన్యం. ఉద్యోగాలలో అదనపు బాధ్యతలు. ఆరోగ్య సమస్యలు.

తుల: నూతన వరిచయాలు. శుభకార్యాల నిర్వహణ. వాహనయోగం. వృత్తి, వ్యాపారాలు ఆశాజనకంగా ఉంటాయి. ఆలయాలు దర్శిస్తారు. సంఘంలో విశేష గౌరవం. విద్యావకాశాలు.

వృశ్చికం: చేపట్టిన పనులలో విజయం. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. విందువినోదాలు. సోదరులతో వివాదాలు తీరతాయి. శుభవార్తలు. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగాలలో ఆటుపోట్లు తొలగుతాయి.

ధనుస్సు: కుటుంబసభ్యులతో వివాదాలు. ఆరోగ్యసమస్యలు. పనులు ముందుకు సాగవు. ఆర్థికంగా కొంత ఇబ్బంది. ఆస్తులపై ఒత్తిడులు. వ్యాపారాలు సామాన్యమే. ఉద్యోగాలలో కొత్త బాధ్యతలు.

మకరం: వ్యవహారాలలో  కొన్ని ఆటంకాలు. బంధువులతో మాటపట్టింపులు. వృత్తి, వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి. ఆరోగ్య, కుటుంబ సమస్యలు. ఆలయాల సందర్శనం.

కుంభం: విద్యార్థులకు కొత్త ఆశలు చిగురిస్తాయి. కాంట్రాక్టులు దక్కుతాయి. విందువినోదాలు. యత్నకార్యసిద్ధి. కొన్ని సమస్యల నుంచి బయటపడతారు. వ్యాపారాభివృద్ధి. ఉద్యోగాలలో చిక్కులు తొలగుతాయి.

మీనం: వ్యవహారాలలో విజయం. శుభవర్తమానాలు. అదనపు రాబడి. వృత్తి, వ్యాపారాలు పుంజుకుంటాయి. సన్నిహితులు సాయం అందిస్తారు. నిరుద్యోగుల యత్నాలు సఫలం. వాహనయోగం.– సింహంభట్ల సుబ్బారావు

Read latest Astrology News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top