గ్రహం అనుగ్రహం (31-12-2019)

Daily Horoscope in Telugu (31-12-2019) - Sakshi

శ్రీ వికారి నామ సంవత్సరం, దక్షిణాయనం, హేమంత ఋతువు పుష్యమాసం, తిథి శు.పంచమి ప.2.36 వరకు, తదుపరి షష్ఠి నక్షత్రం శతభిషం రా.12.36 వరకు, తదుపరి పూర్వాభాద్రవర్జ్యం ఉ.6.12 నుంచి 7.56 వరకు, దుర్ముహూర్తం ఉ.8.44 నుంచి 9.28 వరకు, తదుపరి రా.10.43 నుంచి 11.35 వరకుఅమృతఘడియలు... సా.4.43 నుంచి 6.28 వరకు.

సూర్యోదయం         :  6.34
సూర్యాస్తమయం    :  5.32
రాహుకాలం :  ప. 3.00 నుంచి 4.30 వరకు
యమగండం :  ఉ.9.00 నుంచి 10.30 వరకు

భవిష్యం
మేషం:    దూరప్రాంతాల నుంచి శుభవార్తలు. ఆర్థికాభివృద్ధి. పనుల్లో పురోగతి. ఆస్తి వివాదాలు తీరతాయి. వ్యాపార, ఉద్యోగాలలో ప్రోత్సాహకరంగా ఉంటుంది.

వృషభం: నూతనోత్సాహంతో పనులు పూర్తి. చిన్ననాటి మిత్రుల నుంచి ఆహ్వానాలు. ఇంటాబయటా అనుకూలత. విచిత్రమైన సంఘటనలు. వృత్తి, వ్యాపారాలు ఆశాజనకంగా ఉంటాయి.

మిథునం: ఆకస్మిక ప్రయాణాలు. రుణాలు చేస్తారు. బంధువులతో విభేదాలు. విద్యార్థులకు నిరుత్సాహం. వృత్తి, వ్యాపారాలలో ఒత్తిడులు. ఆలయ దర్శనాలు.

కర్కాటకం: శ్రమ పెరుగుతుంది. పనుల్లో జాప్యం. ఆర్థిక పరిస్థితి నిరాశ కలిగిస్తుంది. అనారోగ్యం. కుటుంబసభ్యులతో వివాదాలు. వృత్తి, వ్యాపారాలలో కొంత నిరాశ.

సింహం: మిత్రుల సలహాలు స్వీకరిస్తారు. సంఘంలో గౌరవం. విలువైన వస్తువులు సేకరిస్తారు. ఇంటర్వ్యూలు అందుతాయి. వ్యాపారాలు, ఉద్యోగాలు ఉత్సాహంగా సాగుతాయి.

కన్య: ఆర్థిక వ్యవహారాలు నిరాశ కలిగిస్తాయి. శ్రమా«ధిక్యం. కొన్ని పనులు వాయిదా వేస్తారు. బంధువులతో వివాదాలు. ఆ«ధ్యాత్మిక చింతన. వృత్తి, వ్యాపారాలు మందగిస్తాయి.

తుల: కొత్త విషయాలు తెలుసుకుంటారు. ప్రముఖులతో పరిచయాలు. చిన్ననాటి మిత్రుల కలయిక. విందువినోదాలు. వ్యాపార, ఉద్యోగాలలో ఉత్సాహం. దైవచింతన.

వృశ్చికం: కుటుంబసభ్యులతో స్వల్ప వివాదాలు. అనారోగ్యం. పనుల్లో ఆటంకాలు. ధనవ్యయం. వృత్తి, వ్యాపారాలలో కొద్దిపాటి చికాకులు. విద్యార్థులకు శ్రమా«ధిక్యం.

ధనుస్సు: నూతన ఉద్యోగయోగం. కీలక నిర్ణయాలు తీసుకుంటారు. శ్రమ ఫలిస్తుంది. వాహనయోగం. వ్యాపార, ఉద్యోగాలలో నూతనోత్సాహం. ధార్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు.

మకరం: వ్యయప్రయాసలు. ధనవ్యయం. పనుల్లో జాప్యం. ఆర్థిక పరిస్థితి అంతగా అనుకూలించదు. బంధువులతో మాటపట్టింపులు. వ్యాపార, ఉద్యోగాలు నిరాశ కలిగిస్తాయి.

కుంభం: పనుల్లో విజయం. శుభవార్తలు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. సన్నిహితుల సాయం అందుతుంది. వస్తులాభాలు. వృత్తి, వ్యాపారాలలో పురోగతి కనిపిస్తుంది.

మీనం: రుణాలు చేస్తారు. ఆర్థిక పరిస్థితి కొంత నిరాశ కలిగిస్తుంది. పనుల్లో జాప్యం. అనారోగ్యం. కుటుంబసభ్యులతో వివాదాలు. వ్యాపార, ఉద్యోగాలు కొంత గందరగోళంగా ఉంటాయి.– సింహంభట్ల సుబ్బారావు

Read latest Astrology News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top