గ్రహం అనుగ్రహం (30-12-2019)

Daily Horoscope in Telugu (30-12-2019) - Sakshi

శ్రీవికారినామ సంవత్సరం. దక్షిణాయనం, హేమంత ఋతువు. పుష్యమాసం. తిథి శు.చవితి ప.12.54 వరకు, తదుపరి పంచమి. నక్షత్రం ధనిష్ఠ రా.10.21 వరకు. తదుపరి శతభిషం. వర్జ్యం లేదు. దుర్ముహూర్తం ప.12.23 నుంచి 1.07 వరకు, తదుపరి ప.2.35 నుంచి 3.21 వరకు. అమృత ఘడియలు ఉ.11.03 నుంచి 12.45 వరకు

సూర్యోదయం: 6.34 సూర్యాస్తమయం : 5.32
రాహుకాలం :  ఉ.7.30 నుంచి  9.00 వరకు.
యమగండం : ఉ.10.30 నుంచి 12.00 వరకు

భవిష్యం
మేషం:  సన్నిహితులతో సఖ్యత. ఇంటాబయటా అనుకూలం. కొత్త విషయాలు తెలుస్తాయి. ప్రతిభ వెలుగులోకి వస్తుంది. వాహనయోగం. వ్యాపారాలు, ఉద్యోగాలలో మరింత అభివృద్ధి.

వృషభం: సన్నిహితులు, మిత్రులతో విభేదాలు. ఆర్థిక పరిస్థితి నిరాశ కలిగిస్తుంది. దూరప్రయాణాలు. కుటుంబంలో ఒత్తిడులు. వ్యాపారాలు, ఉద్యోగాలలో చికాకులు.

మిథునం: చేపట్టిన పనులు ముందుకు సాగవు. ఆలోచనలు నిలకడగా ఉండవు. శ్రమ తప్పదు. ఆధ్యాత్మిక చింతన. ఒప్పందాలు వాయిదా. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఒడిడుదుడుకులు.

కర్కాటకం: సన్నిహితులతో వివాదాలు తీరతాయి. ఆప్తుల నుంచి శుభవార్తలు. ఆకస్మిక ధన, వస్తులాభాలు. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. వ్యాపారాలు, ఉద్యోగాలు మరింత ఉత్సాహంగా సాగుతాయి.

సింహం: కొత్త వ్యక్తుల పరిచయం. శుభవార్తా శ్రవణం. విందువినోదాలు. వాహనాలు కొంటారు. కొన్ని వివాదాలు పరిష్కారం. వ్యాపారాలు, ఉద్యోగాలలో సమస్యలు తీరతాయి.

కన్య: ఆస్తి వివాదాలు. అనుకోని ప్రయాణాలు. పనుల్లో అవాంతరాలు. బంధుమిత్రుల నుంచి ఒత్తిడులు. ఆలయ దర్శనాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో కొద్దిపాటి చికాకులు.

తుల: మిత్రులు ఒత్తిడులు పెంచుతారు. ఆర్థిక ఇబ్బందులు. దూరప్రయాణాలు. ఇంటాబయటా సమస్యలు. ఆరోగ్యభంగం. వ్యాపారాలు, ఉద్యోగాలలో బాధ్యతలు పెరుగుతాయి.

వృశ్చికం: పనులు సకాలంలో పూర్తి చేస్తారు. ఆత్మీయుల నుంచి పిలుపు. విందువినోదాలు. ఆర్థికాభివృద్ధి. కీలక నిర్ణయాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు సంతృప్తికరంగా ఉంటాయి.

ధనుస్సు: మిత్రులతో వివాదాలు. ఆలోచనలు కలసిరావు. పనులు వాయిదా వేస్తారు. శ్రమాధిక్యం. ఆలయ దర్శనాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు మందగిస్తాయి. ధనవ్యయం.

మకరం: పనులు చకచకా సాగుతాయి. భూవివాదాలు పరిష్కారం. శుభకార్యాలలో పాల్గొంటారు. బాకీలు వసూలవుతాయి. దైవదర్శనాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో మరింత ప్రగతి.

కుంభం: మిత్రులతో విభేదాలు. ఆర్థిక వ్యవహారాలు నిరాశ కలిగిస్తాయి. శ్రమాధిక్యం. కొన్ని పనులు వాయిదా వేస్తారు. ధనవ్యయం. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఒడిదుడుకులు.

మీనం: కొత్త వ్యక్తుల పరిచయం. వేడుకల్లో పాల్గొంటారు. సంఘంలో గౌరవం. ఆస్తి వివాదాలు పరిష్కారం. శుభవార్తలు వింటారు. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగాలలో పనిఒత్తిడులు తొలగుతాయి.– సింహంభట్ల సుబ్బారావు

Read latest Astrology News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top