గ్రహం అనుగ్రహం (28-12-2019)

Daily Horoscope in Telugu (28-12-2019) - Sakshi

శ్రీ వికారి నామ సంవత్సరం, దక్షిణాయనం, హేమంత ఋతువు, పుష్య మాసం, తిథి శు.విదియ ఉ.10.40 వరకు తదుపరి తదియ, నక్షత్రం ఉత్తరాషాఢ రా.6.51 వరకుతదుపరి శ్రవణం, వర్జ్యం రా.11.04 నుంచి 12.46 వరకు దుర్ముహూర్తం ఉ.6.32 నుంచి 8.01 వరకుఅమృతఘడియలు... ప.12.08 నుంచి 1.45 వరకు.

సూర్యోదయం :    6.33
సూర్యాస్తమయం    :  5.30
రాహుకాలం :  ఉ.9.00 నుంచి 10.30 వరకు
యమగండం :  ప.1.30 నుంచి 3.00 వరకు

భవిష్యం
మేషం:    పనులు వాయిదా వేస్తారు. దూరప్రయాణాలు. ఇంటాబయటా ఒత్తిడులు. ఆధ్యాత్మిక చింతన. కాంట్రాక్టులు చేజారతాయి. వ్యాపారాలు, ఉద్యోగాలలో వివాదాలు.

వృషభం: మిత్రుల నుంచి ఒత్తిడులు. ఆకస్మిక ప్రయాణాలు. దైవచింతన. ఆస్తి వివాదాలు నెలకొంటాయి. అనారోగ్యం. వ్యాపారాలు, ఉద్యోగాలలో కొన్ని సమస్యలు.

మిథునం: ప్రముఖుల నుంచి ఆహ్వానాలు. నూతన ఉద్యోగాలు దక్కుతాయి. పరిచయాలు పెరుగుతాయి. వాహనయోగం. ఆకస్మిక ధనలాభం. వ్యాపారాలు, ఉద్యోగాలలో అంచనాలు నిజమవుతాయి.

కర్కాటకం: ఆకస్మిక ధనలబ్ధి. ప్రముఖుల నుంచి కీలక సమాచారం. స్థిరాస్తి వృద్ధి. పనులు విజయవంతంగా సాగుతాయి. ఉద్యోగయత్నాలు సఫలం. వ్యాపారాలు, ఉద్యోగాలలో మరింత పురోగతి.

సింహం: సన్నిహితులు, మిత్రుల నుంచి ఒత్తిడులు. ఆలయాలు సందర్శిస్తారు. కొన్ని పనులు వాయిదా పడతాయి. ఆకస్మిక ప్రయాణాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో నిరుత్సాహం.

కన్య: ఆర్థిక పరిస్థితి గందరగోళం. దూరప్రయాణాలు. అనుకోని ఖర్చులు. బంధువులతో స్వల్ప విభేదాలు. శ్రమధిక్యం. నిరుద్యోగులకు నిరాశ. వ్యాపారాలు, ఉద్యోగాలలో కొంత అసంతృప్తి.

తుల: చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. ఆర్థిక వ్యవహారాలు ఆశాజనకంగా ఉంటాయి. శ్రమకు ఫలితం కనిపిస్తుంది. పనుల్లో విజయం. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగాలలో హోదాలు రాగలవు.

వృశ్చికం: కొన్ని వ్యవహారాలు మందగిస్తాయి. శ్రమాధిక్యం. బంధువులతో వివాదాలు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. కుటుంబంలో ఒత్తిడులు. వ్యాపారాలు, ఉద్యోగాలలో నిరుత్సాహం.

ధనుస్సు: విచిత్ర సంఘటనలు. ఆకస్మిక ధన, వస్తులాభాలు. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. భూవివాదాలు పరిష్కారం. వ్యాపారాలు, ఉద్యోగాలలో అనుకూల మార్పులు.

మకరం: సన్నిహితుల నుంచి సమస్యలు. ధనవ్యయం. ప్రయాణాలలో మార్పులు. ఆలయాలు సందర్శిస్తారు. పనులలో స్వల్ప అవాంతరాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో సమస్యలు.

కుంభం: వ్యవహారాలు ఆశాజనకంగా ఉంటాయి. సన్నిహితులతో సఖ్యత. విందువినోదాలు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. వ్యాపారాలు, ఉద్యోగాలలో మరింత అనుకూలం.

మీనం: పలుకుబడి పెరుగుతుంది. సన్నిహితుల సాయం అందుతుంది. పనులు సకాలంలో పూర్తి చేస్తారు. ధన, వస్తులాభాలు. వ్యాపారాలు వృద్ధి చెందుతాయి. ఉద్యోగాలలో కొత్త అవకాశాలు.– సింహంభట్ల సుబ్బారావు

Read latest Astrology News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top