గ్రహం అనుగ్రహం (27-05-2020)

Daily Horoscope in Telugu (27-05-2020) - Sakshi

శ్రీ శార్వరి నామ సంవత్సరం, ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు జ్యేష్ఠ మాసం, తిథి శు.పంచమి రా.10.25 వరకు, తదుపరి షష్ఠి, నక్షత్రం పునర్వసు ఉ.6.04 వరకు, తదుపరి పుష్యమివర్జ్యం ప.1.56 నుంచి 3.30 వరకు, దుర్ముహూర్తం ప.11.30 నుంచి 12.22 వరకు, అమృతఘడియలు... రా.11.23 నుంచి 12.54 వరకు.

సూర్యోదయం :    5.29
సూర్యాస్తమయం    :  6.24
రాహుకాలం :  ప. 12.00 నుంచి 1.30 వరకు
యమగండం :  ఉ.7.30 నుంచి 9.00 వరకు

గ్రహఫలం
మేషం: పనులు నెమ్మదిస్తాయి. ఆలోచనలు నిలకడగా ఉండవు. కుటుంబసభ్యులతో విభేదాలు. ఆర్థిక లావాదేవీలు నిరాశ పరుస్తాయి. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఒత్తిడులు.

వృషభం: పనులు సకాలంలో పూర్తి చేస్తారు. ఆత్మీయుల ఆదరణ పొందుతారు. చిన్ననాటి మిత్రుల కలయిక. వస్తులాభాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఆటుపోట్లు తొలగుతాయి.

మిథునం: పనులు నెమ్మదిగా కొనసాగుతాయి. ఆత్మీయులతో మాటపట్టింపులు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపారాలు, ఉద్యోగాలు సామాన్యంగా ఉంటాయి.

కర్కాటకం: సన్నిహితులు, మిత్రులతో ఆనందంగా గడుపుతారు. పనులు విజయవంతంగా సాగుతాయి. దైవదర్శనాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు సంతృప్తికరంగా ఉంటాయి.

సింహం: పనుల్లో తొందరపాటు. వృథా ఖర్చులు. బాధ్యతలు పెరుగుతాయి. ఆకస్మిక ప్రయాణాలు. కుటుంబంలో ఒత్తిడులు. వ్యాపారాలు, ఉద్యోగాలు మందగిస్తాయి.

కన్య: రుణబాధలు తొలగుతాయి. ఆత్మీయులతో ఆనందంగా గడుపుతారు. సేవాకార్యక్రమాలలో పాల్గొంటారు. వస్తులాభాలు. వ్యాపారాలు లాభిస్తాయి. ఉద్యోగాలలో మరింత ప్రోత్సాహం.

తుల: ఉద్యోగయత్నాలు అనుకూలిస్తాయి. సంఘంలో గౌరవం. ఆర్థిక ప్రగతి. స్థిరాస్తి వివాదాలు తొలగుతాయి. వ్యాపారాలు వృద్ధి చెందుతాయి. ఉద్యోగాలలో అనుకూలస్థితి.

వృశ్చికం: పనులు వాయిదా వేస్తారు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. ఆరోగ్యభంగం. శ్రమ పెరుగుతుంది. బంధువులతో మాటపట్టింపులు. దైవచింతన. వ్యాపారాలు, ఉద్యోగాలు నత్తనడకన సాగుతాయి.

ధనుస్సు: కొన్ని పనులు వాయిదా పడతాయి. ఆలోచనలు కలసిరావు. కుటుంబంలో ఒత్తిడులు. ధనవ్యయం. బంధువుల కలయిక. వ్యాపారాలు, ఉద్యోగాలు సామాన్యంగా ఉంటాయి.

మకరం: కొత్త పనులు చేపడతారు. ఆత్మీయులతో సఖ్యత. ఇంటాబయటా అనుకూలం. ఆకస్మిక ధనలాభం. ఆహ్వానాలు అందుతాయి. వ్యాపారాలు, ఉద్యోగాలు అనుకూలిస్తాయి.

కుంభం: సన్నిహితులు సాయం అందిస్తారు. ఏ పని చేపటినా విజయమే. ఆహ్వానాలు అందుతాయి. దైవదర్శనాలు. వ్యాపారాలు లాభిస్తాయి. ఉద్యోగాలలో పురోగతి.

మీనం: సన్నిహితులతో మాటపట్టింపులు. ఆర్థిక ఇబ్బందులు. ఆకస్మిక ప్రయాణాలు. ఇంటాబయటా ఒత్తిడులు. దైవదర్శనాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో కొద్దిపాటి చికాకులు.

Read latest Astrology News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top