గ్రహం అనుగ్రహం (24-12-2019)

Daily Horoscope in Telugu (24-12-2019) - Sakshi

శ్రీ వికారి నామ సంవత్సరం, దక్షిణాయనం, హేమంత ఋతువు మార్గశిర మాసం, తిథి బ.త్రయోదశి ప.12.14 వరకు, తదుపరి చతుర్దశి, నక్షత్రం అనూరాధ సా.5.30 వరకు, తదుపరి జ్యేష్ఠవర్జ్యం రా.11.00 నుంచి 12.35 వరకు, దుర్ముహూర్తం ఉ.8.41 నుంచి 9.25 వరకు, తదుపరి రా.10.40 నుంచి 11.32 వరకు అమృతఘడియలు... ఉ.7.24 నుంచి 9.01 వరకు.

సూర్యోదయం :    6.30
సూర్యాస్తమయం    :  5.27
రాహుకాలం :  ప. 3.00 నుంచి 4.30 వరకు
యమగండం :  ఉ.9.00 నుంచి 10.30 వరకు

భవిష్యం
మేషం: మిత్రులతో మాటపట్టింపులు. ఆలయ దర్శనాలు. ఆరోగ్య, కుటుంబ సమస్యలు. వ్యవహారాలు మందకొడిగా సాగుతాయి. వ్యాపారాలు, ఉద్యోగాలు నిరాశ పరుస్తాయి.

వృషభం: పనుల్లో పురోగతి. ఇంటాబయటా అనుకూలత. పోటీపరీక్షల్లో విజయం. శుభవార్తలు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. వ్యాపారాలు, ఉద్యోగాలు ఆశాజనకంగా ఉంటాయి.

మిథునం:  కొత్త వ్యక్తుల పరిచయం. శుభవార్తలు వింటారు. వస్తులాభాలు. చిన్ననాటి సంఘటనలు గుర్తుకు వస్తాయి. వ్యాపారాలు, ఉద్యోగాలలో ప్రోత్సాహకరంగా ఉంటుంది.

కర్కాటకం: ఆర్థిక ఇబ్బందులు. రుణయత్నాలు. ఆకస్మిక ప్రయాణాలు. సోదరులతో విభేదాలు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. వ్యాపారాలు, ఉద్యోగాలు సామాన్యంగా ఉంటాయి.

సింహం: కొన్ని పనులు మధ్యలో విరమిస్తారు. దూరప్రయాణాలు. అనారోగ్యం. బంధువులతో వివాదాలు. ఆలోచనలు స్థిరంగా ఉండవు.  దైవదర్శనాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు గందరగోళంగా ఉంటాయి.

కన్య: కొత్త వ్యక్తుల పరిచయం. శుభవార్తలు. ఆర్థిక పరిస్థితి ప్రోత్సాహకరంగా ఉంటుంది. ఆహ్వానాలు అందుతాయి. వస్తులాభాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు సంతృప్తికరంగా ఉంటాయి.

తుల: కొన్ని వ్యవహారాలు నత్తనడకన సాగుతాయి. వ్యయప్రయాసలు. దైవదర్శనాలు. బంధువులతో వివాదాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు నిరుత్సాహపరుస్తాయి.

వృశ్చికం: కుటుంబంలో శుభకార్యాలు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. సన్నిహితులతో విభేదాలు తొలగుతాయి. పనులు సకాలంలో పూర్తి చేస్తారు.  వ్యాపారాలు, ఉద్యోగాలలో నూతనోత్సాహం.

ధనుస్సు: ఆర్థిక ఇబ్బందులు. పనులు కొన్ని వాయిదా వేస్తారు. ఆలోచనలు నిలకడగా ఉండవు. బంధువులతో మాటపట్టింపులు. వ్యాపారాలు, ఉద్యోగాలు నిరాశ కలిగిస్తాయి.

మకరం: ఉద్యోగయత్నాలు సానుకూలం. సోదరులతో వివాదాలు తీరతాయి. వాహన యోగం. కీలక నిర్ణయాలు. పరిచయాలు పెరుగుతాయి. వ్యాపారాలు లాభిస్తాయి. ఉద్యోగులకు ఉన్నతహోదాలు.

కుంభం: ఆస్తి వివాదాల పరిష్కారం. విందువినోదాలు. ఆలయ దర్శనాలు. యత్నకార్యసిద్ధి. వాహన, గృహయోగాలు. వ్యాపారాలు ఉత్సాహంగా సాగుతాయి. ఉద్యోగులకు పదోన్నతులు.

మీనం: ఆకస్మిక ప్రయాణాలు. రుణాలు చేస్తారు. ఆరోగ్యభంగం.  శ్రమ పడ్డా ఫలితం కనిపించదు. ఆస్తి వివాదాలు. వ్యాపారాలు సాదాసీదాగా ఉంటాయి. ఉద్యోగులకు పనిభారం.– సింహంభట్ల సుబ్బారావు

Read latest Astrology News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top