గ్రహం అనుగ్రహం (22-05-2020)

Daily Horoscope in Telugu (22-05-2020) - Sakshi

శ్రీ శార్వరి నామ సంవత్సరం, ఉత్తరాయణం, వసంత ఋతువు వైశాఖ మాసం, తిథి అమావాస్య రా.10.37 వరకు, తదుపరి జ్యేష్ఠ శు.పాడ్యమి, నక్షత్రం  కృత్తిక రా.3.01 వరకు, వర్జ్యం. ప.2.01 నుంచి 3.44 వరకు, దుర్ముహూర్తం  ఉ.8.06 నుంచి 8.56 వరకుతిరిగి ప.12.22 నుంచి 1.13 వరకు, అమృతఘడియలు... రా.12.13 నుంచి 1.54 వరకు.

సూర్యోదయం :    5.30
సూర్యాస్తమయం    :  6.22
రాహుకాలం : ఉ.10.30 నుంచి 12.00 వరకు
యమగండం :  ప.3.00 నుంచి 4.30 వరకు

గ్రహఫలం
మేషం:మిత్రులతో విభేదాలు. ఆర్థిక ఇబ్బందులు. అనుకోని ప్రయాణాలు. ఇంటాబయటా ఒత్తిడులు. అనారోగ్యం. వ్యాపారాలు కొంత నిదానిస్తాయి. ఉద్యోగాలలో కొద్దిపాటి చికాకులు.

వృషభం:పరిస్థితులు అనుకూలిస్తాయి. ఆర్థిక విషయాలు ఆశాజనకంగా ఉంటాయి. సన్నిహితులతో సఖ్యత. వస్తు, వస్త్రలాభాలు. చిన్ననాటి మిత్రుల కలయిక. వ్యాపారాలు, ఉద్యోగాలలో అభివృద్ధి.

మిథునం:పనుల్లో అవాంతరాలు. ప్రయాణాలు వాయిదా వేస్తారు. ఆలోచనలు కలసిరావు. బాధ్యతలు మరింత పెరుగుతాయి. వ్యాపారాల విస్తరణ  ముందుకు సాగదు. ఉద్యోగాలలో చికాకులు.

కర్కాటకం:పాతబాకీలు వసూలవుతాయి. ఆధ్యాత్మిక చింతన. వ్యవహారాలలో విజయం. శుభవార్తలు వింటారు. బంధువుల కలయిక. వ్యాపారాలలో లాభాలు. ఉద్యోగాలలో అనుకూల మార్పులు.

సింహం:పలుకుబడి పెరుగుతుంది. ఆసక్తికర సమాచారం. ఇంటాబయటా మీదే పైచేయిగా ఉంటుంది. సన్నిహితుల నుంచి ధనలాభం. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగాలలో ఆటుపోట్లు తొలగుతాయి.

కన్య:కొత్త రుణయత్నాలు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. ఆరోగ్యభంగం. ప్రయాణాలు వాయిదా వేస్తారు. దైవదర్శనాలు. సోదరులతో మాటపట్టింపులు. వ్యాపారాలు, ఉద్యోగాలలో కాస్త  శ్రమపడాలి.

తుల: దూరప్రయాణాలు. బంధుమిత్రులతో విభేదాలు. ఆర్థిక ఇబ్బందులు. ధార్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. ఆరోగ్యంపై శ్రద్ధ చూపండి. వ్యాపారాలు, ఉద్యోగాలలో చికాకులు.

వృశ్చికం:పరపతి పెరుగుతుంది. సంఘంలో గౌరవం దక్కుతుంది. పనులు సకాలంలో పూర్తి చేస్తారు. ఆస్తి లాభం. కీలక నిర్ణయాలు. వ్యాపారాలు కొంతమేర లాభిస్తాయి. ఉద్యోగాలలో నిరుత్సాహం.

ధనుస్సు: కొత్త పనులకు శ్రీకారం. శుభవార్తలు వింటారు. ఆస్తి వ్యవహారాలు కొలిక్కి వస్తాయి. ప్రముఖులతో పరిచయాలు. సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఉత్సాహవంతంగా ఉంటుంది.

మకరం: ఆర్థిక విషయాలు నిరుత్సాహపరుస్తాయి. శ్రమాధిక్యం. పనుల్లో తొందరపాటు. ప్రయాణాలు విరమిస్తారు. బంధువర్గంతో తగాదాలు. ఆరోగ్యభంగం. వ్యాపారాలు, ఉద్యోగాలలో కొద్దిపాటి ఒత్తిడులు.

కుంభం:పనులు సజావుగా సాగుతాయి. ఆప్తుల నుంచి పిలుపు. ఆర్థికాభివృద్ధి. కీలక నిర్ణయాలు. ఆస్తుల వ్యవహారాలలో చికాకులు అ«ధిగమిస్తారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఎదురుండదు.

మీనం: మిత్రులతో విభేదాలు. ఆకస్మిక ప్రయాణాలు. చేపట్టిన వ్యవహారాలలో అవాంతరాలు. కొత్త రుణాలు చేస్తారు. ఆలోచనలు కలసిరావు. వ్యాపారాలలో చికాకులు. ఉద్యోగాలలో పనిభారం.

Read latest Astrology News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top