గ్రహం అనుగ్రహం (21-12-2019)

Daily Horoscope in Telugu (21-12-2019) - Sakshi

శ్రీ వికారి నామ సంవత్సరం, దక్షిణాయనం, హేమంత ఋతువుమార్గశిర మాసం, తిథి బ.దశమి సా.5.40 వరకు, తదుపరి ఏకాదశి, నక్షత్రం చిత్త రా.8.45 వరకు, తదుపరి స్వాతివర్జ్యం ఉ.5.44 నుంచి 7.14 వరకు, తిరిగి రా.2.00 నుంచి 3.32 వరకు, దుర్ముహూర్తం ఉ.6.30 నుంచి 7.55 వరకుఅమృతఘడియలు... ప.2.43 నుంచి 4.12 వరకు.

సూర్యోదయం :    6.29
సూర్యాస్తమయం    :  5.27
రాహుకాలం :  ఉ.9.00 నుంచి 10.30 వరకు
యమగండం :  ప.1.30 నుంచి 3.00 వరకు

భవిష్యం
మేషం:    ఆహ్వానాలు అందుతాయి. వ్యవహారాలలో విజయం. శుభకార్యాలలో పాల్గొంటారు. బాకీలు వసూలవుతాయి. చిన్ననాటి మిత్రుల కలయిక. వ్యాపారాలు పుంజుకుంంటాయి. ఉద్యోగాలలో చికాకులు తొలగుతాయి.

వృషభం: గత సంఘటనలు గుర్తుకు వస్తాయి. ఆశ్చర్యకరమైన విషయాలు తెలుస్తాయి. పనుల్లో స్వల్ప అవాంతరాలు. రుణయత్నాలు. ఆరోగ్యభంగం. వ్యాపారాలు, ఉద్యోగాలలో కొద్దిపాటి ఇబ్బందులు.

మిథునం: చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. సేవాకార్యక్రమాలు చేపడతారు. ఆత్మీయుల నుంచి పిలుపు అందుతుంది. పనులలో ఆటంకాలు తొలగుతాయి. వ్యాపారాలు, ఉద్యోగాలలో ముందడుగు.

కర్కాటకం: కొత్త వ్యక్తుల పరిచయం. శుభవార్తలు అందుతాయి. వ్యవహారాలు సాఫీగా  సాగుతాయి. కాంట్రాక్టులు పొందుతారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో కొత్త ఆశలు.

సింహం: సన్నిహితులతో వివాదాలు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. పనుల్లో ఆటంకాలు. రుణయత్నాలు ముమ్మరం చేస్తారు. వ్యాపారాలు సామాన్యంగా ఉంటాయి. ఉద్యోగాలలో అదనపు పనిభారం.

కన్య: పనులు చకచకా పూర్తి చేస్తారు. సంఘంలో ఆదరణ. కీలక నిర్ణయాలు తీసుకుంటారు. వాహనయోగం. బంధువుల కలయిక. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగాలలో సమస్యలు తీరతాయి.

తుల: చేపట్టిన పనుల్లో అవాంతరాలు. ధనవ్యయం. కుటుంబసభ్యులతో వివాదాలు. ఆకస్మిక ప్రయాణాలు. ఆలయా లు సందర్శిస్తారు. అనారోగ్యం. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఇబ్బందులు.

వృశ్చికం: కొత్త విషయాలు తెలుస్తాయి. సేవాకార్యక్రమాలలో పాల్గొంటారు. కొన్ని బాకీలు వసూలవుతాయి. వాహనయోగం. వ్యవహారాలలో విజయం. వ్యాపారాలు, ఉద్యోగాలలో నూతనోత్సాహం.

ధనుస్సు: బంధువులతో వివాదాలు తీరతాయి. ఆప్తుల నుంచి కీలక సమాచారం. విందువినోదాలు. వ్యవహారాలలో విజయం. దైవచింతన. వ్యాపారాలు, ఉద్యోగాలలో గందరగోళం తొలగుతుంది.

మకరం: సన్నిహితులతో మాటపట్టింపులు. అనారోగ్యం. అనుకున్న పనుల్లో అవాంతరాలు. కొత్త రుణాలు చేస్తారు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. వ్యాపారాలు, ఉద్యోగాలలో చికాకులు.

కుంభం: వ్యవహారాలలో ఆటంకాలు. ఆర్థిక ఇబ్బందులు. దూరప్రయాణాలు. బంధువులతో తగాదాలు. ఆలయాలు సందర్శిస్తారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో నిరుత్సాహం.

మీనం: చిన్ననాటి మిత్రుల కలయిక. విందువినోదాలు. చర్చలు సఫలం. ఆహ్వానాలు అందుతాయి. వ్యవహారాలు సాఫీగా సాగుతాయి. వ్యాపారాలు, ఉద్యోగాలలో పురోగతి.– సింహంభట్ల సుబ్బారావు

Read latest Astrology News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top