గ్రహం అనుగ్రహం (17-04-2020)

Daily Horoscope in Telugu (17-04-2020) - Sakshi

శ్రీ శార్వరి నామ సంవత్సరం, ఉత్తరాయణం, వసంత ఋతువు చైత్ర మాసం, తిథి బ.దశమి రా.10.05 వరకు, తదుపరి ఏకాదశినక్షత్రం ధనిష్ఠ రా.3.24 వరకు, తదుపరి శతభిషం, వర్జ్యం ఉ.6.07 నుంచి 7.51 వరకు, దుర్ముహూర్తం ఉ.8.14 నుంచి 9.04 వరకు, తదుపరి ప.12.24 నుంచి 1.14 వరకు అమృతఘడియలు... సా.4.19 నుంచి 5.56 వరకు.

సూర్యోదయం :    5.47
సూర్యాస్తమయం    :  6.11
రాహుకాలం : ఉ.10.30 నుంచి 12.00 వరకు
యమగండం :  ప.3.00 నుంచి 4.30 వరకు

మేషం : ధన, వస్తులాభాలు. పాతమిత్రుల కలయిక. ఇంటాబయటా ప్రోత్సాహం. ఉద్యోగయోగం. వ్యాపార, ఉద్యోగాలలో పురోగతి సాధిస్తారు. కళాకారులు కీలక సమాచారం అందుకుంటారు.

వృషభం: శ్రమ పెరుగుతుంది. పనుల్లో అవాంతరాలు. బంధువర్గంతో తగాదాలు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. వ్యాపారాలు, ఉద్యోగాలలో గందరగోళం. పారిశ్రామికవేత్తలకు చికాకులు తప్పవు.

మిథునం: కుటుంబసమస్యలు. అనారోగ్యం. పనుల్లో జాప్యం. సోదరుల కలయిక. ఆకస్మిక ప్రయాణాలు. వ్యాపారాలలో ఒడిదుడుకులు. ఉద్యోగాలలో నిరాశ. కళాకారులకు సమస్యలు.

కర్కాటకం: గతంలోని సంఘటనలు గుర్తుకు వస్తాయి. సభలు, సమావేశాలలో పాల్గొంటారు. బాMీ లు వసూలవుతాయి. వ్యాపార, ఉద్యోగాలలో నూతనోత్సాహం. రాజకీయవేత్తలకు ఆహ్వానాలు.

సింహం: కొత్త వ్యక్తుల పరిచయం. శుభవర్తమానాలు. ఆర్థిక ప్రగతి. ఉద్యోగావకాశాలు. పలుకుబడి పెరుగుతుంది. వ్యాపార, ఉద్యోగాలలో అనుకూలత. పారిశ్రామికవేత్తలకు సమస్యలు తీరతాయి.

కన్య: మిత్రులతో వివాదాలు. అనారోగ్యం. కుటుంబంలో చికాకులు. దూరప్రయాణాలు. వృథా ఖర్చులు. వ్యాపార, ఉద్యోగాలలో నిరుత్సాహం. రాజకీయవేత్తలకు గందరగోళంగా ఉంటుంది.

తుల: శ్రమ తప్పదు. పనులు ముందుకు సాగవు. మిత్రులు, సోదరుల నుంచి ఒత్తిడులు. ఆకస్మిక ప్రయాణాలు. వ్యాపారాలలో నిరాశ. ఉద్యోగాలలో మార్పులు. పారిశ్రామికవేత్తలకు కొత్త సమస్యలు.

వృశ్చికం: పరిచయాలు పెరుగుతాయి. ఆత్మీయులతో ఉత్సాహంగా గడుపుతారు. ఆకస్మిక ధనలాభం. వాహనయోగం. వ్యాపారాలు, ఉద్యోగాలలో చికాకులు తొలగుతాయి. కళాకారులకు శుభవార్తలు.

ధనుస్సు: చేపట్టిన కార్యక్రమాలు ముందుకు సాగవు. ఆర్థిక ఇబ్బందులు ఎదురవుతాయి. ఆకస్మిక ప్రయాణాలు. దైవదర్శనాలు. ఆరోగ్యభంగం. వ్యాపారాలు మందగిస్తాయి. ఉద్యోగాలలో ఒత్తిడులు. పారిశ్రామికవేత్తలకు శ్రమాధిక్యం.

మకరం: ఇంటర్వ్యూలు అందుకుంటారు. పరిచయాలు పెరుగుతాయి. చిన్ననాటి మిత్రుల కలయిక. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఉత్సాహవంతంగా ఉంటుంది. స్థిరాస్తి ఒప్పందాలు చేసుకుంటారు.

కుంభం:రుణయత్నాలు. ఆకస్మిక ప్రయాణాలు. ఆలయాలు సందర్శిస్తారు. అనారోగ్యం. సోదరులతో కలహాలు. వ్యాపారాలు నిరాశ పరుస్తాయి. ఉద్యోగాలలో కొంత గందరగోళం.

మీనం:నిరుద్యోగులకు శుభవార్తలు. ఆర్థికాభివృద్ధి. కీలక నిర్ణయాలు. వ్యవహారాలు సాఫీగా సాగుతాయి. నూతన పరిచయాలు. వ్యాపారాలలో చిక్కులు తొలగుతాయి. ఉద్యోగాలలో విశేష ఆదరణ. కళాకారులకు ఒత్తిడులు తొలగుతాయి.– సింహంభట్ల సుబ్బారావు

Read latest Astrology News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top