గ్రహం అనుగ్రహం (17-02-2020)
శ్రీ వికారినామ సంవత్సరం. ఉత్తరాయణం, శిశిర ఋతువు. మాఘ మాసం. తిథి బ.నవమి రా.6.59 వరకు, తదుపరి దశమి. నక్షత్రం అనూరాధ ఉ.9.28 వరకు, తదుపరి జ్యేష్ఠ. వర్జ్యం ప.2.54 నుంచి 4.28 వరకు. దుర్ముహూర్తం ప.12.35 నుంచి 1.21 వరకు, తదుపరి ప.2.55 నుంచి 3.41 వరకు. అమృత ఘడియలు రా.12.17 నుంచి 1.50 వరకు.
సూర్యోదయం: 6.30 సూర్యాస్తమయం: 5.59; రాహుకాలం : ఉ.7.30 నుంచి 9.00 వరకు. యమగండం : ఉ.10.30 నుంచి 12.00 వరకు
భవిష్యం
మేషం: పనులు ముందుకు సాగవు. ఆకస్మిక ప్రయాణాలు. ఇంటాబయటా ఒత్తిళ్లు. ఆలయాలు సందర్శిస్తారు. బంధువులతో వివాదాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు మందగిస్తాయి. ఆరోగ్యభంగం.
వృషభం: శుభకార్యాలలో పాల్గొంటారు. బాకీలు వసూలవుతాయి. ఆధ్యాత్మిక చింతన. వ్యవహారాలలో విజయం. ఆకస్మిక ధనలబ్ధి. నూతన ఉద్యోగాలు దక్కుతాయి. వ్యాపారాలు, ఉద్యోగాలలో సమస్యలు తీరతాయి.
మిథునం: కొత్త వ్యక్తుల పరిచయం. శుభవార్తలు. వాహనయోగం. కీలక నిర్ణయాలు తీసుకుంటారు. ఉద్యోగయత్నాలు సానుకూలం. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఒత్తిడులు తొలగుతాయి.
కర్కాటకం: శ్రమాధిక్యం. పనుల్లో తొందరపాటు. నిర్ణయాలు మార్చుకుంటారు. ఆకస్మిక ప్రయాణాలు. ఇంటాబయటా సమస్యలు. ఆరోగ్యభంగం. వ్యాపారాలు, ఉద్యోగాలలో కొద్దిపాటి చికాకులు.
సింహం: వ్యవహారాలలో అవాంతరాలు. రుణయత్నాలు. దూరప్రయాణాలు. ఇంటాబయటా ఒత్తిడులు. ఆలయాలు సందర్శిస్తారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో మార్పులు.
కన్య: కొత్త వ్యక్తులతో పరిచయాలు. సంఘంలో ఆదరణ. వ్యవహారాలలో విజయం. శుభకార్యాలలో పాల్గొంటారు. వాహనాలు, భూములు కొంటారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఒడిదుడుకులు తొలగుతాయి.
తుల: మిత్రులతో మాటపట్టింపులు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. ఆర్థిక ఇబ్బందులు. దూరప్రయాణాలు. అనారోగ్యం. వ్యాపారాలు, ఉద్యోగాలలో చికాకులు.
వృశ్చికం: శుభవార్తలు వింటారు. వ్యవహారాలలో విజయం. ముఖ్యమైన వ్యవహారాలు సాఫీగా సాగుతాయి. విందువినోదాలు. వ్యాపారాలు లాభిస్తాయి. ఉద్యోగాలలో అనుకూలత.
ధనుస్సు: కొన్ని వ్యవహారాలు మందగిస్తాయి. ఆలోచనలు స్థిరంగా ఉండవు. కుటుంబంలో ఒత్తిడులు. ఆకస్మిక ప్రయాణాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు సాధారణంగా ఉంటాయి.
మకరం: వ్యవహారాలు సాఫీగా సాగుతాయి. బంధువులను కలుసుకుంటారు. చిన్ననాటి మిత్రుల నుంచి శుభవార్తలు. వాహనసౌఖ్యం. ముఖ్య నిర్ణయాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ప్రోత్సాహం.
కుంభం: ఇంటర్వ్యూలు అందుతాయి. వ్యవహారాలలో పురోగతి. స్థిరాస్తి వివాదాల పరిష్కారం. శుభవార్తలు వింటారు. వాహనయోగం. వ్యాపారాలు, ఉద్యోగాలలో సమస్యల నుంచి విముక్తి.
మీనం: వ్యవహారాలు ముందుకు సాగవు. ఆకస్మిక ప్రయాణాలు. కొత్త నిర్ణయాలు. సోదరులతో విభేదాలు. ఆర్థిక ఇబ్బందులు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఇబ్బందులు తప్పవు. – సింహంభట్ల సుబ్బారావు
సంబంధిత వార్తలు
మరిన్ని వార్తలు