గ్రహం అనుగ్రహం (14-11-2019)

Daily Horoscope in Telugu (14-11-2019) - Sakshi

శ్రీవికారి నామ సంవత్సరం, దక్షిణాయనం, శరదృతువు కార్తీక మాసం, తిథి బ.విదియ రా.7.31 వరకు,తదుపరి తదియ న„ý త్రం రోహిణి రా.11.16 వరకు, తదుపరి మృగశిరవర్జ్యం ప.3.01 నుంచి 4.40 వరకు, దుర్ముహూర్తం ఉ.9.51 నుంచి 10.36 వరకు,తదుపరి ప.2.20 నుంచి 3.07 వరకు;అమృతఘడియలు... రా.7.57 నుంచి 9.36 వరకు.

సూర్యోదయం :    6.08
సూర్యాస్తమయం    :  5.21
రాహుకాలం : ప.1.30 నుంచి 3.00 వరకు
యమగండం :  ఉ.6.00 నుంచి 7.30 వరకు

భవిష్యం
మేషం: ఉద్యోగ ప్రయత్నాలలో కొంత నిరాశ. వ్యయప్రయాసలు. ఆస్తి వివాదాలు. పనులు మందగిస్తాయి. దూరప్రయాణాలు. దైవదర్శనాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో  చికాకులు.

వృషభం: ఉత్సాహంతో పనులు పూర్తి చేస్తారు.. నూతన పరిచయాలు. ధన, వస్తులాభాలు. విద్యార్థులకు  నూతన అవకాశాలు. వ్యాపారాలు,  ఉద్యోగాలలో లక్ష్యసాధన. దైవదర్శనాలు.

మిథునం: బంధువులతో విబేదాలు.  ప్రయాణాలు వాయిదా. ముఖ్యమైన వ్యవహారాలలో అవాంతరాలు. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు.  వ్యాపారాలు, ఉద్యోగాలు నిరుత్సాహపరుస్తాయి.

కర్కాటకం: నూతన వ్యక్తుల పరిచయం. శుభకార్యాలకు హాజరవుతారు. సంఘంలో గౌరవప్రతిష్ఠలు పెరుగుతాయి. వ్యాపారాలలో ముందడుగు. ఉద్యోగాలలో చిక్కులు తొలగుతాయి.

సింహం: నూతన ఉద్యోగాలు దక్కుతాయి. ఆర్థిక పరిస్థితి  ఆశాజనకంగా ఉంటుంది. వాహన, గృహయోగాలు. వ్యాపారాలు లాభిస్తాయి. ఉద్యోగాలలో ఆశించిన మార్పులు ఉండవచ్చు. దైవచింతన.

కన్య: రుణాలు చేస్తారు. సోదరులతో విభేదాలు. దూరప్రయాణాలు. ఆరోగ్యసమస్యలు. బంధువుల నుంచి ఒత్తిళ్లు. దైవదర్శనాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో కొంత గందరగోళం.

తుల: రుణయత్నాలు. దూరప్రయాణాలు. మిత్రులతో మాటపట్టింపులు. ఆరోగ్య సమస్యలు. ఆస్తి వివాదాలు. ఆధ్యాత్మిక చింతన. వ్యాపారాలు, ఉద్యోగాలలో కొద్దిపాటి సమస్యలు. పనులు వాయిదా.

వృశ్చికం: ప్రముఖుల నుంచి ఆహ్వానాలు. విలువైన వస్తువులు కొంటారు. పనుల్లో విజయం. ఆప్తుల సలహాలు పొందుతారు. వాహనయోగం. వ్యాపారాలు, ఉద్యోగాలలో పురోగతి. విందువినోదాలు..

ధనుస్సు: విద్యార్థులకు నూతనోత్సాహం. సన్నిహితులతో వివాదాలు పరిష్కారం. శుభవార్తలు. వాహనయోగం. కీలక నిర్ణయాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో మరింత ప్రోత్సాహం.

మకరం: కుటుంబసభ్యులతో విభేదాలు. ఆకస్మిక ప్రయాణాలు. ఇంటాబయటా ఒత్తిడులు. చేపట్టిన పనుల్లో జాప్యం. ఉద్యోగాలు,  వ్యాపారాలలో నిరాశ. అనారోగ్యం. ధనవ్యయం.

కుంభం: వ్యవహారాలలో ఆటంకాలు. ఆర్థిక ఇబ్బందులు.  కుటుంబసభ్యులతో మాటపట్టింపులు. ఆలయ దర్శనాలు. ఉద్యోగాలలో బాద్యతలు పెరుగుతాయి. వ్యాపారాలలో ఒత్తిడులు.

మీనం: పలుకుబడి పెరుగుతుంది. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది.  కార్యజయం. పరిచయాలు పెరుగుతాయి. గృహం, వాహనాలు కొంటారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో మరింత ఉత్సాహవంతంగా ఉంటుంది.– సింహంభట్ల సుబ్బారావు

Read latest Astrology News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top