గ్రహం అనుగ్రహం (13-06-2020)

Daily Horoscope in Telugu (13-06-2020) - Sakshi

శ్రీశార్వరినామ సంవత్సరంఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు జ్యేష్ఠ మాసం తిథి  బ.అష్టమి రా.1.19 వరకు తదుపరి నవమి నక్షత్రం పూర్వాభాద్ర రా.10.21 వరకు తదుపరి ఉత్తరాభాద్ర వర్జ్యం ..లేదు దుర్ముహూర్తం ఉ.5.28 నుంచి 7.13 వరకు అమృతఘడియలు....ప.1.34 నుంచి 2.35 వరకు

సూర్యోదయం :    5.29
సూర్యాస్తమయం    :  6.31
రాహుకాలం :  ఉ.9.00 నుంచి 10.30 వరకు
యమగండం :  ప.1.30 నుంచి 3.00 వరకు

గ్రహఫలం
మేషం: ఉద్యోగయత్నాలు అనుకూలిస్తాయి. సోదరులు, మిత్రులతో వివాదాల పరిష్కారం. శుభవార్తలు వింటారు. ఆస్తి విషయాలలో అగ్రిమెంట్లు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ముందడుగు.

వృషభం: మిత్రుల నుంచి శుభవార్తలు. రావలసిన సొమ్ము అందుతుంది. పనులు సకాలంలో పూర్తి. సంఘంలో గౌరవం పెరుగుతుంది. వ్యాపారాలు, ఉద్యోగాలలో నూతనోత్సాహం.

మిథునం: బంధువుల నుంచి ఒత్తిడులు. దూరప్రయాణాలు. ఇంటాబయటా బాధ్యతలు పెరుగుతాయి. శ్రమాధిక్యం. వ్యాపారాలు, ఉద్యోగాలు నిరాశ కలిగించవచ్చు.

కర్కాటకం: సన్నిహితులతో మాటపట్టింపులు. వ్యయప్రయాసలు. వ్యాపార లావాదేవీలు నత్తనడనకన సాగుతాయి. ఉద్యోగయత్నాలలో స్వల్ప ఆటంకాలు.

సింహం: నూతనోత్సాహం. ఆర్థిక ప్రగతి. ఇంటర్వ్యూలు అందుతాయి. వ్యవహార విజయం. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఒడిదుడుకుల నుంచి విముక్తి..

కన్య: కొత్త కార్యక్రమాలకు శ్రీకారం. శుభవార్తలు. బాకీలు అందుతాయి. కుటుంబసమస్యల పరిష్కారం. వాహనయోగం. సంఘంలో గౌరవం. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఉత్సాహాన్నిస్తాయి.

తుల: పనుల్లో స్వల్ప ఆటంకాలు. దూరప్రయాణాలు. బంధువుల ఒత్తిడులు. ఆలయాలు సందర్శిస్తారు. ధనవ్యయం. వ్యాపార, ఉద్యోగాలు సామాన్యంగా ఉంటాయి.

వృశ్చికం: వ్యాపారాలు, ఉద్యోగాలలో ఒత్తిడులు. బాధ్యతలు పెరుగుతాయి. ముఖ్యమైన పనులు నెమ్మదిగా సాగుతాయి. ఆస్తి  వ్యవహారాలలో చికాకులు. అనారోగ్యం.

ధనుస్సు: కాంట్రాక్టులు లభిస్తాయి. సంఘంలో గౌరవం. విలువైన సమాచారం.  చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. వ్యాపారాలు, ఉద్యోగాలు అనుకూలిస్తాయి.

మకరం:కుటుంబంలో చికాకులు. అనుకోని ధనవ్యయం. వ్యాపారాలు మందగిస్తాయి. ఉద్యోగులకు ఒత్తిడులు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు.

కుంభం: నూతన ఉద్యోగయోగం. కీలక నిర్ణయాలు. వ్యవహారాలు అనుకూలిస్తాయి. పాత సంఘటనలు గుర్తుకు వస్తాయి. వ్యాపార లావాదేవీలు పురోగతిలో సాగుతాయి. వస్తులాభాలు.

మీనం: వ్యయప్రయాసలు. పనుల్లో నిదానంగా సాగుతాయి. శ్రమాధిక్యం. ఆలయాలు సందర్శిస్తారు. ముఖ్య సమాచారం అందుతుంది. వ్యాపారాలు, ఉద్యోగాలు కొంత నిరాశ పరుస్తాయి.

Read latest Astrology News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top