గ్రహం అనుగ్రహం(27-09-2019)

Daily Horoscope in Telugu - Sakshi

శ్రీ వికారి నామ సంవత్సరం, దక్షిణాయనం, వర్ష ఋతువుభాద్రపద మాసం, తిథి బ.చతుర్దశి రా.2.53 వరకు, తదుపరిఅమావాస్య, నక్షత్రం పుబ్బ రా.1.04 వరకు, తదుపరి ఉత్తర, వర్జ్యం ఉ.10.10 నుంచి 11.40 వరకు, దుర్ముహూర్తం ఉ.8.15 నుంచి9.03 వరకు, తదుపరి ప.12.14 నుంచి 1.02 వరకుఅమృతఘడియలు... రా.7.05 నుంచి 8.12 వరకు.

సూర్యోదయం :    5.53
సూర్యాస్తమయం    :  5.51
రాహుకాలం : ఉ.10.30 నుంచి 12.00 వరకు
యమగండం :  ప.3.00 నుంచి 4.30 వరకు

భవిష్యం
మేషం: మిత్రులతో వివాదాలు. ఆర్థిక ఇబ్బందులు. ఆకస్మిక ప్రయాణాలు. ఆరోగ్య సమస్యలు. అనుకున్న పనులు ముందుకు సాగవు. వ్యాపారాలు నిరాశ పరుస్తాయి. ఉద్యోగాలలో గందరగోళం.

వృషభం: కుటుంబసభ్యులతో విభేదాలు. అనారోగ్యం. వ్యవహారాలు నిరాశ కలిగిస్తాయి. ఆలోచనలు స్థిరంగా ఉండవు. వ్యాపారాలు అంతగా అనుకూలించవు. ఉద్యోగాలలో గందరగోళం

మిథునం: పాతమిత్రులను కలుసుకుంటారు. ప్రముఖులతో పరిచయాలు. వస్తు, వస్త్రలాభాలు. ఇంటర్వ్యూలు అందుకుంటారు. వ్యాపారాలు విస్తరిస్తారు.  ఉద్యోగాలలో నూతనోత్సాహం.

కర్కాటకం: బంధుమిత్రులతో వివాదాలు. ధనవ్యయం. అనారోగ్య సూచనలు. దూరప్రయాణాలు. ఆస్తి వివాదాలు నెలకొంటాయి. వ్యాపారాలు కొంత ఇబ్బంది కలిగిస్తాయి. ఉద్యోగాలు నిరాశ పరుస్తాయి.

సింహం: శ్రమ ఫలిస్తుంది. చేపట్టిన పనులు సకాలంలో పూర్తి కాగలవు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. మీపై కుటుంబంలో గౌరవం పెరుగుతుంది. వ్యాపారాలు కొంత పుంజుకుంటాయి. ఉద్యోగాలలో అనుకూలం.

కన్య: ఆకస్మిక ప్రయాణాలు. పనుల్లో జాప్యం. ఆర్థిక పరిస్థితి గందరగోళంగా ఉంటుంది. ఆలయాలు సందర్శిస్తారు. ఉద్యోగయత్నాలు ముందుకు సాగవు. వ్యాపారాలు మందగిస్తాయి. ఉద్యోగ మార్పులు.

తుల: కొత్త వ్యక్తుల పరిచయం. శుభవార్తలు. ఆర్థికాభివృద్ధి. కీలక నిర్ణయాలు. వాహనాలు, భూములు కొంటారు. వ్యాపారాలు ప్రోత్సాహకరంగా సాగుతాయి. ఉద్యోగాలలో పదోన్నతులు ఉంటాయి.

వృశ్చికం: కొత్త పనులకు శ్రీకారం చుడతారు. శుభకార్యాలలో పాల్గొంటారు. బాకీలు కొన్ని వసూలవుతాయి. మీ అంచనాలు నిజమవుతాయి. వ్యాపారాభివృద్ధి. ఉద్యోగాలలో అనుకూల వాతావరణం.

ధనుస్సు: మిత్రులతో మాటపట్టింపులు. ఆలయ దర్శనాలు. అనారోగ్యం. ఆకస్మిక ప్రయాణాలు. ధనవ్యయం. వ్యాపారాలు ఇబ్బందికరంగా ఉంటాయి. ఉద్యోగాలలో నిరాశ తప్పదు

మకరం: కొత్త రుణాలు చేస్తారు. ఆర్థిక విషయాలు నిరాశ కలిగిస్తాయి. శ్రమాధిక్యం. పనులలో ఆటంకాలు. వ్యయప్రయాసలు. వ్యాపారాలలో ఒత్తిడులు. ఉద్యోగాలలో మార్పులు ఉండవచ్చు.

కుంభం: వ్యతిరేకులు కూడా మిత్రులుగా మారతారు. వ్యవహారాలలో విజయం. ఆప్తుల నుంచి శుభవార్తలు. వ్యాపారాలు మరింత లాభిస్తాయి. ఉద్యోగాలు ఆశాజనకంగా ఉంటాయి. వస్తులాభాలు.

మీనం: పనులు సమయానికి పూర్తి చేస్తారు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. సంఘంలో గౌరవం. వస్తులాభాలు. వ్యాపారాలు ఉత్సాహంగా సాగుతాయి. ఉద్యోగాలలో సానుకూలత.– సింహంభట్ల సుబ్బారావు

Read latest Astrology News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top