గ్రహం అనుగ్రహం (12-11-2019)

Daily Horoscope in Telugu (12-11-2019) - Sakshi

శ్రీవికారినామ సంవత్సరం, దక్షిణాయనం, శరదృతువు, కార్తీక మాసం, తిథి పౌర్ణమి సా.6.34 వరకు, తదుపరి బ.పాడ్యమి,  నక్షత్రం భరణి రా.9.19 వరకు, తదుపరి కృత్తిక, వర్జ్యం ఉ.5.55 నుంచి 7.38 వరకు, దుర్ముహూర్తం ఉ.8.20 నుంచి 9.05 వరకు, తదుపరి రా.10.26 నుంచి 11.39 వరకు అమృతఘడియలు..సా.4.11 నుంచి 5.54 వరకు; కార్తీక పౌర్ణమి

సూర్యోదయం :    6.06
సూర్యాస్తమయం    :  5.22
రాహుకాలం :  ప. 3.00 నుంచి 4.30 వరకు
యమగండం :  ఉ.9.00 నుంచి 10.30 వరకు

భవిష్యం
మేషం: పనుల్లో విజయం. శుభకార్యాలకు హాజరవుతారు. ఆత్మీయుల నుంచి ఆహ్వానాలు అందుతాయి. దూరపు బంధువుల కలయిక. నూతన ఉద్యోగాలు దక్కుతాయి. వ్యాపారాలు, ఉద్యోగాలలో కొత్త ఆశలు.

వృషభం: పనుల్లో ప్రతిష్ఠంభన. బంధుమిత్రులతో కలహాలు. రుణాలు చేస్తారు. ఆరోగ్యభంగం. శ్రమాధిక్యం. దూరప్రయాణాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో కొద్దిపాటి చికాకులు.

మిథునం: పరపతి కలిగిన వారితో పరిచయాలు. చిన్ననాటి విషయాలు గుర్తుకు వస్తాయి. ఉద్యోగయత్నాలు కలసివస్తాయి. వాహన, గృహయోగాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఆటుపోట్లు తొలగుతాయి.

కర్కాటకం: ఎదురుచూస్తున్న ఉద్యోగాలు దక్కుతాయి. కొత్త పనులకు శ్రీకారం చుడతారు. ఆత్మీయుల నుంచి కీలక సందేశం. శుభకార్యాలు నిర్వహిస్తారు. వ్యాపారులు లాభాలు ఆర్జిస్తారు. ఉద్యోగులకు కొత్త పోస్టులు.

సింహం: వ్యవహారాలలో ఆటంకాలు. ఖర్చులు పెరుగుతాయి. ఆకస్మిక ప్రయాణాలు. ఇంటాబయటా ఒత్తిడులు. ఆధ్యాత్మిక చింతన. వ్యాపారాలు, ఉద్యోగాలలో కొద్దిపాటి సమస్యలు.

కన్య: అనుకున్న పనులు మందకొడిగా సాగుతాయి. ఆత్మీయులతో విభేదాలు. ఆర్థిక ఇబ్బందులు. విద్యార్థులకు ఒత్తిడులు. శ్రమాధిక్యం. వ్యాపారాలు, ఉద్యోగాలలో గందరగోళం.

తుల: కొత్త పనులు చేపడతారు. ఆహ్వానాలు అందుతాయి. కీలక నిర్ణయాలు తీసుకుంటారు. విద్యావకాశాలు దక్కుతాయి. వాహన, గృహయోగాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు సంతృప్తికరంగా ఉంటాయి.

వృశ్చికం: చిన్ననాటి మిత్రుల నుంచి ఆహ్వానాలు. విందువినోదాలు. యత్నకార్యసిద్ధి. నూతన ఒప్పందాలు. వాహనాలు కొనుగోలు చేస్తారు. పరిచయాలు పెరుగుతాయి. వ్యాపారాలు, ఉద్యోగాలలో పూర్వవైభవం.

ధనుస్సు: చాకచక్యంగా వ్యవహారాలు పూర్తి చేస్తారు. స్వల్ప అనారోగ్యం. బంధువులతో మాటపట్టింపులు. దూరప్రయాణాలు. దైవదర్శనాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఒత్తిడులు ఉండవచ్చు.

మకరం: పనుల్లో అవాంతరాలు. రుణయత్నాలు. బంధువులతో తగాదాలు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. నిర్ణయాలు మార్చుకుంటారు. ఉద్యోగయత్నాలు నిదానిస్తాయి. వ్యాపారాలు, ఉద్యోగాలలో కొంత అనుకూల పరిస్థితి.

కుంభం: చేపట్టిన వ్యవహారాలు సాఫీగా సాగుతాయి. ఆత్మీయులతో వివాదాలు సర్దుకుంటాయి. ఆహ్వానాలు, గ్రీటింగ్‌లు అందుతాయి. స్థిరాస్తి వృద్ధి. వాహనయోగం. వ్యాపారాలు, ఉద్యోగాలలో లక్ష్యాలు సాధిస్తారు.

మీనం: కొన్ని పనులు వాయిదా వేస్తారు. శ్రమ పెరుగుతుంది. బంధుమిత్రులతో స్వల్ప వివాదాలు. ఆకస్మిక ప్రయాణాలు. ఆరోగ్యభంగం. వ్యాపారాలు, ఉద్యోగాలు సాదాసీదాగా ఉంటాయి.– సింహంభట్ల సుబ్బారావు

Read latest Astrology News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top