గ్రహం అనుగ్రహం (11-02-2020)

Daily Horoscope in Telugu (11-02-2020) - Sakshi

శ్రీ వికారి నామ సంవత్సరం, ఉత్తరాయణం, శిశిర ఋతువు మాఘ మాసం, తిథి బ.విదియ ఉ.9.34 వరకు, తదుపరి తదియనక్షత్రం పుబ్బ సా.6.04 వరకు, తదుపరి ఉత్తర, వర్జ్యం రా.12.44 నుంచి 2.14 వరకు, దుర్ముహూర్తం ఉ.8.48 నుంచి 9.33 వరకు తదుపరి రా.10.57 నుంచి 11.47 వరకు అమృతఘడియలు... ప.12.01 నుంచి 1.33 వరకు.

సూర్యోదయం :    6.33
సూర్యాస్తమయం    :  5.56
రాహుకాలం :  ప. 3.00 నుంచి 4.30 వరకు
యమగండం :  ఉ.9.00 నుంచి 10.30 వరకు

భవిష్యం
మేషం: పనులు వాయిదా వేస్తారు. దూరప్రయాణాలు. ఆర్థిక పరిస్థితి నిరుత్సాహపరుస్తుంది. శ్రమాధిక్యం. వ్యాపారాలు నిరాశ పరుస్తాయి. ఉద్యోగులకు కొద్దిపాటి మార్పులు.

వృషభం: ధనవ్యయం. కుటుంబసభ్యులతో స్వల్ప వివాదాలు. ఆకస్మిక ప్రయాణాలు. ఇంటాబయటా ఒత్తిడులు. ఆధ్యాత్మిక చింతన. వ్యాపారాలు సామాన్యంగా ఉంటాయి. ఉద్యోగులకు శ్రమాధిక్యం.

మిథునం: పనుల్లో విజయం. శుభకార్యాలలో పాల్గొంటారు. పాతమిత్రులను కలుసుకుంటారు. ప్రతిభాపాటవాలు వెలుగులోకి వస్తాయి. వ్యాపారాలలో పురోగతి. ఉద్యోగులకు కొత్త హోదాలు.

కర్కాటకం: వ్యవహారాలలో స్వల్ప ఆటంకాలు. ధనవ్యయం. బంధుమిత్రుల నుంచి ఒత్తిడులు. ఆలయాలు సందర్శిస్తారు. అనారోగ్యం. వ్యాపారాలు సామాన్యం. ఉద్యోగులకు అదనపు బాధ్యతలు.

సింహం: నూతన పరిచయాలు. సభలు, సమావేశాలలో పాల్గొంటారు. ఆర్థిక పరిస్థితి కొంత నిరాశ కలిగిస్తుంది. పనులు వాయిదా పడతాయి. వ్యాపారాలలో మార్పులు. ఉద్యోగులకు పనిభారం.

కన్య: ఆర్థిక లావాదేవీలు నిరాశ కలిగిస్తాయి. రుణయత్నాలు. ఆకస్మిక ప్రయాణాలు. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి. ఉద్యోగులకు బాధ్యతలు తప్పవు.

తుల: ఆర్థికంగా ఇబ్బందులు తొలగుతాయి. నూతన విద్య, ఉద్యోగావకాశాలు. పనుల్లో అనుకూలత. సంఘంలో గౌరవం. కీలక నిర్ణయాలు. వ్యాపారాలు ఆశాజకనంగా ఉంటాయి. ఉద్యోగాలలో నూతనోత్సాహం.

వృశ్చికం: కొత్త విషయాలు తెలుసుకుంటారు. ప్రతిభకు గుర్తింపు రాగలదు. పరిచయాలు పెరుగుతాయి. ఆత్మీయుల నుంచి ఆహ్వానాలు. వ్యాపారాలు లాభిస్తాయి. ఉద్యోగులకు ఇంక్రిమెంట్లు.

ధనుస్సు: మిత్రుల నుంచి ఒత్తిడులు. అనుకోని ప్రయాణాలు. ఆధ్యాత్మిక చింతన. భూవివాదాలు. ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉంటుంది. వ్యాపార, ఉద్యోగాలలో స్వల్ప మార్పులు.

మకరం:  మకరం...చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. నూతన పరిచయాలు. ఆహ్వానాలు, గ్రీటింగ్‌లు అందుతాయి. స్థిరాస్తి వృద్ధి. వ్యాపారాలు ఉత్సాహంగా సాగుతాయి. ఉద్యోగులకు పదోన్నతులు.

కుంభం: ఆస్తి వివాదాల పరిష్కారం. శుభకార్యాలలో పాల్గొంటారు. పాతబాకీలు వసూలవుతాయి. వాహనయోగం. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగులకు అనుకూల మార్పులు.

మీనం: ఆకస్మిక ధనలాభం. చిన్ననాటి మిత్రుల కలయిక. విందువినోదాలు. ఇంటాబయటా ప్రోత్సాహం. వ్యాపారాలలో లాభాలు. ఉద్యోగులకు పదోన్నతి సూచనలు.– సింహంభట్ల సుబ్బారావు

Read latest Astrology News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top