గ్రహం అనుగ్రహం(10-07-2019)

Daily Horoscope in Telugu 10-07-2019 - Sakshi

శ్రీ వికారి నామ సంవత్సరం, ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువుఆషాఢమాసం, తిథి శు.అష్టమి ఉ.7.09 వరకు, తదుపరి నవమి తె.5.15 వరకు (తెల్లవారితే గురువారం), నక్షత్రం చిత్త రా.8.18 వరకు, తదుపరి స్వాతి, వర్జ్యం రా.1.40 నుంచి 3.11 వరకు, దుర్ముహూర్తం ప.11.36 నుంచి 12.28 వరకుఅమృతఘడియలు... ప.2.14 నుంచి 3.44 వరకు.

సూర్యోదయం :    5.35
సూర్యాస్తమయం    :  6.32
రాహుకాలం :  ప. 12.00 నుంచి 1.30 వరకు
యమగండం :  ఉ.7.30 నుంచి 9.00 వరకు

మేషం: వృత్తి, వ్యాపారాలు ఉత్సాహంగా సాగుతాయి. ఆత్మీయులు దగ్గరవుతారు. కాంట్రాక్టర్లకు అనుకోని అవకాశాలు. యత్నకార్యసిద్ధి. అరుదైన పురస్కారాలు. విద్యార్థుల శ్రమ ఫలిస్తుంది.

వృషభం: కొత్తగా రుణాలు చేస్తారు. పనులు మధ్యలో విరమిస్తారు. అనుకోని ఖర్చులు. వృత్తి, వ్యాపారాలలో కొంత  ఒడిదుడుకులు. బంధువుల నుంచి మాటపడతారు. అనారోగ్య సూచనలు.

మిథునం: ఆర్థిక పరిస్థితి అంతగా అనుకూలించదు. దూరప్రయాణాలు. కుటుంబసభ్యులతో వివాదాలు. అనారోగ్యం. వృత్తి, వ్యాపారాలలో స్వల్ప అవాంతరాలు. ఉద్యోగయత్నాలు ముందుకు సాగవు.

కర్కాటకం: శ్రేయోభిలాషుల నుంచి ఆహ్వానాలు. పనులు చకచకా పూర్తి కాగలవు. ప్రముఖులతో పరిచయాలు. సంఘంలో విశేష ఆదరణ. వృత్తి, వ్యాపారాలలో పురోగతి. వాహనయోగం.

సింహం: పనుల్లో స్వల్ప ఆటంకాలు. అనుకోని ప్రయాణాలు. విద్యార్థుల. కృషి అంతగా ఫలించదు. ముఖ్యమైన నిర్ణయాలలో మార్పులు. వృత్తి, వ్యాపారాలు మందకొడిగా ఉంటాయి..

కన్య: వ్యవహారాలలో పురోగతి. స్థిరాస్తి కొనుగోలు. శుభవర్తమానాలు. ధన, వస్తులాభాలు. చిన్ననాటి మిత్రుల కలయిక. కొన్ని వివాదాలు తీరతాయి. వృత్తి, వ్యాపారాలలో ముందడుగు వేస్తారు.

తుల: శ్రమకు తగిన ఫలితం కనిపించదు. దూరప్రయాణాలు. ఒప్పందాలలో జాప్యం. మిత్రులతో వివాదాలు. పనులు వాయిదా వేస్తారు. వ్యాపార, ఉద్యోగాలు కొంత సామాన్యంగానే కొనసాగుతాయి.

వృశ్చికం: కొత్త పనులు చేపడతారు. పరిచయాలు పెరుగుతాయి. సన్నిహితుల నుంచి ధనలాభం. వృత్తి, వ్యాపారాలలో పురోగతి సాధిస్తారు. కళాకారులకు మరింత ఉత్సాహంగా ఉంటుంది.

ధనుస్సు: విందువినోదాలు. పనుల్లో విజయం.  ప్రముఖుల నుంచి కీలక సమాచారం. ఆలయాలు సందర్శిస్తారు. శుభవర్తమానాలు. ఆస్తిలాభ సూచనలు. వృత్తి, వ్యాపారాలు సాఫీగా సాగుతాయి.

మకరం: కుటుంబసభ్యులతో విభేదాలు. ఆరోగ్యసమస్యలు. ముఖ్యమైన పనుల్లో స్వల్ప అవాంతరాలు. ధనవ్యయం. వ్యాపార, ఉధ్యోగాలలో కొన్ని ఇబ్బందులు. విద్యార్థులకు శ్రమాధిక్యం.

కుంభం: ఆశ్చర్యకరమైన సంఘటనలు. ముఖ్యమైన పనుల్లో అవాంతరాలు. అనుకోని ప్రయాణాలు. ఇంటాబయటా ఒత్తిళ్లు. దైవదర్శనాలు. వృత్తి, వ్యాపారాలు మందగిస్తాయి.

మీనం: ఆత్మీయులు, బంధువులతో ముఖ్య విషయాలు చర్చిస్తారు.  విందువినోదాలు. యత్నకార్యసిద్ధి. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. వాహనయోగం. వృత్తి, వ్యాపారాలు మరింత ఆశాజనకంగా ఉంటాయి.
– సింహంభట్ల సుబ్బారావు

Read latest Astrology News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top