గ్రహం అనుగ్రహం (10-01-2020)

Daily Horoscope in Telugu (10-01-2020) - Sakshi

శ్రీ వికారి నామ సంవత్సరం, దక్షిణాయనం, హేమంత ఋతువు, పుష్య మాసం, తిథి పౌర్ణమి రా.1.16 వరకు, తదుపరి బ.పాడ్యమి, నక్షత్రం ఆరుద్ర ప.3.16 వరకు, తదుపరి పునర్వసు వర్జ్యం రా.3.03 నుంచి 4.36 వర కు, దుర్ముహూర్తం ఉ.8.48 నుంచి 9.33 వరకు, తదుపరి ప.12.30 నుంచి 1.14 వరకుఅమృతఘడియలు... ఉ.5.15 నుంచి 6.44 వరకు.

సూర్యోదయం :    6.37
సూర్యాస్తమయం    :  5.38
రాహుకాలం : ఉ.10.30 నుంచి 12.00 వరకు
యమగండం :  ప.3.00 నుంచి 4.30 వరకు

భవిష్యం
మేషం: పనుల్లో విజయం సాధిస్తారు. ఇంటర్వ్యూలు అందుతాయి. బంధువులతో సఖ్యత. విందువినోదాలు. వాహనయోగం. ముఖ్య నిర్ణయాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో అనుకూలం.

వృషభం: సన్నిహితులతో స్వల్ప వివాదాలు. ఆకస్మిక ప్రయాణాలు. రుణయత్నాలు. ఆలోచనలు కలసిరావు. బాధ్యతలు పెరుగుతాయి. వ్యాపారాలు, ఉద్యోగాలలో చికాకులు.

మిథునం: పరిస్థితులు అనుకూలిస్తాయి. సంఘంలో విశేష గౌరవం. ఆస్తి ఒప్పందాలు. ఆధ్యాత్మికచింతన. వ్యాపారాలలో లాభాలు. ఉద్యోగాలలో అనుకూల వాతావరణం.

కర్కాటకం: మిత్రులతో విభేదాలు. ఆర్థిక పరిస్థితి  అంతగా అనుకూలించదు. దూరప్రయాణాలు. ఆలయాలు సందర్శిస్తారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఒత్తిడులు తప్పవు.

సింహం:  కొన్ని వ్యవహారాలు సాఫీగా సాగుతాయి. ఆప్తుల సలహాలు స్వీకరిస్తారు. వస్తు, వస్త్రలాభాలు. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో వివాదాలు తీరతాయి.

కన్య:  నూతన ఉద్యోగాలు దక్కుతాయి. ప్రముఖులతో పరిచయాలు. సంఘంలో గౌరవం. వివాదాల నుంచి గట్టెక్కుతారు. ఆహ్వానాలు అందుతాయి. వ్యాపారాలు, ఉద్యోగాలలో అనుకూల పరిస్థితి.

తుల:  పనులు వాయిదా వేస్తారు. ఆకస్మిక ప్రయాణాలు. కొత్త రుణాలు చేస్తారు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. బంధువులను కలుసుకుంటారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో కొన్ని ఇబ్బందులు..

వృశ్చికం: బంధువర్గంతో వివాదాలు. ఆలోచనలు స్థిరంగా సాగవు. పనులలో అవాంతరాలు. రుణభారాలు. వైద్యసేవలు. కొన్ని నిర్ణయాలు వాయిదా. వ్యాపారాలు, ఉద్యోగాలలో చికాకులు.

దనుస్సు: పరిచయాలు పెరుగుతాయి. సంఘంలో గౌరవం. ఆస్తి వివాదాల పరిష్కారం. శుభకార్యాలలో పాల్గొంటారు. బాకీలు వసూలవుతాయి. వ్యాపారాలు, ఉద్యోగాలలో మరింత అనుకూలం.

మకరం: సన్నిహితులతో సఖ్యత. విందువినోదాలు. పనుల్లో అవాంతరాలు తొలగుతాయి. స్థిరాస్తి వృద్ధి. నూతన విద్య, ఉద్యోగావకాశాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో సమస్యల పరిష్కారం.

కుంభం: పనుల్లో ప్రతిష్ఠంభన. కుటుంబసభ్యులతో వివాదాలు. దూరప్రయాణాలు. శ్రమాధిక్యం. దైవదర్శనాలు. ఆస్తి వివాదాలు చికాకు పరుస్తాయి. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఒత్తిడులు.

మీనం: అనుకోని ప్రయాణాలు. ఇంటాబయటా సమస్యలు. పనుల్లో అవాంతరాలు. రుణాలు చేస్తారు. వైద్యసేవలు. బంధువులను కలుసుకుంటారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో  నిరాశ.– సింహంభట్ల సుబ్బారావు

Read latest Astrology News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top