గ్రహం అనుగ్రహం (06-09-2019)

Daily Horoscope in Telugu (06-09-2019) - Sakshi

శ్రీ వికారి నామ సంవత్సరం, దక్షిణాయనం, వర్ష ఋతువు భాద్రపద మాసం, తిథి శు.అష్టమి రా.1.24 వరకు, తదుపరి నవమి నక్షత్రం అనూరాధ ఉ.10.02 వరకు, తదుపరి జ్యేష్ఠ, వర్జ్యం ప.3.37 నుంచి 5.13 వరకు, దుర్ముహూర్తం ఉ.8.15 నుంచి 9.04 వరకు తదుపరి ప.12.21 నుంచి 1.10 వరకు అమృతఘడియలు... రా.1.55 నుంచి 2.43 వరకు.

సూర్యోదయం :    5.49
సూర్యాస్తమయం    :  6.07
రాహుకాలం : ఉ.10.30 నుంచి 12.00 వరకు
యమగండం :  ప.3.00 నుంచి 4.30 వరకు

భవిష్యం
మేషం: పనులలో ఆటంకాలు. దూరప్రయాణాలు. అనుకోని ఖర్చులు. బంధుమిత్రుల నుంచి ఒత్తిళ్లు. వృత్తి, వ్యాపారాలలో నిరుత్సాహం. ఆలయ దర్శనాలు. అనారోగ్యం.

వృషభం: పరిస్థితులు అనుకూలిస్తాయి. మిత్రుల నుంచి కీలక సమాచారం. విందువినోదాలు.  శ్రమకు తగిన ఫలితం దక్కవచ్చు. వృత్తి, వ్యాపారాలు ఉత్సాహంగా సాగుతాయి.

మిథునం: కొన్ని వ్యవహారాలు ముందుకు సాగవు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. కుటుంబంలో ఒత్తిడులు. ఆరోగ్యభంగం. వ్యాపారాలు నిరాశాజనకం. ఉద్యోగాలలో చికాకులు.

కర్కాటకం: రుణయత్నాలు. దూరప్రయాణాలు. ఆరోగ్య, కుటుంబసమస్యలు.బంధుమిత్రులతో మాటపట్టింపులు. పనులు వాయిదా వేస్తారు. వ్యాపారాలలో స్వల్ప లాభాలు. ఉద్యోగాలు నిరాశ పరుస్తాయి.

సింహం:ఆప్తులతో వివాదాలు. ఆకస్మిక ప్రయాణాలు. వృత్తి, వ్యాపారాలు నిరాశకలిగిస్తాయి. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. ధనవ్యయం. కుటుంబసభ్యుల నుంచి ఒత్తిళ్లు..

కన్య: కొత్త వ్యక్తులతో పరిచయాలు. శుభవర్తమానాలు. ప్రముఖులతో పరిచయాలు. చిన్ననాటి మిత్రుల కలయిక.  ఆలయాలు సందర్శిస్తారు. వ్యాపారాలు సజావుగా సాగుతాయి. ఉద్యోగాలలో ఉత్సాహవంతంగా ఉంటుంది..

తుల:పనులు ముందుకు సాగవు. ఆర్థిక ఇబ్బందులు. కొత్త రుణయత్నాలు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. మిత్రులతో విభేదాలు. వ్యాపారాలు సామాన్యం. ఉద్యోగాలలో చికాకులు.

వృశ్చికం:వృత్తి, వ్యాపారాలు సంతృప్తికరంగా సాగుతాయి. ధనలబ్ధి. మిత్రులతో  సఖ్యత. ఆలయ దర్శనాలు. పరిచయాలు పెరుగుతాయి. నిరుద్యోగులకు ఉద్యోగలాభం. విందువినోదాలు.

ధనుస్సు:బంధువుల నుంచి ఒత్తిడులు. కుటుంబసభ్యులతో మాటపట్టింపులు. అనుకోని ధనవ్యయం. పనుల్లో  ఆటంకాలు. వృత్తి, వ్యాపారాలలో ఒడిదుడుకులు. విద్యార్థులకు శ్రమ.

మకరం: కొత్త పనులు చేపడతారు. శుభకార్యాలకు హాజరవుతారు. మిత్రులతో కష్టసుఖాలు పంచుకుంటారు. ఆస్తి లాభ సూచనలు. వ్యాపారాలలో ముందడుగు వేస్తారు. ఉద్యోగాలలో గందరగోళం తొలగుతుంది.

కుంభం:నిరుద్యోగులకు శుభవార్తలు. ఆర్థిక లావాదేవీలు ఆశాజనకంగా ఉంటాయి. పలుకుబడి మరింత పెరుగుతుంది. ఆస్తిలాభం. వ్యాపారాలు, ఉద్యోగాలలో సమస్యలు తీరతాయి.

మీనం:మిత్రులతో వివాదాలు. ఆలోచనలు నిలకడగా ఉండవు. చేపట్టిన పనులు ముందుకు సాగవు. శ్రమకు ఫలితం కనిపించదు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఇబ్బందులు.– సింహంభట్ల సుబ్బారావు

Read latest Astrology News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top