గ్రహం అనుగ్రహం (02-11-2019)

Daily Horoscope in Telugu (02-11-2019) - Sakshi

శ్రీ వికారి నామ సంవత్సరం, దక్షిణాయనం, శరదృతువు కార్తీక మాసం, తిథి శు.షష్ఠి తె.4.10 వరకు (తెల్లవారితే ఆదివారం), నక్షత్రం పూర్వాషాఢ రా.2.29 వరకుతదుపరి ఉత్తరాషాఢ, వర్జ్యం ఉ.11.35 నుంచి 1.14 వరకుదుర్ముహూర్తం ఉ.6.03 నుంచి 7.32 వరకుఅమృతఘడియలు... రా.9.30 నుంచి 11.02 వరకు.

సూర్యోదయం :    6.01
సూర్యాస్తమయం    :  5.27
రాహుకాలం :  ఉ.9.00 నుంచి 10.30 వరకు
యమగండం :  ప.1.30 నుంచి 3.00 వరకు

భవిష్యం
మేషం: ఎంత శ్రమపడ్డా ఫలితం కనిపించదు. ఆస్తి వివాదాలు. దూరప్రయాణాలు. కుటుంబసభ్యులతో తగాదాలు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. అనారోగ్యం. వ్యాపారాలు, ఉద్యోగాలలో చికాకులు.

వృషభం: పనుల్లో అవాంతరాలు. అనుకోని ప్రయాణాలు. బంధుమిత్రులతో కలహాలు. ఆరోగ్యభంగం. విద్యార్థులకు ఒత్తిడులు. వ్యాపారాలు సామాన్యంగా ఉంటాయి. ఉద్యోగాలలో కొన్ని ఇబ్బందులు.

మిథునం: కొత్త పనులకు శ్రీకారం చుడతారు. ఆలోచనలు అమలు చేస్తారు. ఆకస్మిక ధన,వస్తులాభాలు. మిత్రుల సహాయం అందుతుంది. వివాదాల పరిష్కారం. వ్యాపారాలు, ఉద్యోగాలలో పురోగతి సాధిస్తారు.

కర్కాటకం: సన్నిహితులతో సఖ్యత. పరిచయాలు పెరుగుతాయి. నూతన ఉద్యోగాలు పొందుతారు. సేవాకార్యక్రమాలలో పాల్గొంటారు. దైవదర్శనాలు. వ్యాపారాలు పుంజుకుంటాయి. ఉద్యోగాలలో అనుకూలస్థితి.

సింహం: పనులు నెమ్మదిగా సాగుతాయి. ఆశ్చర్యకరమైన విషయాలు తెలుసుకుంటారు. విద్యార్థులు, నిరుద్యోగులకు శ్రమాధిక్యం. దూరప్రయాణాలు. దైవచింతన. వ్యాపారాలు, ఉద్యోగాలలో కొంత గందరగోళం.

కన్య: ఆదాయం కంటే ఖర్చులు పెరుగుతాయి. ఆకస్మిక ప్రయాణాలు. పనులు వాయిదా వేస్తారు. అనారోగ్యం. కుటుంబంలో ఒత్తిడులు. వ్యాపారాలు, ఉద్యోగాలలో స్వల్ప అవాంతరాలు.

తుల: కొత్త పనులు చేపడతారు. ఆత్మీయుల నుంచి సలహాలు స్వీకరిస్తారు. సంఘంలో గౌరవం. వస్తులాభాలు. స్థిరాస్తి వివాదాల పరిష్కారం. శుభకార్యాలలో పాల్గొంటారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో పూర్వవైభవం.

వృశ్చికం: పనులలో అవాంతరాలు. రుణయత్నాలు. ఆకస్మిక ప్రయాణాలు. ఇంటాబయటా కొంత గందరగోళం. ధనవ్యయం. శ్రమాధిక్యం. వ్యాపారాలు, ఉద్యోగాలలో చిక్కులు.

ధనుస్సు: ఇంటిలో శుభకార్యాలు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా  ఉంటుంది. సన్నిహితుల సాయం అందుతుంది. పలుకుబడి పెరుగుతుంది. వాహనయోగం. వ్యాపారాలు, ఉద్యోగాలు మరింత పుంజుకుంటాయి.

మకరం: వ్యయప్రయాసలు. బంధుమిత్రులతో విభేదాలు. ఆర్థిక లావాదేవీలు నిరాశ పరుస్తాయి. కొన్ని పనులు చివరిలో వాయిదా వేస్తారు. వ్యాపారాలు, ఉద్యోగాలు నిరుత్సాహపరుస్తాయి.

కుంభం: వ్యవహారాలు సాఫీగా సాగుతాయి. స్థిరాస్తి వివాదాల పరిష్కారం. శుభకార్యాలకు హాజరవుతారు. దూరపుబంధువుల కలయిక. ధనలబ్ధి. వ్యాపారాలు, ఉద్యోగాలలో అనుకున్న ప్రగతి ఉంటుంది.

మీనం: ముఖ్యమైన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. ఆహ్వానాలు అందుతాయి. భూములు, వాహనాలు కొనుగోలు చేస్తారు. సోదరుల కలయిక. వ్యాపారాలు, ఉద్యోగాలలో మీదే పైచేయిగా ఉంటుంది.– సింహంభట్ల సుబ్బారావు

Read latest Astrology News and Telugu News | Follow us on FaceBook, Twitter


Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top