గ్రహం అనుగ్రహం (01-01-2020)

Daily Horoscope in Telugu (01-01-2020) - Sakshi

శ్రీ వికారి నామ సంవత్సరం, దక్షిణాయనం, హేమంత ఋతువు, పుష్యమాసం, తిథి శు.షష్ఠి ప.4.37 వరకు తదుపరి సప్తమి, నక్షత్రం పూర్వాభాద్ర రా.3.11 వరకు తదుపరి ఉత్తరాభాద్ర, వర్జ్యం ఉ.7.38 నుంచి 9.25 వరకు దుర్ముహూర్తం ప.11.40 నుంచి 12.23 వరకు అమృతఘడియలు... సా.6.20 నుంచి 8.04 వరకు.

సూర్యోదయం :    6.34
సూర్యాస్తమయం    :  5.32
రాహుకాలం :  ప. 12.00 నుంచి 1.30 వరకు
యమగండం :  ఉ.7.30 నుంచి 9.00 వరకు

భవిష్యం
మేషం:  ఆకస్మిక ధనలబ్ధి. ప్రముఖులతో పరిచయాలు. సంఘంలో విశేష గౌరవం. ఆహ్వానాలు అందుతాయి. వృత్తి,వ్యాపారాలు ఉత్సాహవంతంగా సాగుతాయి. దైవదర్శనాలు.

వృషభం: కొత్త వ్యక్తుల పరిచయం. శుభవార్తలు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. సన్నిహితుల సాయం అందుతుంది. వ్యాపార, ఉద్యోగాలలో ప్రోత్సాహకరంగా ఉంటుంది.

మిథునం: పనులు నిదానిస్తాయి. ఉద్యోగ యత్నాలు కొంత ఫలిస్తాయి. దూరప్రయాణాలు. ధనానికి ఇబ్బంది ఉండదు. వ్యాపార, ఉద్యోగాలలో కొంత ఉత్సాహవంతంగానే ఉంటుంది.

కర్కాటకం: ఆర్థిక ఇబ్బందులు కొంత తీరతాయి. పనులు నెమ్మదిగా పూర్తి చేస్తారు. ఆహ్వానాలు అందుతాయి. ఆలయాలు సందర్శిస్తారు. వృత్తి, వ్యాపారాలలో అవాంతరాలు అధిగమిస్తారు. విద్యార్థులకు కొత్త ఆశలు చిగురిస్తాయి.

సింహం: మిత్రుల నుంచి ఆహ్వానాలు. విందువినోదాలు. పనుల్లో విజయం. ఆస్తి వివాదాల పరిష్కారం. గృహ, వాహనయోగాలు. వ్యాపార, ఉద్యోగాలలో పురోగతి. కళాకారులకు సన్మానాలు.

కన్య: కొత్త విషయాలు తెలుసుకుంటారు. ప్రతిభ వెలుగులోకి వస్తుంది. ఆహ్వానాలు అందుతాయి. వాహనయోగం. వృత్తి,వ్యాపారాలు మరింత అనుకూలిస్తాయి. సంఘంలో గౌరవం పెరుగుతుంది.

తుల: పనులు వాయిదా వేస్తారు. ఆర్థిక పరిస్థితి కాస్త మెరుగ్గా ఉంటుంది. అనుకోని ప్రయాణాలు. ఇంటాబయటా పెత్తనం చెలాయిస్తారు. వ్యాపార, ఉద్యోగాలలో కొంత ప్రోత్సాహకరంగా ఉంటుంది.

వృశ్చికం: రుణబాధలు తొలగే సూచనలు. కుటుంబసభ్యులతో ముఖ్య విషయాలు చర్చిస్తారు.   వృత్తి,వ్యాపారాలలో ఒత్తిడుల నుంచి బయటపడతారు. ఆధ్యాత్మిక చింతన. విద్యార్థుల యత్నాలలో పురోగతి.

ధనుస్సు: కొత్త పనులు ప్రారంభిస్తారు. సంఘంలో గౌరవం. విలువైన వస్తువులు సేకరిస్తారు. పరపతి పెరుగుతుంది. విద్యావకాశాలు దక్కుతాయి.  వృత్తి, వ్యాపారాలలో మరింత పురోగతి. ఆలయ దర్శనాలు.

మకరం: కుటుంబంలో ఒత్తిడులు తొలగుతాయి.  ధనవ్యయం.విద్యార్థులకు శ్రమకు ఫలితం కనిపిస్తుంది. కొన్ని  పనుల్లో జాప్యం. దూరప్రయాణాలు. వృత్తి, వ్యాపారాలలో కొన్ని  మార్పులు.

కుంభం: ఆకస్మిక ధనలాభం. పనుల్లో విజయం. శుభకార్యాలలో పాల్గొంటారు. పాతమిత్రుల కలయిక. విందువినోదాలు. వృత్తి, వ్యాపారాలలో అనుకూల పరిస్థితులు. కళాకారులకు ఊహించని అవకాశాలు.

మీనం: కుటుంబసభ్యులతో ముఖ్య విషయాలు చర్చిస్తారు. కొన్ని పనులు నిదానిస్తాయి. సంఘంలో గౌరవం పెరుగుతుంది. దైవదర్శనాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో మరింత అనుకూలత.– సింహంభట్ల సుబ్బారావు

Read latest Astrology News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top