గ్రహం అనుగ్రహం (20-06-2020)

Daily Horoscope inTelugu (20-06-2020) - Sakshi

శ్రీశార్వరినామ సంవత్సరం ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు జ్యేష్ఠ మాసం తిథి బ.చతుర్దశి ప.11.14 వరకు తదుపరి అమావాస్య, నక్షత్రం రోహిణి ప.12.03 వరకు తదుపరి మృగశిర, వర్జ్యం సా.5.55 నుంచి 7.34 వరకుదుర్ముహూర్తం ఉ.5.29 నుంచి 7.14 వరకు అమృతఘడియలు..ఉ.8.34 నుంచి 9.44 వరకు

సూర్యోదయం :    5.30
సూర్యాస్తమయం    :  6.32
రాహుకాలం :  ఉ.9.00 నుంచి 10.30 వరకు
యమగండం :  ప.1.30 నుంచి 3.00 వరకు

దినఫలాలు
మేషం: రాబడి నిరాశ కలిగిస్తుంది. రుణయత్నాలు. ఆకస్మిక ప్రయాణాలు. బంధుమిత్రులతో విరోధాలు.పరిస్థితులు అంతగా అనుకూలించవు. కుటుంబంలో ఒత్తిడులు పెరుగుతాయి. దేవాలయాల సందర్శనం. వ్యాపారులకు ఒడిదుడుకులు. ఉద్యోగులకు విధుల్లో ఒత్తిడులు.

వృషభం: ఉద్యోగావకాశాలు పొందుతారు. వాహనాలు కొంటారు. ఆదాయం మరింతగా పెరుగుతుంది. వ్యాపారులు ఆటంకాలు అధిగిమిస్తారు.ఉద్యోగులకు ఉత్సాహంగా గడుస్తుంది.

మిథునం: వ్యవహారాలు ముందుకు సాగవు. బంధువర్గంతో విరోధాలు. విలువైన వస్తువులు భద్రంగా చూసుకోండి. కొన్ని నిర్ణయాలలో పొరపాట్లు. కుటుంబసభ్యులతో విభేదిస్తారు. వ్యాపారులకు అదనపు బాధ్యతలు. ఉద్యోగులకు బదిలీ అవకాశాలు.

కర్కాటకం: కార్యక్రమాలు సకాలంలో చక్కదిద్దుతారు. కుటుంబ సమస్యలు పరిష్కరించుకుంటారు.ఆలయాలు సందర్శిస్తారు. ఆస్తి వివాదాలు తీరతాయి.  వ్యాపారులు ముందడుగు వేస్తారు. ఉద్యోగాలలో ఒత్తిడులు తొలగుతాయి.

సింహం: రావలసిన బాకీలు అందుతాయి. కార్యక్రమాలలో పురోగతి. కుటుంబసభ్యుల చేయూతతో ముందుకు సాగుతారు. వాహనాలు, స్థలాలు కొనుగోలు చేస్తారు. వ్యాపారులకు అనుకూలం. ఉద్యోగులకు పదోన్నతులు దక్కుతాయి.

కన్య: దూరప్రయాణాలు ఉండవచ్చు. వివాదాలకు దూరంగా ఉండండి. బంధువుల నుంచి ఒత్తిడులు. రాబడి సంతృప్తికరంగా ఉంటుంది. వ్యాపారులకు ఆటుపోట్లు. ఉద్యోగులకు శ్రమాధిక్యం.

తుల: కుటుంబసమస్యలు. ఆదాయానికి మించి ఖర్చులు. ఆకస్మిక ప్రయాణాలు ఉండవచ్చు. కార్యక్రమాలు నిదానంగా సాగుతాయి. బ«ంధువులతో విభేదాలు వ్యాపారులకు నిరుత్సాహం. ఉద్యోగులకు అధికారుల నుంచి ఒత్తిడులు. 

వృశ్చికం: స్నేహితులను కలుసుకుంటారు. ఇంటిలో  రాబడి మెరుగ్గా ఉంటుంది.మీ ఊహలు నిజం చేసుకుంటారు. కార్యక్రమాలు అనుకున్న రీతిలో సాగుతాయి. గృహ,
వాహనయోగాలు. వ్యాపారులకు లాభసాటిగా ఉంటుంది. ఉద్యోగులకు కొన్ని చిక్కులు తొలగుతాయి.

ధనుస్సు: ఆలోచనలు అమలు చేస్తారు. గౌరవప్రతిష్ఠలు పెరుగుతాయి. చిరకాల కోరిక నెరవేరుతుంది.ఆహ్వానాలు, గ్రీటింగ్‌లు అందుతాయి. వ్యాపారాలలో ఒడిదుడుకులు తొలగుతాయి. ఉద్యోగులకు ప్రమోషన్లు.

మకరం:కుటుంబసభ్యులతో అకారణంగా విరోధాలు. శ్రమానంతరం కార్యక్రమాలు పూర్తి చేస్తారు. కొన్ని కాంట్రాక్టులు చేజారతాయి. రాబడి నిరుత్సాహపరుస్తుంది. వ్యాపారులకు అంచనాలు తారుమారు.   ఉద్యోగులకు బదిలీలు ఉంటాయి.

కుంభం: కార్యక్రమాలు నత్తనడకన సాగుతాయి. ఆదాయానికి మించి ఖర్చులు. బంధువులతో అకారణంగా విరోధాలు. ఆకస్మిక ప్రయాణాలు ఉంటాయి. శారీరక రుగ్మతలు. దేవాలయ దర్శనాలు
చేసుకుంటారు. వ్యాపారులకు  లావాదేవీలు నిరాశ కలిగిస్తాయి. ఉద్యోగులు అదనపు పనిభారం.

మీనం: కార్యక్రమాలలో అనుకూలత. నిరుద్యోగులకు ఉద్యోగయోగం. స్థిరాస్తి వివాదాల నుంచి బయటపడతారు. ధార్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. వ్యాపారులకు పెట్టుబడులు సమకూరతాయి. ఉద్యోగవర్గాలకు బకాయిలు అందుతాయి.

Read latest Astrology News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top