బీసీలకు జగన్‌ భరోసా

YV Subba Reddy Meeting in West Godavari - Sakshi

వైఎస్సార్‌ సీపీ బీసీ గర్జన జయప్రదానికి కృషి

పార్టీ ఉభయగోదావరి జిల్లాల కో–ఆర్డినేటర్‌ వైవీ సుబ్బారెడ్డి

సభ ఏర్పాట్లపై పార్టీ నేతలతో కలిసి సమీక్ష

పశ్చిమగోదావరి , ఏలూరు టౌన్‌: రాష్ట్రంలోని బీసీ సామాజికవర్గ సంక్షేమానికి పెద్దపీట వేస్తూ.. వారి సమస్యల పరిష్కారానికి వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పూర్తి భరోసా కల్పిస్తారని ఆ పార్టీ రాజకీయ వ్యవహారాల కార్యదర్శి, ఉభయగోదావరి జిల్లాల కో–ఆర్డినేటర్‌ వైవీ సుబ్బారెడ్డి చెప్పారు. ఈనెల 17న ఏలూరులో బీసీ గర్జన మహాసభను జయప్రదం చేసేందుకు ఏలూరు పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్సీ ఆళ్ల నానితో కలిసి ఆయన గర్జన సభ ఏర్పాట్లపై  సమీక్షించారు. ఈ సందర్భంగా వైవీ సుబ్బారెడ్డి మాట్లాడుతూ రాబోయే సార్వత్రిక ఎన్నికల ప్రచార పర్వానికి ఏలూరు నుంచే పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి శ్రీకారం చుడతారని చెప్పారు. 17 తేదీ మధ్యాహ్నం 3 గంటలకు వైఎస్‌ జగన్‌ బీసీ గర్జన సభలో బీసీ వర్గాలనుద్దేశించి ప్రసంగిస్తారని వివరించారు. పార్టీలోని బీసీ నేతలు,   పార్టీ శ్రేణులు ఈ సభను విజయవంతం చేసేందుకు కృషి చేయాలని పిలుపునిచ్చారు.

పార్టీ నేతలతో సమీక్ష
ఏలూరు పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్సీ ఆళ్ళనాని, నరసాపురం పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు ముదునూరి ప్రసాదరాజు, రాజమండ్రి పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు కవురు శ్రీనివాస్, ఏలూరు పార్లమెంటరీ నియోజకవర్గ సమన్వయకర్త కోటగిరి శ్రీధర్, రాజమండ్రి పార్లమెంటరీ నియోజకవర్గ సమన్వయకర్త మార్గాని భరత్‌తోపాటు, పార్టీ అసెంబ్లీ సమన్వయకర్తలతో విడివిడిగా సమావేశాలు నిర్వహించి, ఏర్పాట్లపై సమీక్షించారు. సభ నిర్వహణ, ఏర్పాట్లపై ఆయన ఆరా తీశారు. బీసీ గర్జన ప్రాంగణాన్ని పరిశీలించారు.  సమావేశంలో సమన్వయకర్తలు కారుమూరి నాగేశ్వరరావు, తెల్లం బాలరాజు, తలారి వెంకట్రావు, కొట్టు సత్యనారాయణ, కొఠారు అబ్బయ్య చౌదరి, ఉన్నమట్ల ఎలీజా, పుప్పాల వాసుబాబు, గుణ్ణం నాగబాబు, చెరుకువాడ శ్రీరంగనాథరాజు, పార్టీ సీనియర్‌ నేత పాతపాటి సర్రాజు, బీసీ సెల్‌ జిల్లా అధ్యక్షుడు ఘంటా ప్రసాదరావు, మహిళా అధ్యక్షురాలు వందనపు సాయిబాలపద్మ, మేకా శేషుబాబు, గుబ్బల తమ్మయ్య, సుబ్బరాజు, మంతెన యోగేంద్రబాబు, యడ్లపల్లి తాతాజీ, మాజీ మంత్రి మరడాని రంగారావు ఉన్నారు.

బీసీ గర్జనకు ఇన్‌చార్జ్‌ల నియామకం  
ఏలూరులో నిర్వహించే బీసీ గర్జన మహాసభకు ఇన్‌చార్జ్‌లను వైవీ సుబ్బారెడ్డి నియమించారు. ఏలూరు పార్లమెంటరీ నియోజకవర్గ ఇన్‌చార్జ్‌గా తణుకు మాజీ మున్సిపల్‌ చైర్మన్‌  బలగం సీతారామయ్య, నరసాపురం పార్లమెంట్‌ ఇన్‌చార్జ్‌గా మహిళా సమన్వయకర్త పిల్లంగోళ్ళ శ్రీలక్ష్మి, రాజమండ్రి పార్లమెంటరీ నియోజకవర్గ ఇన్‌చార్జ్‌గా మాజీ ఎమ్మెల్సీ మేకా శేషుబాబును నియమించారు. ఇక నరసాపురం పార్లమెంట్‌కు సంబంధించి అసెంబ్లీ నియోజకవర్గాలకు ఇన్‌చార్జ్‌లను నియమించారు. పాలకొల్లు గాదిరాజు సుబ్బరాజు, ఆచంట గుబ్బల తమ్మయ్య, భీమవరం పాతపాటి సర్రాజు, తణుకు కొయ్యే మోషేన్‌రాజు, తాడేపల్లిగూడెం గూడూరి ఉమాబాల, ఉండి వేండ్ర వెంకటస్వామి, నరసాపురం గుబ్బల వేణులను ఇన్‌చార్జ్‌లుగా నియమించారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top