రాష్ట్రంలో మాయా పాలన

YV Subba reddy fires on cm chandrababu naidu - Sakshi

ప్రజలను మభ్యపెట్టేందుకు సీఎం చంద్రబాబు మరోసారి సిద్ధం

 నవరత్నాలను విస్తృతంగా ప్రచారం చేయాలి

 వైఎస్సార్‌ సీపీ పరిశీలకులు వైవీ సుబ్బారెడ్డి 

భీమవరం: రాష్ట్రంలో మాయల మాంత్రికుడు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పాలన సాగుతోందని,  నాలుగున్నరేళ్ల తెలుగుదేశం పాలనలో ప్రజలకంటే పచ్చచొక్కాల నాయకులకే ఎక్కువ లబ్ధి చేకూరిందని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఉభయగో దావరి జిల్లాల పరిశీలకులు, మాజీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి విమర్శించారు. భీమవరంలో శనివారం ఆ పార్టీ నియోజకవర్గ కన్వీనర్, మాజీ ఎమ్మెల్యే గ్రం«ధి శ్రీనివాస్‌ అధ్యక్షతన జరిగిన పార్టీ బూత్‌ కమిటీ కన్వీనర్ల సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. రాష్ట్రంలో దోపిడీ పాలన సాగుతోందని ఈ సొమ్ముతో రానున్న ఎన్నికల్లో ఓటర్లను తెలుగుదేశం పార్టీ మభ్యపెట్టేందుకు ప్రయత్నిస్తుందన్నారు. వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ నాయకులు, సానుభూతిపరులపై దాడులు చేసి ప్రభుత్వం త మ వైపునకు తిప్పుకునేందుకు చేస్తున్న ప్రయత్నాలు తిప్పికొట్టాలని సుబ్బారెడ్డి పిలుపునిచ్చారు. 

వైఎస్సార్‌ సీపీ విజయం ఖాయం
2019 ఎన్నికల్లో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ విజ యం ఖాయమైందని, బూత్‌ కమిటీలు మరింత అప్రమత్తంగా ఉండి పార్టీ అభిమానులు, సానుభూతిపరుల ఓట్లు పార్టీకి దక్కించుకునేలా పటిష్ట ప్రణాళికతో ముందుకు వెళ్లాలని సుబ్బారెడ్డి సూచించారు. పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రకటించిన నవరత్నాల పథకాలతో పాటు పాదయాత్రలో జగన్‌మోహన్‌రెడ్డి దృష్టికి తీసుకువచ్చిన సమస్యల పరిష్కారానికి క్షేత్రస్థాయిలో ప్రణాళికలు సిద్ధమవుతున్నాయన్నారు. పా ర్టీ అధికారంలోకి రావడానికి బూత్‌ కమిటీ సభ్యులపై గురుతర బాధ్యత ఉందని కష్టించి పనిచేసిన వారందరికీ తప్పనిసరిగా ఆసరా కల్పిస్తామని సుబ్బారెడ్డి స్పష్టంచేశారు. తెలుగుదేశం పార్టీ నాయకులు అక్రమంగా సంపాదించిన డబ్బుతో రానున్న ఎన్నికల్లో ఓటుకు రూ.5 వేల వరకు ఇచ్చే అవకాశం ఉందని అయితే వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వస్తే ప్రతి ఇంటికి నవరత్నాల పథకాల ద్వారా రూ.1.50 లక్షల ప్రయోజనం చేకూరుతుందనే విషయాన్ని ఓటర్లకు విపులంగా వివరించాలని కోరారు. 

ఇందుకోసం ప్రతి బూత్‌ కన్వీనర్‌ రోజుకు గంటపాటు పార్టీ కోసం పనిచేయాలన్నారు. ప్రజా సంక్షేమం, రాష్ట్రాభివృద్ధి కోసం జగన్‌మోహన్‌రెడ్డి నాలుగున్నరేళ్లుగా అలు పెరుగని పోరాటం చేస్తున్నారని, ఆయన వల్లే ప్ర త్యేక హోదా అంశం సజీవంగా నిలిచిందన్నారు. అయితే చంద్రబాబు ప్రజలను తప్పుదోవ ప ట్టించడానికి తన పార్టీ ఎంపీలతో ఢిల్లీలో ప్రత్యేక హోదా అంటూ సరికొత్త డ్రామాకు తెరలేపారని ఎద్దేవా చేశారు. మహానేత వైఎస్సార్‌ సువర్ణపాలన జగన్‌మోహన్‌రెడ్డితోనే సాధ్యమనే విషయాన్ని విస్తృత ప్రచారం చేయాలని పిలుపునిచ్చారు. 

ఓటర్ల జాబితాపై అప్రమత్తంగా ఉండాలి
మాజీ ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్‌ మాట్లాడుతూ ఓ టర్ల జాబితా తయారీలో బూత్‌ లెవిల్‌ అధికారుల పనితీరుపై పార్టీ బూత్‌కమిటీ కన్వీనర్లు నిత్యం అప్రమత్తంగా ఉండాలన్నారు. రాష్ట్ర బూత్‌ కమి టీల పరిశీలకుడు శ్రీనివాస్‌ ప్రసాద్‌ మాట్లాడుతూ రాబోయే ఎన్నికలకు బూత్‌ కమిటీల ద్వారా పోరాటం ప్రారంభం కావాలన్నారు.  పార్టీ అధ్యక్షుడు జగన్‌మోహన్‌రెడ్డి బూత్‌ కమిటీలపై ప్రత్యేక దృష్టి కేంద్రీకరించారన్నారు. పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కొయ్యే మోషేన్‌రాజు మాట్లాడుతూ వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వచ్చాక బూత్‌ కమిటీ కన్వీనర్ల ద్వారా అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు అమలవుతాయని దీనిని దృష్టిలో పెట్టుకుని ప్రత్యేక శ్రద్ధతో పనిచేయాలని సూచిం చారు.

 నరసాపురం పార్లమెంట్‌ నియోజకవర్గ అ«ధ్యక్షుడు ముదునూరి ప్రసాదరాజు, ఎమ్మెల్సీ కంతేటి సత్యనారాయణరాజు, నరసాపురం పార్లమెంట్‌ నియోజకవర్గ బూత్‌ కమిటీల కన్వీనర్‌ ఖం డవల్లి వాసు, గూడూరి ఉమాబాల, డాక్టర్‌ వేగి రాజు రామకృష్ణంరాజు, వేండ్ర వెంకటస్వామి, గా దిరాజు సుబ్బరాజు మాట్లాడారు. సమావేశంలో ఉండి మాజీ ఎమ్మెల్యే పాతపాటి సర్రాజు, రాష్ట్ర కార్యదర్శులు ఏఎస్‌ రాజు, వేండ్ర వెంకటస్వామి, కొప్పర్తి వీరరాఘవులు, కవురు శ్రీనివాస్, పేరిచర్ల విజయనర్సింహరాజు, కామన నాగేశ్వరరావు, రాయప్రోలు శ్రీనివాసమూర్తి,  గాదిరాజు తాతరాజు, పాలవెల్లి మంగ తదితరులు పాల్గొన్నారు.  

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top