వైఎస్‌ఆర్‌ సీపీ ప్లీనరీ అప్‌డేట్స్‌

వైఎస్‌ఆర్‌ సీపీ ప్లీనరీ అప్‌డేట్స్‌ - Sakshi


గుంటూరు‌: తెలుగు రాష్ట్రాల అభివృద్ధి, తెలుగు ప్రజల శ్రేయస్సే లక్ష్యంగా అలుపెరగని పోరాటం చేస్తున్న వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ జాతీయ ప్లీనరీ ప్లీనరీ సమావేశాలు రెండోరోజు కొనసాగుతున్నాయి. తొలిరోజు పలు అంశాలపై తీర్మానాలు ఆమోదించారు. సాయంత్రం వరకు కొనసాగిన మొదటి రోజు ప్లీనరీలో తీర్మానాలను బలపరుస్తూ పలువురు నాయకులు మాట్లాడారు. ఆదివారం ఉదయం 9 గంటలకు రెండో రోజు ప్లీనరీ కళాకారుల  సాంస్కతిక కార్యక్రమాలతో ప్రారంభమైంది. ఈ సందర్భంగా రెండో రోజు ప్లీనరీకి సంబంధించిన కార్యక్రమాల వివరాలు ఎప్పటికప్పుడు లైవ్‌ అప్‌డేట్స్‌ మీకోసం..



రెండవ రోజు ప్లీనరీ అప్‌డేట్స్‌


మధ్యాహ్నం 4.44 గంటలు: ముగిసిన వైఎస్‌ జగన్‌ ప్రసంగం.. రెండు రోజుల ప్లీనరీ సమావేశం బ్రహ్మాండంగా విజయవంతమైందని ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు ప్రకటన..


మధ్యాహ్నం 4.39 గంటలు: అక్టోబర్‌ 27 నుంచి ఆరు నెలలపాటు మూడువేల కిలోమీటర్లు పాదయాత్ర నిర్వహిస్తాను: వైఎస్‌ జగన్‌ ప్రకటన


మధ్యాహ్నం 3.40 గంటలు: అధికారంలోకి రాగానే ఐదు ఎకరాలలోపు ఉన్న రైతులకు రూ.50 వేలు ఇచ్చే ఏర్పాటు చేస్తాం: వైఎస్‌ జగన్‌


మధ్యాహ్నం 3.05 గంటలు:  ప్లీనరీ వేదికగా అశేషమైన కార్యకర్తలను ఉద్దేశించి ప్రసంగిస్తున్న వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి


మధ్యాహ్నం 3.00 గంటలు:  వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్ష ఎన్నికల ఫలితాలను ప్రకటించిన ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు.. అధ్యక్ష పదవికి  20 సెట్ల నామినేషన్లు వచ్చాయని, అన్ని సెట్లలోనూ వైఎస్‌ జగన్‌ను నేతలు నామినేట్‌ చేయడంతో.. వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పార్టీ జాతీయ అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారని ఉమ్మారెడ్డి ప్రకటించారు. దీంతో ప్లీనరీ ప్రాంగణం పార్టీ కార్యకర్తల హర్షధ్వానాలతో మార్మోగింది. జై జగన్‌ నినాదాలతో దద్దరిల్లింది.


మధ్యాహ్నం 2:54 గంటలు: స్థానిక సంస్థలపై తీర్మానాన్ని ప్రవేశపెట్టిన వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే కాకాని గోవర్థన్‌రెడ్డి


మధ్యాహ్నం 2:48 గంటలు: కృష్ణ, గోదావరిలు ఏకమై అమరావతి ప్లీనరీలో జనగోదావరి అయ్యాయి: వైఎస్‌ఆర్‌ సీపీ నాయకురాలు జక్కంపూడి విజయలక్ష్మి


మధ్యాహ్నం 2:40 గంటలు : నాకు రాజకీయ జీవితాన్ని ఇచ్చిన వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డికి జీవితాంతం రుణపడి ఉంటా: ప్లీనరీలో వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎంపీ వరప్రసాద్‌



మధ్యాహ్నం 2:30 గంటలు : 'రాష్ట్రానికి ప్రత్యేక హోదా తెస్తామని మోదీతో కలిసి తిరిగి ప్రచారం చేసిన చంద్రబాబు ఆ మాటను గాలికి వదిలేశారు'- వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి


మధ్యాహ్నం 2:20 గంటలు : మానవ వనరుల తీర్మానాన్ని బలపరుస్తూ ప్రసంగించిన పార్టీ నేత శ్రీనివాసరెడ్డి



మధ్యాహ్నం 2:10 గంటలు : 'చంద్రబాబు నంద్యాల ప్రజల్ని భయపెడుతున్నారు. నంద్యాల ప్రజలు దెబ్బకొడితే చంద్రబాబు అబ్బ అంటారు. ఈ విషయం ఆయన గుర్తుంచుకుంటే మంచిది' - కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి

 


మధ్యాహ్నం 1:55 గంటలు : మానవ వనరులు, విద్యా, వైద్య తీర్మానం ప్రవేశపెట్టిన పార్టీ నేత తమ్మినేని సీతారాం.



మధ్యాహ్నం 1:50గంటలు : 'మూడు సంవత్సరాలు అయినా చంద్రబాబునాయుడు సొంత జిల్లా చిత్తూరులో అభివృద్ధికి అడ్రస్సే లేదు'- చింతల రామచంద్రరెడ్డి


మధ్యాహ్నం 1:48 గంటలు : చంద్రబాబు తప్పుడు వాగ్దానాలతో అధికారంలోకి వచ్చారు. గత మూడేళ్లలో ఇచ్చిన హామీలు అమలు చేయకుండా రైతుల్ని మోసం చేస్తున్నారు-ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి


మధ్యాహ్నం 1:42 గంటలు : మూడేళ్ల చంద్రబాబు పాలనలో లక్షరాల ఎకరాలు భూములు కబ్జా జరిగింది-ఎమ్మెల్యే ఆదిమూలపు సురేష్‌


మధ్యాహ్నం 1:32 గంటలు :రాష్ట్రంలో ఇసుక మాఫియా-అరాచకాలపై తీర్మానం ప్రవేశపెట్టిన ఎమ్మెల్యే శ్రీకాంత్‌ రెడ్డి


మధ్యాహ్నం 1:28 గంటలు :  రాష్ట్రంలో ఆటవిక పాలన కొనసాగుతోంది, ప్రజలను తన అలవికానీ హామీలతో మభ్యపెడుతున్నారు - ఎమ్మెల్యే శ్రీనివాసులు


మధ్యాహ్నం 1:26 గంటలు :  చంద్రబాబు అబద్ధపు హామీలపై ప్రజలు తిరగబడే రోజులు దగ్గర పడ్డాయి- పార్టీ నేత గౌతంరెడ్డి


మధ్యాహ్నం 1:20 గంటలు : 'నేను ఎమ్మెల్యే అని చెప్పుకునేకంటే వైఎస్‌ఆర్‌ అభిమానిని అని చెప్పుకునేందుకు ఇష్టపడతాను'-ప్లీనరీ ప్రసంగంలో ప్రొద్దుటూరు ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్‌రెడ్డి

 


మధ్యాహ్నం 1: 10 గంటలు : 'విశాఖపట్నం భూములన్నీ దోచుకుపోయిన చంద్రబాబు చివరకు విశాఖ ప్రజలకు కరిగిపోయిన ఐస్‌ పుల్లలిచ్చాడు'- ప్లీనరీ ప్రసంగంలో గుడివాడ అమర్నాథ్‌



మధ్యాహ్నం 1:00 గంటలు : 'తప్పులు చేసి ఉమ్మడి రాజధాని నుంచి రాత్రికి రాత్రి పారిపోయి వచ్చిన చరిత్ర చంద్రబాబుది. '- ఆళ్ల రామకృష్ణారెడ్డి


మధ్యాహ్నం 12:55 గంటలు : ప్రకాశం జిల్లా తీర్మానాలను ప్రవేశ పెట్టిన బాలీనేని శ్రీనివాసరెడ్డి



మధ్యాహ్నం 12:50 గంటలు : ప్రశాంత్‌ కిశోర్‌ను ప్లీనరీ సమావేశంలో పార్టీ శ్రేణులకు పరిచయం చేసిన వైఎస్‌ జగన్‌



మధ్యాహ్నం 12:45 గంటలు : 'నాయకుడు అంటే వైఎస్‌ జగన్‌. వెన్నుపోటు పొడిచే వ్యక్తి చంద్రబాబు నాయుడు' - వైఎస్‌ఆర్‌ సీపీ ఎమ్మెల్యే నారాయణ స్వామి



మధ్యాహ్నం 12:40 గంటలు : ప్లీనరీ వేదికపై ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్‌ కిషోర్‌. ఆహ్వానించిన వైఎస్‌ జగన్‌



మధ్యాహ్నం 12:30 గంటలు : 'కాపులను చంద్రబాబు దారుణంగా మోసం చేశారు. ఇచ్చిన హామీ నెరవేర్చాలని పోరాటం చేస్తే సంఘవిద్రోహ శక్తులంటూ పేరుపెట్టారు'- ప్లీనరీ ప్రసంగంలో కురసాల కన్నబాబు


మధ్యాహ్నం 12:18 గంటలు :  ఫ్యాక్షనిస్టులను ప్రోత్సహించి  నా భర్తను చంద్రబాబు పొట్టన పెట్టుకున్నారు-కర్నూలు జిల్లాలో హత్యకు గురైన నారాయణ రెడ్డి సతీమణి శ్రీదేవి



మధ్యాహ్నం 12:10 గంటలు : మోదీని, పవన్‌ కల్యాణ్‌ను కలుపుకొని అడ్డదారిలో చంద్రబాబు సీఎం అయ్యారు-వాసిరెడ్డి పద్మ ప్రసంగం


మధ్యాహ్నం 12:08 గంటలు : ముగిసిన విజయమ్మ ప్రసంగం. 'ఇప్పుడే ఎన్నికలు వచ్చాయని భావించి ప్రతి ఒక్కరూ పార్టీకోసం పనిచేసి రాజన్న స్వర్ణయుగం తీసురావాలి' -వైఎస్‌ విజయమ్మ



ఉదయం 11:48 గంటలు : ప్లీనరీ సందర్భంగా ప్రసంగాన్ని ప్రారంభించిన వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ గౌరవ అధ్యక్షురాలు వైఎస్‌ విజయమ్మ. '35సంవత్సరాలు కాంగ్రెస్‌ పార్టీకి సేవ చేస్తే వారు ఏం చేశారో అందరికీ తెలుసు. రాజశేఖర్‌ రెడ్డిగారి వల్లే కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వస్తే ఆయన చనిపోయిన తర్వాత మా కుటుంబం పట్ల కాంగ్రెస్‌ పార్టీ కఠినంగా వ్యవహరించింది'- వైఎస్‌ విజయమ్మ



ఉదయం 11:37 గంటలు : నెల్లూరు జిల్లా తరుపున ప్రసంగాన్ని ప్రారంభించిన వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే అనిల్‌ కుమార్‌ యాదవ్‌. 'చంద్రబాబు పిచ్చిపట్టి తిరుగుతున్నారు. నూటికి నూరుపాల్లు ఆయన పిచ్చి వ్యక్తిలా తయారయ్యారు. ఆయనను దగ్గరుండి ఆస్పత్రిలో చేర్పించాల్సిన బాధ్యత మనందరిది'-  ఎమ్మెల్యే అనిల్‌ కుమార్‌ యాదవ్‌


ఉదయం 11:36 గంటలు : రాబోతున్నది రాజన్య రాజ్యం.. తేబోతున్నది జగనన్న. దీన్ని సాధ్యం చేయబోతున్నది దేవుని దీవెన'- వైఎస్‌ షర్మిల. ముగిసన షర్మిల ప్రసంగం.

 


ఉదయం 11:18 గంటలు : ప్లీనరీలో ప్రసంగాన్ని ప్రారంభించిన వైఎస్‌ షర్మిల. ‘నాన్న లేని లోటు మాటల్లో చెప్పలేనిది. నేను రైతు పక్షపాతినని చెప్పుకున్న మహానేత వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డి’-వైఎస్‌ షర్మిల


ఉదయం 11:11 గంటలు : కర్నూలు జిల్లా తీర్మానాలు ప్రవేశపెట్టిన వెంకటరెడ్డి



ఉదయం 11:10 గంటలు : ప్లీనరీ వేదికపైకి చేరుకున్న పార్టీ గౌరవ అధ్యక్షురాలు విజయమ్మ, షర్మిల


ఉదయం 11:06 గంటలు : గుంటూరు జిల్లా తీర్మానం ప్రవేశ పెట్టిన పార్టీ నేత లేళ్ల అప్పిరెడ్డి  



ఉదయం 11:05గంటలు : ప్లీనరీ ప్రాంగణానికి చేరుకున్న పార్టీ గౌరవ అధ్యక్షురాలు విజయమ్మ, షర్మిల. కరతాల ధ్వనులతో ఆహ్వానం


ఉదయం 10:50 గంటలు : ప్రసంగం ప్రారంభించిన వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ నేత లక్ష్మీపార్వతీ. 'ప్రజల హృదయాల్లో చెరగని ముద్ర వేసుకున్న వ్యక్తి వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డి. మరణించినా బ్రతికుండే వాళ్లలో వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డి ముందుంటే.. బతికి ఉన్నప్పటికీ అడ్రస్‌ లేకుండా పోయే వ్యక్తుల్లో చంద్రబాబు ముందుంటారు'-లక్ష్మీ పార్వతీ


ఉదయం 10:35 గంటలు :  వైఎస్‌ఆర్‌ సీపీ శ్రేణులపై దాడులు అంశంపై తీర్మానం ప్రవేశపెట్టిన పార్టీ సీనియర్‌ నేత పార్థసారథి


ఉదయం 10: 28 గంటలు : తెలంగాణ ప్రభుత్వ వైఫల్యాలపై ధ్వజమెత్తిన తెలంగాణ వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు గట్టు శ్రీకాంత్‌ రెడ్డి.


ఉదయం 10: 20 గంటలు : తెలంగాణ ప్రభుత్వ హామీల వైఫల్యాలపై తీర్మానం ప్రవేశపెట్టిన కరీంనగర్‌ నియోజకవర్గం ఇంచార్జీ డాక్టర్‌ కే నగేష్‌.


ఉదయం 10:15 గంటలు : తెలంగాణ ప్రభుత్వ వైఫల్యాలపై తీర్మానం ప్రవేశ పెట్టిన తెలంగాణ వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ నేత శివకుమార్‌


ఉదయం 10:10గంటలు : తెలంగాణ సామాజిక, ఆర్థిక అంశాలపై తీర్మానం ప్రవేశ పెట్టిన తెలంగాణ వైఎస్‌ఆర్‌ సీపీ నేత కొండా రాఘవరెడ్డి


ఉదయం 10:00 గంటలు : ప్రారంభమైన రెండవ రోజు ప్లీనరీ 


ఉదయం 9:58 గంటలు : వేదికపై నుంచి ప్రజావాహినికి అభివాదం చేసిన వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి


ఉదయం 9:57 గంటలు : వేదిక వద్ద ఏర్పాటు చేసిన వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డి విగ్రహానికి పుష్పాంజలి ఘటించిన వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి


ఉదయం 9:55 గంటలు : వైఎస్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డిని ప్లీనరీ వేదికపైకి ఆహ్వానించిన పార్టీ నేత కరణం ధర్మశ్రీ


ఉదయం 9:40 గంటలు : ప్లీనరీ ప్రాంగణానికి చేరుకున్న వైఎస్‌ జగన్‌


ఉదయం 9:19 గంటలు : స్టేట్‌ గెస్ట్‌ హౌస్‌ నుంచి ప్లీనరీకి బయల్దేరిన వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి


ఉదయం 9:15 గంటలు : మరికాసేపట్లో వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ రెండవ రోజు ప్లీనరీ. కొనసాగుతున్న సాంస్కృతిక కార్యక్రమాలు. వేలాదిగా తరలివచ్చిన జనాలు.


 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top