నన్నపనేనిని అరెస్ట్‌ చేయాలి

YSRCP Women Leader Demanding That Arrest Of nannapaneni Rajakumari - Sakshi

సాక్షి, హనుమాన్‌జంక్షన్‌(కృష్ణా): దళిత మహిళా ఎస్సైను అవమానిస్తూ నోటి దురుసుగా ప్రవర్తించిన ఎమ్మెల్సీ నన్నపనేని రాజకుమారిని తక్షణమే అరెస్ట్‌ చేయాలని వైఎస్సార్‌ సీపీ మహిళా విభాగం జిల్లా అధ్యక్షురాలు, జెడ్పీటీసీ మాజీ సభ్యురాలు కైలే జ్ఞానమణి డిమాండ్‌ చేశారు. స్థ్ధానిక విలేకరులతో శుక్రవారం ఆమె మాట్లాడు తూ దళితులపై తెలుగుదేశం ప్రభుత్వ హయంలో ఎన్నో దౌర్జన్యాలు, దాడులు జరిగాయని  ఆగ్రహం వ్యక్తం చేశారు. 

అధికార దురంహంకారంతో టీడీపీ అధి నేత  చంద్రబాబు సహా ఆ పార్టీ నేతలు పలుమార్లు దళితులను అవమానించేలా వ్యా ఖ్యలు చేశారని గుర్తు చేశా రు.  సార్వత్రిక ఎన్నికల్లో ప్రజలు గట్టిగా బుద్ధి చెప్పినా తెలు గుదేశం నాయకుల్లో ఇంకా అహంకారపూరిత ధోరణి పోలేదని దుయ్యబట్టారు. పల్నాడులో పాతకక్షలను రెచ్చగొట్టి శాంతిభద్రతలకు విఘాతం కలిగించేలా తెలుగుదేశం పార్టీ నాయకులు వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. పల్నాడు ప్రాంతంలో టీడీపీ పెయిడ్‌ ఆర్టిస్ట్‌లతో ఆడుతున్న డ్రామాలను కట్టిపెట్టాలని డిమాండ్‌ చేశారు. 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top