‘నంద్యాల ఉప ఎన్నికలో మేమే గెలుస్తాం’

‘నంద్యాల ఉప ఎన్నికలో మేమే గెలుస్తాం’


సాక్షి, నంద్యాల: కర్నూలు జిల్లా నంద్యాల ఉప ఎన్నిక విజయంపై వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ రాజకీయ కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి ధీమా వ్యక్తం చేశారు. ఆయన శనివారమిక్కడ మాట్లాడుతూ నంద్యాల ఉప ఎన్నికలలో తాము గెలుపు కోసమే కాకుండా, మెజారిటీపై కూడా దృష్టి పెట్టామన్నారు. వైఎస్‌ జగన్‌కు నంద్యాల ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారన్నారు.


చిన్నస్థాయి నేతలను టీడీపీ కొంటోందని, కానీ ప్రజాభిమానాన్ని మాత్రం కొనలేరని ఆయన అన్నారు. ఎన్నికల సమయంలో పనులు ప్రారంభించి, దానినే అభివృద్ధి అని చంద్రబాబు సర్కార్‌ చెప్పుకుంటోందని సజ్జల రామకృష్ణారెడ్డి ధ్వజమెత్తారు. కాగా నంద్యాల నియోజకవర్గంలో పార్టీ అధినేత వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి ఎన్నికల ప్రచారం కొనసాగుతోంది.

Back to Top