దమ్ముంటే ఎన్నికలకు రండి: పద్మ

దమ్ముంటే ఎన్నికలకు రండి: పద్మ


హైదరాబాద్‌: మూడేళ్ల పాలనలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు హామీలు నెరవేర్చకుండా వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డిని విలన్‌గా చిత్రీకరించడం సరికాదాని వైఎస్సార్సీపీ అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ అన్నారు. ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేలను కొని బాబు రాజకీయ వ్యభిచారానికి పాల్పడ్డారని చెప్పారు. ఓటుకు కోట్లు కేసులో అడ్డంగా దొరికిపోయిన బాబు.. అవినీతి గురించి మాట్లాడటం సిగ్గుచేటని అన్నారు.మూడేళ్ల పరిపాలనలో చంద్రబాబు రూ.2 లక్షల కోట్ల అవినీతికి పాల్పడ్డరని ఆరోపించారు. జనం కోసం జగన్‌ మోహన్‌ రెడ్డి పోరాటం చేస్తుంటే స్వార్ధ ప్రయోజనాల కోసం బాబు కేంద్రం కాళ్లు పట్టుకుంటున్నారని అన్నారు. మరో 50 ఏళ్ల పాటు అధికారంలో ఉంటామని చెబుతున్న చంద్రబాబు దమ్ముంటే పార్టీ మారిన 21 మంది ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించాలని ఎన్నికలకు రావాలని సవాలు విసిరారు.

Back to Top