ఆత్మీయ సదస్సు.. ఆర్తులకు ఉషస్సు

YSRCP Meeting With Muslim Minorities In Visakhapatnam - Sakshi

వేదనతో ముస్లింలు సతమతం పట్టించుకోని టీడీపీ సర్కారు

సంక్షేమం విస్మరించిన చంద్రబాబు

కక్ష సాధింపుతో తల్లడిల్లుతున్న మైనారిటీలు

దారిచూపే నేత కోసం నిరీక్షణ

12న ముస్లింలతో వైఎస్సార్‌సీపీ అధినేత జగన్‌మోహన్‌రెడ్డి సమాలోచన

వేదిక: విశాఖ శివారు ఆరిలోవ బీఆర్‌టీఎస్‌ రోడ్డు

విశాఖపట్నం : ముస్లింల సమస్యలు తెలుసుకోవడం..వాటి పరిష్కారానికి  సలహాలు, సూచనలు తీసుకునేందుకు ఈ నెల 12న  విశాఖలోని ఆరిలోవ బీఆర్‌టీఎస్‌ రోడ్డు వైఎసార్‌సీపీ ఆధ్వర్యంలో పార్టీ అధినేత జగన్‌మోహన్‌రెడ్డి రాష్ట్రస్థాయి ముస్లింల ఆత్మీయ సదస్సు నిర్వహిస్తున్నారు. సంకల్పయాత్రలో భాగంగా జిల్లాలో పాదయాత్ర నిర్వహిస్తున్న జగన్‌మోహన్‌రెడ్డి వారి సమస్యలను ఓపికగా విన్నారు. వాటి పరిష్కారానికి చేపట్టాల్సిన చర్యలపై ఆయన ఆత్మీయ సదస్సులో  చర్చిస్తారు. దివంగత నేత వైఎస్‌ హయాంలో మైనారిటీలకు నాలుగు శాతం రిజర్వేషన్‌ కల్పించి వారి సంక్షేమానికి అధిక ప్రాధాన్యమిచ్చారు.  ప్రస్తుతం అధికారంలో ఉన్న టీడీపీ ప్రభుత్వం మాత్రం వారిపై తీవ్ర వివక్ష చూపిస్తోంది.  

గత ఎన్నికల్లో కల్లబొల్లి హామీలిచ్చిన చంద్రబాబు అధికారం చేపట్టిన తరువాత వారిపట్ల తీవ్ర నిర్లక్ష్యం ప్రదర్శించారు. తమ సమస్యలు చెప్పుకునేందుకు ముందుకు వచ్చిన ముస్లిం యువకులపై తప్పుడు కేసులు నమోదు చేయించి గొంతు నొక్కేందుకు కుట్ర పూరితంగా వ్యవహరిస్తున్నారు. ఇన్నేళ్లవుతున్నా రుణాలు, ఉపకార వేతనాలు లేవు.. మసీదుల అభివృద్ధికి నిధుల్విలేదు. మైనారిటీల ధ్రువపత్రాలిచ్చేందుకు డబ్బులు గుంజుతున్నారని ముస్లింలు ధ్వజమెత్తుతున్నారు. ఏ కార్పొరేషన్‌ మాకు రుణాలిచ్చింది లేదు.. ఏళ్లు గడుస్తున్నా తమ బతుకులు అధ్వానంగానే ఉన్నాయి.. మా కష్టాలను చెప్పుకుందామంటే నిరసనకారులు, నేరస్తులుగా ప్రభుత్వాలు ముద్ర వేస్తున్నాయి.  ఈ పరిస్థితుల్లో మా సమస్యలు చెప్పుకునేందుకు భయబ్రాంతులకు గురవుతున్నామని ముస్లింలు వాపోతున్నారు. ఈ నేపథ్యంలో జగన్‌మోహన్‌రెడ్డి వారి సంక్షేమానికి చేపట్టాల్సిన చర్యలపై సలహాలు సూచనలు తీసుకోనున్నారు. ఇందుకోసం  వైఎస్సార్‌సీపీ ఆధ్వర్యంలో నిర్వహించనున్న రాష్ట్రస్థాయి ఆత్మీయ సదస్సులో తమ సమస్యలతో పాటు పరిష్కార మార్గాలు చెప్పుకునేందుకు ముస్లింలు సమాయత్తమవుతున్నారు.

తప్పుడు కేసులు పెట్టడం  అన్యాయం
 సమస్యలపై శాంతియుతంగా నిరసన చేపట్టిన గుంటూరు ముస్లిం యువకులపై తప్పుడు కేసులు పెట్టడం అన్యాయం. మమ్మల్ని వేధించడం ప్రభుత్వం మానుకోవాలి. ముస్లింల సంక్షేమంపై సర్కారుకు చిత్తశుద్ధి లేదు. ఇప్పటికైనా ముస్లింలను పట్టించుకోవాలి. –షేక్‌ సత్తార్, వడ్డాది

జగన్‌మోహన్‌రెడ్డి తోనే ముస్లింలకు మేలు
మాట ఇచ్చినందువల్లే  ఓదార్పు యాత్ర, ప్రత్యేకహోదాకు కట్టుబడి అనేక ఆందోళనలను ప్రజలపక్షాన జగన్‌మోహన్‌రెడ్డి నిర్వహిస్తున్నారు.    ప్రస్తుతం ప్రజా సంకల్పయాత్ర కొనసాగిస్తున్న  ఆయన అన్ని వర్గాలతో పాటు ముస్లిం సమస్యలు తెలుసుకుంటున్నారు. మా జాతికి ఆయన వల్ల మేలు జరుగుతుందని ఆశగా ఉంది .
–ఎస్‌.మీరా, రోలుగుంట

ఓట్ల కోసం చంద్రబాబు పాట్లు
నారా హమారా ఎన్నికల స్టంట్‌. ఓట్లు దండుకోవాలని చూస్తున్నారు. ఎన్నికల హామీలు నెరవేర్చాలని కోరిన ముస్లింలపై దేశద్రోహం కేసు పెట్టడం అన్యాయం. చంద్రబాబుకు చిత్తశుద్ధి ఉంటే ముందు మైనారిటీల సంక్షేమంపై దృష్టి సారించాలి. ముస్లింలు నివసిస్తున్న ప్రాంతాల్లో కనీస సదుపాయాలు కల్పించాలి.   –ఖాళీషా వల్లి, సీతారామపురం

వైఎస్‌ హయాంలో మేలు జరిగింది
చంద్రబాబు సర్కారు ముస్లింలను నిర్లక్ష్యం చేస్తోంది. వైఎస్‌ హయాంలోనే మాకు మేలు జరిగింది. నారా హమారా పేరుతో నిర్వహించిన సమావేశంలో ఎన్నికల వాగ్దానాలు నెరవేర్చాలని కోరిన మా యువకులపై కేసులు బనాయించడం అన్యాయం. ఈ ఘటనలో జగన్‌ మాకు అండగా ఉంటామని చేసిన ప్రకటన భరోసానిచ్చింది. పెదదొడ్డిగల్లులో మేం సాగుచేస్తున్న భూములపై టీడీపీ పెద్దల కళ్లు పడ్డాయి. కారు చౌకగా కొట్టేయాలని చూస్తున్నారు.– సుభాని, మైనార్టీ నాయకుడు (వల్లీ సుబాని

చచ్చామో బతికామో పట్టించుకోవడం లేదు
కశింకోటలో షాదీఖానా లేక తీవ్ర ఇబ్బంది పడుతున్నాం. ముస్లింల శ్మశానం వర్షాకాలం వస్తే నీటిలో మునిగి ఉంటుంది. దీనివల్ల ఆ సమయంలో ఎవరైనా మరణిస్తే అంతిమ సంస్కారాలు చేయడానికి నరకయాతన అనుభవించాల్సి వస్తోంది. బొకారి మస్‌జిద్‌ స్థలాన్ని సర్వే చేసి అప్పగించాలని అధికారుల చుట్టూ ఏడాదికి పైగా కాళ్లరిగేలా తిరుగుతున్నా పట్టించుకోవడం లేదు. పేద ముస్లింలకు గతంలో మైనార్టీ కోటా కింద 5 శాతం ఇచ్చే ఇళ్ల స్థలాలు, ఇళ్లు కూడా ఇవ్వడం లేదు.          –ఎస్‌.ఎం.ఎం.అలీ, నూరి మస్‌జిద్‌ కమిటీ ప్రతినిధి, కశింకోట

మరిన్ని వార్తలు

22-09-2018
Sep 22, 2018, 08:07 IST
సాక్షి, విశాఖపట్నం : వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు, ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర...
22-09-2018
Sep 22, 2018, 07:29 IST
ఒక మహోన్నతాశయం.. ఒక మహా సంకల్పం కలిసి.. ఒక మహోజ్వల ఘట్టం వైపు అడుగులు వేస్తున్నాయి.. మరో రెండు రోజుల్లో...
21-09-2018
Sep 21, 2018, 20:12 IST
సాక్షి, విశాఖపట్నం : వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్‌ ప్రతిపక్షనేత వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర 267వ...
21-09-2018
Sep 21, 2018, 13:00 IST
జన హితుడై... జన శ్రామికుడై... జనమే తన కుటుంబంగా...వారే జీవితంగా భావించే జగనన్న జిల్లాకు రానున్న తరుణంఆసన్నమైంది. ఎప్పుడు ఆయన...
21-09-2018
Sep 21, 2018, 12:52 IST
విజయనగరం మున్సిపాలిటీ: రాష్ట్రంలో నాలుగేళ్ల ప్రజా కంటక పాలనలో ప్రజలు పడుతున్న బాధలను తెలుసుకునేందుకు ఏపీ ప్రతిపక్ష నేత, వైఎస్సార్‌...
21-09-2018
Sep 21, 2018, 06:53 IST
సాక్షి, విశాఖపట్నం: బంగాళాఖాతంలో వాయుగుండం కారణంగా ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తుండడంతో ప్రతిపక్ష నేత, వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్‌జగన్‌మోహన్‌రెడ్డి నిర్వహిస్తున్న...
20-09-2018
Sep 20, 2018, 12:18 IST
ప్రజల సమస్యలను తెలుసుకుంటూ.. ప్రజలతో మమేకమై.. నేనున్నానంటూ బరోసా ఇస్తున్న జననేత పాదయాత్ర మరో మైలురాయిని..
20-09-2018
Sep 20, 2018, 09:04 IST
సాక్షి, విశాఖపట్నం : వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు, ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర...
20-09-2018
Sep 20, 2018, 07:08 IST
అన్నా చిట్టివలస జ్యూట్‌మిల్లు 2009లో లాకౌట్‌ అయింది. సుమారు 6,500 మంది కార్మికులు ఉపాధి కోల్పోయి రోడ్డునపడ్డారు. తమ ప్రభుత్వం...
20-09-2018
Sep 20, 2018, 06:57 IST
జాబు కావాలంటే జగన్‌ రావాలి. జగనే నెక్ట్స్‌ సీఎం కావాలి అంటూ సాయిగణపతి పాలిటెక్నిక్‌ విద్యార్థులు పెద్ద ఎత్తున నినాదాలు...
20-09-2018
Sep 20, 2018, 06:51 IST
ప్రజా సంకల్పయాత్ర బుధవారం సెంచూరియన్‌ యూనివర్సిటీ ముందు నుంచి వెళ్లడంతో విద్యార్థులంతా జననేతతో సెల్ఫీలు దిగేందుకు పోటీపడ్డారు. పారామెడికల్, బీఎస్సీ...
20-09-2018
Sep 20, 2018, 06:47 IST
మాది కడప. వైఎస్సార్‌ కుటుంబం అంటే నాకు చాలా ఇష్టం. దివంగత వైఎస్సార్‌ రాష్ట్ర ప్రజల కోసం ఎన్నో అభివృద్ధి,...
20-09-2018
Sep 20, 2018, 06:42 IST
దివ్యాంగుల చట్టం 2016ను ప్రతిష్టాత్మకంగా అమలు చేయడంతో పాటు పెరుగుతున్న దివ్యాంగుల సంఖ్యకు అనుగుణంగా రిజర్వేషన్‌ను 4 నుంచి 7...
20-09-2018
Sep 20, 2018, 06:38 IST
సాక్షి, విశాఖపట్నం: యువ తరంగం ఉప్పొంగింది. వజ్ర సంకల్పంతో దూసుకెళ్తున్న ఉద్యమాల సూరీడిని చూసేందుకు పోటెత్తింది. మీరే మా ఆశాకిరణం.....
20-09-2018
Sep 20, 2018, 04:11 IST
ప్రజా సంకల్ప యాత్ర నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి: ‘అన్నా.. లక్షలాది ఉద్యోగాలు ఇచ్చామని చంద్రబాబు, ఆయన కుమారుడు మంత్రి...
20-09-2018
Sep 20, 2018, 02:57 IST
19–09–2018, బుధవారం  పప్పలవానిపాలెం క్రాస్, విశాఖ జిల్లా   యువత బలిదానాలకు బాధ్యత మీది కాదా బాబూ? ఉదయం బస చేసిన ప్రాంతానికి దగ్గర్లోనే...
19-09-2018
Sep 19, 2018, 09:11 IST
సాక్షి, విశాఖపట్నం: వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీలోకి పెద్ద ఎత్తున నాయకుల చేరికలు కొనసాగుతున్నాయి. తాజాగా ప్రజాసంకల్పయాత్రలో ఉన్న పార్టీ అధ్యక్షుడు...
19-09-2018
Sep 19, 2018, 08:33 IST
నా పేరు కేవీఎన్‌ కార్తిక్‌. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం. వ్యక్తిత్వ వికాస నిపుణుడిగా హైదరాబాద్‌లో ఉంటున్నాను. దివంగత వైఎస్సార్‌...
19-09-2018
Sep 19, 2018, 08:28 IST
ప్రజాసంకల్పయాత్ర నుంచి.. వైఎస్సార్‌ సీపీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చేస్తున్న ప్రజా సంకల్పయాత్రకు వస్తున్న ప్రజాధరణ చూసి చంద్రబాబు సర్కారుకు దడ...
19-09-2018
Sep 19, 2018, 08:24 IST
సాక్షి, విశాఖపట్నం : ఆనందపురం ఆనంద పారవశ్యమైంది. ఆత్మీయత పంచింది. అభిమాన జల్లు కురిపించింది. కారుచీకటిలో కాంతిపుంజంలా దూసుకొస్తున్న సంకల్ప...
Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top