జగనన్నతోనే మళ్లీ మన్యానికి మహర్దశ

YSRCP Madhavi Chit Chat With Sakshi

రాజన్న పాలనలో గిరిజనులకు మేలు

ప్రజా సమస్యలను విస్మరించిన టీడీపీ

ఎన్నికలు ఎప్పుడువచ్చినా వైఎస్సార్‌ సీపీదే గెలుపు

నాన్న అడుగుజాడల్లో నడుస్తా.. దీవించండి..

సాక్షితో వైఎస్సార్‌సీపీ నాయకురాలు మాధవి

సాక్షి, విశాఖపట్నం ,కొయ్యూరు: దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి హయాంలో మన్య ప్రాంతం ఎంతో అభివృద్ధి చెందిందనీ.. జగనన్న సీఎం అయితేనే మళ్లీ ఆ స్వర్ణయుగం వస్తుందని ఇటీవల వైఎస్సార్‌ సీపీలో చేరిన దివంగత మాజీ ఎమ్మెల్యే గొట్టేడి దేముడు కుమార్తె మాధవి అన్నారు. గిరిజనులకు భూమి పట్టాలు ఇచ్చిన ఘనత వైఎస్సార్‌దేనన్నారు. ఎప్పుడు ఎన్నికలు వచ్చినా పాడేరు, అరకు నియోజకవర్గాల్లో తిరిగి వైఎస్సార్‌సీపీ విజయదుందుభి మోగిస్తుందన్నారు. ఆమె సోమవారం సాక్షితో మాట్లాడుతూ.. మాట తప్పని వంశం నుంచి వచ్చిన వైఎస్సార్‌ సీపీ అధినేత జగన్‌మోహన్‌రెడ్డి ఎట్టి పరిస్థితిల్లోనూ మాటకు కట్టుబడి ఉంటారని, బాక్సైట్‌ తవ్వకాలపై కావాలనే కొందరు తప్పుడు ప్రచారం చేస్తున్నారన్నారు. టీడీపీ అమలులోకి తీసుకువచ్చిన బాక్సైట్‌ తవ్వకాల జీవో 97పై ఏ పార్టీ నాయకులూ స్పందించడం లేదు.. కావాలనే వైఎస్సార్‌ సీపీపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారన్నారు. జగన్‌మోహన్‌రెడ్డికి బాౖMð్సట్‌ తవ్వకాల గురించి చెప్పామని, ఆయన దానికి వ్యతిరేకంగా ఉన్నారన్నారు.

దీన స్థితిలో విద్య వైద్యం
మన్యంలో మాతాశిశు మరణాలు అధికంగా జరుగుతున్నాయని, వాటిని ఆపడంలో సర్కారు పూర్తిగా విఫలమైందని మాధవి విమర్శించారు.
మన్యంలో పాడేరు,అరకులో పేరుకు రెండు పెద్దాసుపత్రులున్నా అక్కడ వైద్యులు లేని పరిస్థితి ఉందన్నారు. 36 పీహెచ్‌సీలకు ఎనిమిది మంది వైద్యులే రెగ్యులర్‌గా ఉన్నారన్నారు. మారుమూల ప్రాంతాల్లో సరైన తాగునీరు లేక బురుదనీటిని తాగి అనారోగ్యంతో మరణిస్తున్నారని తెలిపారు. రోడ్లు లేక ప్రసవాలకు కూడా అవస్థలు పడుతున్నారన్నారు. మన్యంలో ఉపాధ్యాయులు లేక ఎన్నో పాఠశాలలు మూతబడుతున్నాయన్నారు. తక్కువ మంది పిల్లలు ఉన్నారని పాఠశాలలను మూసి వేస్తున్నారని ఆరోపించారు. దీని మూలంగా పిల్లలకు విద్య అందనంత దూరంలో ఉంది. వైఎస్సార్‌ సీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే ఈ సమస్యలన్ని పరిష్కారం అవుతాయన్నారు. గిరిజనులు నాన్నపై ఎలాంటి నమ్మకాన్ని పెట్టుకున్నారో తనపై కూడా అలాంటి నమ్మకాన్ని పెట్టుకుని దీవించాలని కోరారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top