లోక్‌సభ స్థానాల్లో వైఎస్సార్‌సీపీ ప్రభంజనం

YSRCP leads AP Lok Sabha Election Results 2019 - Sakshi

సాక్షి, అమరావతి : 2019 సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్సార్‌కాంగ్రెస్‌ పార్టీ ప్రభంజనం సృష్టింస్తోంది. వైఎస్సార్‌సీపీ అధ్య‌క్షులు వైఎస్‌ జగన్‌మోహ‌న్‌రెడ్డికి ఆంధ్రప్రదేశ్‌ ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. మొత్తం 25 లోక్‌సభ స్థానాలకుగానూ వైఎస్సార్‌ సీపీకి 24 ఎంపీ సీట్లలో ఆధిక్యంలో ఉండగా, టీడీపీకి కేవలం ఒక్క సీటులో ముందంజలో ఉంది. 

2014 లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీతో కలిసి పోటీ చేసినా ఏపీలో టీడీపీకి 15 ఎంపీ సీట్లు మాత్రమే లభించడం గమనార్హం. బీజేపీకి రెండు ఎంపీ సీట్లు రావడం తెలిసిందే. గత పార్లమెంట్‌ ఎన్నికల్లో వైఎస్సార్‌ సీపీ 8 ఎంపీ సీట్లను సాధించింది. మరోవైపు అసెంబ్లీ స్థానాల్లో కూడా ఫ్యాన్‌ సునామీ సృష్టిస్తోంది.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter


Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top