జగన్‌మోహన్‌రెడ్డికి ఘన స్వాగత ఏర్పాట్లు

YSRCp Leaders Ready For Welcomes YS Jagan in Praja Sankalpa Yatra - Sakshi

3 నుంచి జిల్లాలో ప్రజా సంకల్పయాత్ర పునఃప్రారంభం

ఎమ్మెల్సీ, వైఎస్సార్‌ సీపీ ఉత్తరాంధ్ర కన్వీనర్‌ కోలగట్ల

విజయనగరం మున్సిపాలిటీ: ప్రజా సంకల్ప యాత్ర ముగించుకుని జిల్లా నుంచి విశాఖ ఎయిర్‌పోర్టుకు చేరుకున్న ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిపై హత్యాయత్నం జరి గిన విషయం తెలిసిందే. కొద్ది రోజుల పాటు పాదయాత్రకు విరామం ఇచ్చిన ఆయన పునఃప్రారంభించేందుకు 3వ తేదీన జిల్లాకు వస్తున్నారు. ఈ మేరకు వైఎస్‌ జగన్‌కు ఘన స్వాగ తం పలకాలని ఎమ్మెల్సీ, వైఎస్సార్‌ సీపీ ఉత్తరాంధ్ర జిల్లాల కన్వీనర్‌ కోలగట్ల వీరభద్రస్వామి పిలుపునిచ్చారు. గురువారం తన నివాసంలో విజయనగరం నియోజకవర్గ పార్టీ నాయకులతో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు.

జిల్లాలోని సాలూరు నియోజకవర్గం మక్కువ మండల కేంద్రం వద్ద నుంచి  ఈ నెల 3న జగన్‌ ప్రజా సంకల్పయాత్ర తిరిగి ప్రారంభం అవుతుందని తెలిపారు. ఈ మేరకు 2న హైదరాబాద్‌లో బయలుదేరి సాయంత్రానికి విశాఖకు చేరుకుంటారని, అక్కడి నుంచి రోడ్డు మార్గంలో మక్కువ వెళ్లే ప్రతిపక్ష నేతకు  విజయనగరం పట్టణ ముఖద్వారం వై జంక్షన్‌ వద్ద కలిసి పార్టీ నాయకులు, కార్యకర్తలు ఘన స్వాగతం పలకాలని సూచించారు. అలాగే విజయనగరం నియోజకవర్గం పరిధిలో ఇప్పటివరకు పూర్తి కాని బూత్‌ కమిటీల నియామకాలను త్వరితగతిన పూర్తి చేయాలని సూచించారు. సమావేశంలో పార్టీ నగర కన్వీనర్‌ ఆశపు వేణు, మండల అధ్యక్షుడు నడిపేన శ్రీనివాసరావు, సీనియర్‌ కౌన్సిలర్‌ ఎస్‌వీవీ రాజేష్, బొద్దాన అప్పారావు, కంటుభుక్త తవిటరాజు, కడియాల రామకృష్ణ, కనకల కృష్ణ, ముద్దాడ మధు తదితరులు పాల్గొన్నారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top