ప్రజాసంకల్పయాత్ర 89వ రోజు షెడ్యూల్‌

YS Jagans PrajaSankalpaYatra enters into Prakasam on 89th day - Sakshi

88వ రోజు ముగిసిన ప్రజాసంకల్పయాత్ర

నేడు 12 కి.మీ నడిచిన వైఎస్ జగన్

రేపు ప్రకాశం జిల్లాలోకి ప్రవేశించనున్న పాదయాత్ర

ఇప్పటివరకూ 1193.7 కిలోమీటర్లు నడిచిన వైఎస్ జగన్

రాజన్న తనయుడికి అడుగడుగునా జననీరాజనం

సాక్షి, నెల్లూరు: వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు, జననేత వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర శుక్రవారం ప్రకాశం జిల్లాలోకి ప్రవేశించనుంది. మరోవైపు శ్రీ పొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లాలో వైఎస్‌ జగన్‌ పాదయాత్ర విజయవంతంగా కొనసాగుతోంది. ప్రజాసంకల్పయాత్ర 89వ రోజు షెడ్యూల్‌ ఖరారు అయింది. ఈ మేరకు వైఎస్‌ఆర్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తలశిల రఘురాం పాదయాత్ర షెడ్యూల్‌ను విడుదల చేశారు. శుక్రవారం ఉదయం 8 గంటలకు తూర్పుపాలెంక్రాస్ నుంచి వైఎస్ జగన్ 89వ రోజు పాదయాత్ర ప్రారంభిస్తారు. అనంతరం ప్రకాశం జిల్లా కందుకూరు నియోజకవర్గంలోని లింగసముద్రం మండలం కొత్తపేటలోకి పాదయాత్ర ప్రవేశిస్తుంది. అక్కడ వైఎస్ జగన్ పార్టీ జెండాను ఆవిష్కరిస్తారు.  పెంట్రాల, వాకమళ్లవారిపాలెం మీదుగా పాదయాత్ర లింగ సముద్రం చేరుకుంటుంది. వైఎస్ జగన్ పార్టీ జెండాను ఆవిష్కరిస్తారు. 

అనంతరం బలిజపాలెం, రామకృష్ణాపురం మీదుగా యాత్ర కొనసాగనుంది. అక్కడ భోజనం చేసి విరామం తీసుకుంటారు. రామకృష్ణాపురం నుంచి మధ్యాహ్నం పాదయాత్ర మళ్లీ ప్రారంభించనున్న వైఎస్ జగన్ తిమ్మారెడ్డిపాలెం క్రాస్, వెంగళాపురం, అమ్మపాలెం క్రాస్ మీదుగా కొనసాగనున్న ప్రజాసంకల్పయాత్ర బంగారక్క పాలెం క్రాస్ చేరుకుంటుంది. బంగారక్క పాలెంలో వైఎస్ జగన్ 89వ రోజు పాదయాత్రను ముగిస్తారు. రాత్రికి అక్కడే బస చేస్తారు. 

88వ రోజు ముగిసిన పాదయాత్ర
ఉదయగిరి నియోజకవర్గం కొండాపూరం మండలంలోని జంగాలపల్లి శివారు నుంచి గురువారం ఉదయం ప్రారంభించిన వైఎస్ జగన్ పాదయాత్ర తూర్పుపాలెంక్రాస్ వద్ద 88వ రోజు ముగిసింది. ఆదిమూర్తిపురం, తూర్పు ఎర్రబల్లిక్రాస్, కొండాపురం చేరుకుని అక్కడ పార్టీ జెండాను ఆవిష్కరించారు. పాదయాత్ర 11:30 గంటలకు రేనమాలకు చేరుకుంది. మధ్యాహ్నం 12 గంటలకు జననేత వైఎస్ జగన్ లంచ్ విరామం తీసుకున్నారు. అనంతరం 2:45 గంటలకు మళ్లీ పాదయాత్ర కొనసాగించిన వైఎస్ జగన్ రేనమాలలో మహిళలతో ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొన్నారు. మహిళలకు అండగా నిలిచేందుకు వైఎస్ఆర్‌సీపీ ఎప్పుడూ సిద్ధంగా ఉంటుందని హామీ ఇచ్చారు. తూర్పుపాలెంక్రాస్ వద్ద 88వ రోజు పాదయాత్ర ముగిసింది. నేడు జననేత వైఎస్ జగన్ 12 కి.మీ పాదయాత్రలో భాగంగా ప్రజల సమస్యలు తెలుసుకుంటూ వారితో మమేకమయ్యారు. ప్రజాసంకల్పయాత్రలో భాగంగా జననేత వైఎస్ జగన్ ఇప్పటివరకూ 1193.7 కిలోమీటర్లు నడిచారు.

More news

16-02-2018
Feb 16, 2018, 07:22 IST
నెల్లూరు(సెంట్రల్‌) :నెల్లూరు నగర ఎమ్మెల్యే పి.అనిల్‌కుమార్, వైఎస్సార్‌ యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు పి.రూప్‌కుమార్‌ ఆధ్యర్యంలో వైఎస్సార్‌ విద్యార్థి విభాగం...
16-02-2018
Feb 16, 2018, 07:15 IST
కొండాపురం  :రిజిస్ట్రార్‌ కార్యాలయంలో డాక్యుమెంట్లు రాసుకుంటూ జీవిస్తున్న రైటర్లకు లైసెన్స్‌లు ఇప్పించాలని వింజమూరు రిజిస్ట్రార్‌ కార్యాలయం వద్ద రైటర్‌గా పని...
16-02-2018
Feb 16, 2018, 07:14 IST
కొండాపురం: ‘నా భర్త చనిపోయి రెండేళ్లు అయింది. అప్పటి నుంచి పలుమార్లు అర్టీలు పెట్టినా ఇప్పటి వరకు పింఛన్‌ ఇవ్వలేదయ్యా’...
16-02-2018
Feb 16, 2018, 07:11 IST
నెల్లూరు(సెంట్రల్‌) :‘అయ్యా నేను రూ.50 వేలు పొదుపులో రుణం తీసుకున్నాను.. ఇప్పటి వరకు ఒక్కరూపాయి కూడా మాఫీ కాలేదు’ అని...
16-02-2018
Feb 16, 2018, 07:09 IST
ఆత్మకూరురూరల్‌ : వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డితో దిగిన సెల్ఫీని గుండెల్లో దాచుకుంటామని విద్యార్థులు పేర్కొన్నారు. కొండాపురం మండలం ఆదిమూర్తిపురం వద్ద గురువారం...
16-02-2018
Feb 16, 2018, 07:05 IST
నెల్లూరు(సెంట్రల్‌): ‘అయ్యా.. మేము  గేదెలను మేపి కష్టం చేస్తుంటే అందుకు తగ్గట్టుగా పాలకు గిట్టుబాటు ధర కూడా రావడం లేదు’...
16-02-2018
Feb 16, 2018, 07:02 IST
నెల్లూరు(సెంట్రల్‌) : ‘అయ్యా.. నేను పది ఎకరాల్లో పొగాకు పండిçస్తున్నా. కింటా పొగాకు రూ. 13 వేలు పలికితేనే కాస్తో...
16-02-2018
Feb 16, 2018, 07:00 IST
నెల్లూరు(సెంట్రల్‌): ‘అన్నా.. కడప జిల్లా నుంచి ఇక్కడకు వచ్చి పది ఎకరాల పొలాన్ని కౌలుకు తీసుకుని శనగ పంట సాగు...
16-02-2018
Feb 16, 2018, 06:46 IST
నెల్లూరు(సెంట్రల్‌): ‘సార్‌.. గతంలో టెట్‌ను ఓ రోజు నిర్వహించేవారు. దీని వల్ల అందరికీ ఒకే పేపర్‌ వచ్చేది. అలాగే, సంబంధిత...
16-02-2018
Feb 16, 2018, 03:11 IST
15–02–2018, గురువారం తూర్పుపాలెం క్రాస్, శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా ‘టెట్‌’ నిర్వహణకు పకడ్బందీ ఏర్పాట్లు ఎందుకు చేయలేకపోయారు? ఈ రోజు ఉదయం ఆదిమూర్తిపురం...
16-02-2018
Feb 16, 2018, 02:40 IST
ప్రజా సంకల్ప యాత్ర నుంచిసాక్షి ప్రత్యేక ప్రతినిధి : ఎంపీల రాజీనామాల నిర్ణయంతో ప్రత్యేక హోదా ఉద్యమాన్ని మరో దశకు తీసుకువెళ్లిన...
15-02-2018
Feb 15, 2018, 19:18 IST
రేణమాల(ఉదయగిరి నియోజకవర్గం), శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు : ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకి వైఎస్‌ఆర్‌ సీపీ అధ్యక్షుడు వైఎస్‌...
15-02-2018
Feb 15, 2018, 18:03 IST
రేణమాల (ఉదయగిరి నియోజకవర్గం), శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు : అక్రమంగా ఇసుకను దోచుకుంటూ, అడ్డుకున్న మహిళా ఎ‍మ్మార్వోను జుట్టుపట్టి ఈడ్చిన...
15-02-2018
Feb 15, 2018, 07:25 IST
జనహితుని వెంట పల్లెలుకదం తొక్కుతున్నాయి. తమ సంక్షేమం కోరి, కష్టాలను స్వయంగా తెలుసుకోవడానికి వచ్చిన జననేత జగన్‌మోహన్‌ రెడ్డికి పల్లె...
15-02-2018
Feb 15, 2018, 07:21 IST
వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు, ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చేపట్టిన ప్రజా సంకల్పయాత్ర బుధవారం ఉదయగిరి నియోజకవర్గంలోని...
15-02-2018
Feb 15, 2018, 07:16 IST
నెల్లూరు(సెంట్రల్‌) : ‘అన్నా.. మేము శనగపంట పొలంలో రోజు వారి పనికి వెళుతున్నాం.. మాకు రోజుకు రూ.150 కూలి ఇస్తున్నారు.....
15-02-2018
Feb 15, 2018, 07:13 IST
కొండాపురం: టీడీపీ ప్రభుత్వంలో దివ్యాంగులకు న్యాయం జరగడం లేదని, మీరైనా న్యాయం చేయాలని కొండాపురం మండలంలోని కోవివారిపల్లెకు చెందిన వి.బ్రహ్మయ్య...
15-02-2018
Feb 15, 2018, 07:10 IST
నెల్లూరు(సెంట్రల్‌): ప్రైవేట్‌ స్కూళ్లు మూసివేసే పరిస్థితి ఉందని, వాటిని ఏ విధంగా అయినా ఆదుకునే విధంగా చూడాలని ఏపీ ప్రైవేట్‌...
15-02-2018
Feb 15, 2018, 07:07 IST
నెల్లూరు(సెంట్రల్‌) :‘అయ్యా.. నాకు వయసు పైబడింది. ప్రజల కోసం పరితపిస్తున్న నిన్ను నా ఊపిరి ఉన్నప్పుడే సీఎంగా చూడాలని కోరికగా...
15-02-2018
Feb 15, 2018, 07:00 IST
ఉదయగిరి: సీపీఎస్‌ విధానాన్ని రద్దు చేయించాలని యూటీఎఫ్‌ నాయకులు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని కోరారు. కలిగిరి మండలం జంగాలపల్లి సమీపంలో బుధవారం...
Back to Top