నారాయణరెడ్డిని పరామర్శించిన వైఎస్‌ జగన్‌

నారాయణరెడ్డిని పరామర్శించిన వైఎస్‌ జగన్‌


హైదరాబాద్‌: సికింద్రాబాద్‌ యశోద ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న అనంతపురం జిల్లాకు చెందిన మాజీ ఎమ్మెల్యే బి.నారాయణరెడ్డిని ఏపీ ప్రతిపక్ష నేత, వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి గురువారం పరామర్శించారు. అనారోగ్యంతో బాధపడుతూ ఆయన ఈ నెల 13న ఆస్పత్రిలో చేరారు.ఈ నేపథ్యంలో గురువారం ఉదయం ఎంపీ మిథున్‌రెడ్డి, ఎమ్మెల్యే విశ్వేశ్వర రెడ్డి, రాజకీయ సలహా దారులు సజ్జల రామకృష్ణారెడ్డి తదితరు లతో కలిసి వైఎస్‌ జగన్‌ ఆస్పత్రికి వచ్చారు. ఈ సందర్భంగా నారాయణరెడ్డిని పరామర్శించి కుటుంబ సభ్యులతో మాట్లాడారు. త్వరలోనే పూర్తి ఆరోగ్యంతో నారాయణరెడ్డి బయటకు వస్తారని జగన్‌ ఆశాభావం వ్యక్తం చేశారు. అనంతరం అక్కడే ఉన్న వైద్యులతో ఆయన ఆరోగ్య పరిస్థితి గురించి అడిగి తెలుసుకున్నారు.

Back to Top