సిక్కోలులో జనజాతర

YS Jagan Speech At Srikakulam Public Meeting: Praja Sankalpa Yatra - Sakshi

జనవర్షంలో తడిసిముద్దయిన శ్రీకాకుళం

ఘన స్వాగతం పలికిన పార్టీ శ్రేణులు

టీడీపీ నేతల అవినీతిపై ధ్వజమెత్తిన జగన్‌  

సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం: సిక్కోలు జనజాతరైంది. జిల్లా కేంద్రమైన శ్రీకాకుళంలోని ఏడు రోడ్ల జంక్షన్‌ కిక్కిరిసింది.  ప్రజాసంకల్పయాత్రలో భాగంగా రాష్ట్ర ప్రధాన ప్రతిపక్ష నేత, వైఎ స్సార్‌సీపీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి శని వారం సాయంత్రం నిర్వహించిన బహిరంగ సభ విజయవంతమైంది. పాదయాత్రలో భాగంగా శనివారం మధ్యాహ్నం గుజరాతీపేట నాగావళి బ్రిడ్జి మీదుగా నగరంలోకి అడుగుపెట్టిన జగన్‌కు జనం బ్రహ్మరథం పట్టారు. వేలాది మందితో నాగా వళి బ్రిడ్జి అంతా నిండిపోవడం ప్రత్యేక ఆకర్షణగా కనిపించింది. 

శనివారం ఉదయం ఎచ్చెర్ల నియోజకవర్గంలో జగన్‌ తన పాదయాత్రను కొనసాగిస్తూ మధ్యాహ్నం 3 గంటలకు శ్రీకాకుళం నియోజకవర్గంలో అడుగుపెట్టారు. ఏడురోడ్ల కూ డలి సమీపంలో బహిరంగ సభ ద్వారా ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. ఆద్యంతం ఆకట్టుకునేలా, అందరినీ ఆలోచింపజేసేలా సాగిన జగన్‌ ప్రసంగం జన హృదయాలను గెలు చుకుంది. జిల్లా కేంద్రంలో జరిగిన ఈ సభలో వేలాది మంది నగర పరిధిలోని ప్రాంతాల నుంచే కాకుండా గార, శ్రీకాకు ళం మండలాల నుంచి కూడా భారీ సంఖ్యలో తరలిరావడంతో ఏడు రోడ్ల కూడలి నుంచి బరాటం వీధి కూడలి వరకు పూర్తిగా కిక్కిరిసిపోయింది. 

అలాగే ఇటు చిన్న బజార్‌ రో డ్డు.. అటు టౌన్‌హాల్‌ రోడ్డు కూడా జనంతో నిండిపోయా యి. బహిరంగ సభకు రాలేనివారు టీవీలో లైవ్‌ చూడటానికి ఆసక్తి చూపించారు. కానీ అలా చూసేందుకు కూడా వీలు లేకుండా ప్రత్యర్థి పార్టీ నాయకులు నగరంలో ఆ సమయంలో విద్యుత్‌ సరఫరాను నిలిపివేసేలా కుతంత్రాలకు పాల్ప డ్డారు. అయితే సభలో ఎలాంటి విద్యుత్‌ షాక్‌ వంటి ఘటనలు లేకుండా చేసేందుకే విద్యుత్‌ సరఫరాను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు విద్యుత్‌ శాఖాధికారులు చెబుతున్నారు. 

జగన్‌ అనే నేను
రాష్ట్రంలో ‘నారా’సుర పాలనను అంతమొందించాల్సిన స మయం ఆసన్నమైందని అంటూనే స్థానిక టీడీపీ నేతల అవినీతిపై వైఎస్‌ జగన్‌ ధ్వజమెత్తారు. ఏడురోడ్ల కూడలి సమీపంలో నిర్వహించిన బహిరంగ సభలో జిల్లా కేంద్రంతో పాటు స్థానిక నియోజకవర్గ సమస్యలను ప్రస్తావించారు. జిల్లాలో 2004, 2009 ఎన్నికల్లో మహానేత వైఎస్‌ రాజశేఖరరెడ్డికి అధికారం రావడంతో జిల్లాను వంశధార ప్రాజెక్టుతో సస్యశ్యామలం చేశారని, అలాగే విశ్వవిద్యాలయం, రిమ్స్‌ కళాశాలను కూడా మంజూరు చేసి వెనుకబడిన జిల్లాను ముందుకు నడిపించారని గుర్తుచేశారు. టీడీపీ నాయకులు ఇసుక నుంచి ఇళ్ల వరకు ప్రతి విషయంలోనూ కమీషన్లు దండుకుంటున్న వైనాన్ని ఎండగట్టడంపై జనంలో హర్షం వ్యక్తమైంది.

 నగరంలోని హుద్‌హుద్‌ ఇళ్ల కేటాయింపులో అర్హుల జాబితాను స్థానిక అధికార పార్టీ నేతలు రెండేళ్లయినా ప్రకటించలేకపోయారని చెప్పడంపై స్పందన  కనిపించింది. అలాగే స్థానిక నియోజకవర్గంలో పాత్రునివలస వద్ద ప్రభుత్వం ఇచ్చే అపార్ట్‌మెంట్లను అందరూ తీసుకోవాలని చెబు తూ ‘జగన్‌ అనే నేను..హామీ ఇస్తున్నా’ అంటూ ఇంటి బ్యాం కు బకాయిలన్నీ మాఫీ చేస్తానని ప్రకటించడంపై ఒక్కసారిగా హర్షం వ్యక్తమైంది. ఏటా ఉద్యోగాలు ప్రకటించేలా క్యాలెండర్‌ను ఏర్పాటు చేస్తామని ప్రకటించడంపై నిరుద్యోగుల్లో ఆనందం వ్యక్తమైంది. చంద్రబాబు ఎప్పుడైనా మాట నిలబెట్టుకున్నారా అని జగన్‌ ప్రజలను ప్రశ్నించడంతో...‘‘ లేదు..లేదు..’ అంటూ సమాధానం చెప్పారు.   

పాదయాత్ర సాగిందిలా
శనివారం ఉదయం స్థానిక ఎచ్చెర్ల నియోజకవర్గం కొయ్యిరాళ్ల కూడలికి సమీపం నుంచి పాదయాత్ర ప్రారంభమైంది. పలువురి సమస్యలను జగన్‌ తెలుసుకుంటూ నవభారత్‌ కూడలి, కుశాలపురం మీదుగా శ్రీకాకుళం నియోజకవర్గంలో అడుగుపెట్టారు. అనంతరం నాగావళి బ్రిడ్జి మీదుగా ఏడురోడ్ల కూడలి వరకు యాత్ర కొనసాగింది. అక్కడే బహిరంగ సభను నిర్వహించారు. అనంతరం మళ్లీ పాదయాత్రగా ఆదివారంపేటకు చేరుకుని అక్కడే రాత్రి బస చేశారు. 

పాల్గొన్న ప్రముఖులు
పాదయాత్రతో పాటు బహిరంగసభలో పలు వురు నేతలు పాల్గొని మద్దతు ప్రకటించారు. శ్రీకాకుశం, విజయనగరం రీజనల్‌ కో ఆర్డినేటర్‌ భూమన కరుణాకరరెడ్డి, మాజీ ఎంపిలు మిధున్‌రెడ్డి, అవినాష్‌రెడ్డి, రీజనల్‌ కోఆర్డినేటర్‌ ధర్మాన ప్రసాదరావు, పీఏసీ సభ్యుడు ధర్మాన కృష్ణదాస్, రాష్ట్ర పార్టీ ప్రధాన కార్యదర్శి రెడ్డి శాంతి, విజయనగరం జిల్లా రాజకీయ వ్యవహారాల కన్వీనర్‌ మజ్జి శ్రీనివాసరావు, శ్రీకా కుళం, విజయనగరం పార్లమెంట్‌ జిల్లాల అధ్యక్షులు తమ్మినేని సీతారాం, బెల్లాన చంద్రశేఖర్, శ్రీకాకుళం పార్లమెంట్‌ నియోజకవర్గ సమన్వయకర్త దువ్వా డ శ్రీనివాస్, సీఈసీ సభ్యుడు అంధవరపు సూరిబాబు, ఎచ్చెర్ల, పలాస, టెక్కలి, ఇఛ్చాపురం నియోజకవర్గాల సమన్వయకర్తలు గొర్లె కిరణ్‌కుమార్, సీదిరి అప్పలరాజు, పేరాడ తిలక్, పిరియా సాయిరాజ్, రాష్ట్ర కార్యదర్శి నర్తు రామారావు, పార్టీ ముఖ్య నేతలు ఎంవీ పద్మావతి, హనుమంతు కిరణ్, కోణార్క్‌ శ్రీను, ఎం.వి.స్వరూప్, మామిడి శ్రీకాంత్, ఎన్ని ధనంజయ తదితరులు పాల్గొన్నారు.    

ఉత్తేజ పర్చిన వంగపండు పాటలు
శ్రీకాకుళం పాతబస్టాండ్‌: ప్రజా సంకల్ప యాత్ర సభ ప్రాంగణంలోనూ, ఆయన పాదయాత్రలో జనంతో కలిసి వంగపం డు ఉషారాణి పాడిన పాటలు ఉత్తేజపరిచాయి. ఆ పాటల్లో వైఎస్‌ రాజశేఖర రెడ్డి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కి చేసిన సేవలు, శ్రీకాకుళంలో జిల్లాలో పనులను వివరించారు.

ఎన్నాళ్లీ వెనుకబాటు తనం..
వైఎస్సార్‌ సీపీ రీజనల్‌ కో ఆర్డినేటర్‌ ధర్మాన ప్రసాదరావు  
శ్రీకాకుళం: శ్రీకాకుళం జిల్లా ప్రజలు ఎన్నాళ్లు వెనుకబాటుతనం అనుభవించాలని వైఎస్సార్‌ సీపీ రీజనల్‌ కో ఆర్డినేటర్‌ ధర్మానప్రసాదరావు ప్రశ్నించారు. వైఎస్సార్‌ సీపీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత చేపట్టిన ప్రజాసంకల్పయాత్రలో భాగంగా నగరంలోని జీటీ రోడ్డులో ఏర్పాటుచేసిన బహిరంగ సభలో ధర్మాన ప్రసంగించారు. స్వాతంత్య్రం వచ్చి 70 ఏళ్లు గడిచినా జిల్లా ప్రజలకు వెనుకబాటుతనం తప్పలేదన్నారు. 2013లో చేపట్టిన సెన్సస్‌లో శ్రీకాకుళం వెనుకబాటుతనం గురించి నివేదించి జిల్లా అభివృద్ధికి ప్రత్యేక ని ధులు ఇవ్వాలని చెప్పినా జిల్లా నిర్లక్ష్యానికి గురైందన్నారు. చంద్రబాబు చెప్పిన రింగు రోడ్డు, భూగర్భ డ్రైనేజీ జాడే లేదని గత ప్రభుత్వాల హయాంలో మంజూరైన ఏసీ ఆడిటోరియం, టీటీడీ నిధులతో నిర్మించాలనుకున్న కల్యాణ మండపం నిర్మాణాలు కూడా జరగలేదన్నారు. 

రూ.20 కో ట్లతో స్టేడియం నిర్మాణాన్ని పూర్తి చేయవచ్చని అది చేయకపోగా ఉన్న కళాశాల మైదానం కూడా ఒక్క రోజు స్వాతం త్య్ర వేడుకల కోసం ఆటలకు పనికిరాకుండా చేశారని చెప్పారు. శ్రీకాకుళం నియోజకవర్గంతో పాటు, జిల్లా అభివృద్ధి జరిగిదంటే అది వైఎస్‌ రాజశేఖరరెడ్డి హయాంలోనేనని తెలిపారు. జిల్లా ప్రజలు తిరిగి తమ జీవన ప్రమాణాలను పెంచుకోవాలంటే జగన్‌మోహన్‌రెడ్డిని గెలిపించుకోవాల్సిన అవసరం ఉందని చెప్పారు. జగన్‌ను గెలిపించుకొని జిల్లా ప్రజలు అమ్ముడుపోయేవారం కామని నిరూపించుకోవాలన్నారు. ఈ దఫా ఎన్నికల్లో డబ్బుతోనే ఓట ర్లను కొనుగోలు చేయాలన్న ఆలోచనలో టీడీపీ నాయకులు ఉన్నారని అన్నారు. చేయిగలిగిందే చెప్పే నైజం ఉన్న జగన్‌కు ప్రతి ఒక్కరూ మద్దతు తెలపాలని కోరారు.   

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top