‘జన’ పాతం

YS Jagan Speech At Praja Sankalpa Yatra In Chodavaram  Visakhapatnam  - Sakshi

చోడవరం జన ప్రవాహం

పాదయాత్రదారులూ అంతే...

జననేతను చూసేందుకు పోటీపడ్డ ప్రజలు

 జగన్‌ ప్రసంగానికి అడుగడుగునా అనూహ్య స్పందన

సాక్షి, విశాఖపట్నం: చోడవరం...జనసంద్రమైంది. జగన్‌ నినాదంతో హోరెత్తిపోయింది. జననేతను చూసేందుకు జనం మేడలెక్కారు.. మిద్దెలెక్కారు.. చెట్లెక్కారు...జననేతను ఒక్కసారైనా చూడాలన్న తపనతో పున్నమి కడలి కెరటంలా ఎగసి పడ్డారు. బహిరంగ సభ జరిగిన కొత్తూరు జంక్షన్‌ నలుచెరుగులా జనమే జనం. ఇక పాదయాత్ర సాగే దారులైతే జనప్రవాహాలను తలపించాయి. మహానేత రాజన్న బిడ్డ రాకతో చోడవరంలో జనసంబరం మిన్నంటింది. జననేత వస్తుంటే జనానికి పండుగలా మారింది. ప్రజాసంకల్పయాత్రలో భాగంగా శనివారం సాయంత్రం చోడవరంలో జరిగిన బహిరంగ సభకు ఇసుకేస్తే రాలనంత జనం పోటెత్తింది. శారదానది ఉప్పొంగిందా అన్నట్టుగా చోడవరంలో ఎటు చూసినా జనంతో కిక్కిరిసిపోయింది.

 కొత్తూరు జంక్షన్‌కు నలువైపులా ఉన్న పీఎస్‌పేట, గోవాడ, గౌరవరం, చోడవరం పాతబస్టాండ్‌ వరకు జనకెరటం ఎగసిపడింది. చోడవరం చరిత్రలో ముందెన్నడు లేని రీతిలో ఉప్పెనలా జనం పోటెత్తింది.  కొత్తూరు జంక్షన్‌ నుంచి గోవాడ వరకు రోడ్డుపైనే వేలాది జనం నిల్చుండిపోయారు. జననేత ప్రసంగిస్తున్నంత సేపు సీఎం.. సీఎం..సీఎం అంటూ నినాదాలతో హోరెత్తించారు. 53 నిముషాల పాటు సాగిన ప్రసంగంలో స్థానిక ఎమ్మెల్యే సాగిస్తున్న అవినీతి, అక్రమాలను లక్ష్యంగా చేసుకుని జననేత సంధిం చిన మాటలు తూటాల్లా దూసుకుపోయాయి.  చోడవరం షుగర్స్‌తో సహా నీరుచెట్టులో జరిగిన అవినీతి, ఇసుక దోపిడీపై ఊరు పేర్లు..గణాంకాలతో సహా తనప్రసంగంలో ప్రస్తావించినప్పుడు జనం నుంచి అనూహ్యస్పం దన వచ్చింది. ఆత్మహత్య చేసుకుంటామని బెది రిస్తే కానీ పింఛన్లు ఇవ్వడం లేదని, చివరకు కోర్టుకెళ్తే కానీ పింఛన్లు మంజూరు కాని దుస్థితి రాష్ట్రం లో మరెక్కడా లేని విధంగా ఈ నియోజక వర్గంలో నెలకొందంటూ నిప్పులు చెరిగారు. 

ఇక బినామీల మాటున గ్రానైట్‌ తవ్వకాలతో పాటు నియోజకవర్గంలో ఎక్కడెక్కడ ఎన్ని వందల ఎకరాలు నకిలీ డాక్యుమెంట్లు, రిజిస్ట్రేషన్లు, పేర్లు మార్చికాజేశారో వివరిస్తుంటే ప్రజలు ఔను.. ఔను.. అంటూ నినాదాలు చేశారు. చంద్రబాబు బినామీలైన నారాయణ, శ్రీచైతన్య విద్యాసంస్థల కోసం ప్రభుత్వ పాఠశాలలను నిర్వీర్యం చేస్తున్న తీరుపై విమర్శల వర్షం కురిపించారు. రేషనలైజేషన్‌ పేరుతో పాఠశాలలను మూసివేయడమే కాదు. కడుపు నింపే మధ్యాహ్న భోజన పథకాన్ని నిర్వీర్యం చేయడం ద్వారా పాఠశాలలకు వచ్చే చిన్నారులను విద్యకు దూరం చేస్తున్నారంటూ ధ్వజమెత్తారు. 20వేల టీచర్‌ పోస్టులను భర్తీ చేయకుండా టెట్‌–1, 2, 3 అంటూ నిరుద్యోగుల జీవితాలతో చెలగాటమాడుతున్నారంటూ విమర్శించినప్పుడు నిరుద్యోగ యువత నుంచి పెద్ద ఎత్తున స్పందన లభించింది.

పాదయాత్ర దారుల్లో జనపరవళ్లు
చుట్టూ ఎత్తైన కొండలు...శారదానది సోయగాలు...దారిపొడవునా వందల ఏళ్ల నాటి మర్రి మానులు... ఇరువైపులా తీపిపంచే చెరుకుగెడలు..మబ్బుల మాటున సూరీడు దోబుచులాటలు.. మధ్య ఒంపు సొంపుల దారుల్లో శనివారం జనప్రవాహం పరవళ్లు తొక్కింది. జగన్‌మోహన్‌రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర చోడవరం నియోజకవర్గంలో గంధవరం వద్ద అడుగుపెట్టింది. వూడేరు క్రాస్‌ శివారు నుంచి ప్రారంభమైన పాదయాత్ర మామిడిపాలెం మీదుగా గంధవరం వద్ద చోడవరం నియోజకవర్గంలో అడుగుపెట్టింది.

 చోడవరం కో ఆర్డినేటర్, మాజీ ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ ఆధ్వర్యంలో అశ్వదళం ముందు నడవగా.. కోలాటాలు, మేళతాళాలు..విచిత్ర వేషధారణలు.. తీన్‌మార్‌ నృత్యాలు, బాణసంచా కాల్పుల మధ్య జననేతకు చోడవరం వాసులు ఘన స్వాగతం పలికారు. నరసాపురం, రాజపురాజుపేట, శీమనాపల్లి, భోగాపురం, జుత్తాడ, పీఎస్‌పేట, గౌరీపట్నం, లక్ష్మీపురం, దామునాపల్లి, మైచర్ల పాలెం, బెన్నవోలు, జన్నవరం, చాకపల్లి తదితర గ్రామాల నుంచి వేలాది మంది జనం పాదయాత్రలో జననేత వెంట కదంతొక్కారు. ఇక దారిపొడవునా ప్రజలు తమ కష్టాలు చెప్పుకుని కన్నీటి పర్యంతమయ్యారు. 

పాదయాత్రలో పాదయాత్ర ప్రోగ్రామ్స్‌ కో–ఆ ర్డినేటర్‌ తలశిల రఘురామ్, మాజీమంత్రులు బలి రెడ్డి సత్యారావు, రైతు విభాగం రాష్ట్ర అధ్యక్షుడు ఎం.వి.ఎస్‌.నాగిరెడ్డి,  వైఎస్సార్‌సీపీ అనకాపల్లి పార్లమెంట్‌ జిల్లా అధ్యక్షుడు గుడివాడ అమర్‌నాథ్, అనకాపల్లి పార్లమెంట్‌ సమన్వయకర్త వరుదు కల్యాణి, విశాఖ పార్లమెంట్‌ జిల్లా అధ్యక్షుడు ఎంవీవీ సత్యనారాయణ, అరకు పార్లమెంట్‌ జిల్లా అధ్యక్షుడు పరీక్షిత్‌ రాజు, ఎమ్మెల్యే పుష్పశ్రీవాణి,  మాజీ ఎమ్మెల్యేలు  రౌతు సూర్యప్రకాశరావు, గూనూరు మిలట్రీ నాయుడు, మాజీ ఎమ్మెల్సీ డి.వి.సూర్యనారాయణరాజు, సమన్వయకర్తలు కరణం ధర్మశ్రీ, అన్నంరెడ్డి అదీప్‌రాజు, కొట్టగుళ్ల భాగ్యలక్ష్మి, శెట్టి ఫాల్గుణ, కోలా గురువులు, తిప్పల నాగిరెడ్డి, బొబ్బిలి సమన్వయకర్త శబంగి చిన అప్పలనాయుడు, విజయనగరం జిల్లా రాజకీయ వ్యవహారాల సమన్వయకర్త మజ్జి శ్రీనివాసరావు, రాష్ట్ర అ«ధికార ప్రతినిధి కొయ్య ప్రసాదరెడ్డి, సీఈసీ సభ్యుడు కాకర్లపూడి శ్రీకాంత్‌ రాజు, రాష్ట్ర కార్యదర్శులు దంతులూరి దిలీప్‌రా జు, జాన్‌ వెస్లీ, ప్రగడ నాగేశ్వరరావు, తాడి విజయభాస్కరరెడ్డి, బొడ్డేడ ప్రసాద్,  జర్సింగ్‌ సూర్యనారాయణ, మాజీ ఎమ్మెల్యే దేముడు కుమార్తె గొడ్డేటి మాధవి, ప్రముఖ ఆడిటర్‌ జి.వెంకటేశ్వరరావు, రైతు విభాగం కృష్ణా జిల్లా కార్యదర్శి సుభాష్‌ చంద్రబోస్, ఉత్తరాంధ్ర కార్యదర్శి త్రినా«థరెడ్డి, రాష్ట్ర యువజన విభాగం అధికార ప్రతినిధి తుళ్లి చంద్రశేఖర్‌ యాదవ్, రాష్ట్ర యూత్‌ విభాగం కార్యదర్శి గుడ్ల పోలిరెడ్డి, విశాఖ పార్లమెంట్‌ ఎస్సీ సెల్‌ అధ్యక్షుడు రెయ్యి వెంకటరమణ, అరకు పార్లమెంట్‌ జిల్లా విద్యార్థి విభాగం అధ్యక్షుడు తడబారిక సురేష్, జిల్లా అధికార ప్రతినిధులు మళ్ల బుల్లిబాబు, ఈగలపాటి యువశ్రీ, జిల్లా నాయకులు గొర్లె సూరిబాబు, చోడవరం నుంచి ధర్మతేజ, ఇచ్ఛాపురం నుంచి అందాల విక్రమ్, సాంస్కృతిక విభాగం అధ్యక్షురాలు వంగపండు ఉష, పాడేరు నుంచి అడపా బొంజునాయుడు, చొక్కాకుల వెంకటరావు, లాలం బాబ్జీ, అల్లంగి ప్రసాద్, బొంజు పడాల్, అల్లం రామ అప్పారావు, బొట్టా రమాదేవి, శరగడం నాగేశ్వరరావు, సూరిశెట్టి గోవింద్, రాజేష్‌నాయుడు, బొడ్డు శ్రీరామమూర్తి, బింగి కిరణ్‌రెడ్డి, వడ్డాది అప్పలరాజు, గండి నాయుడు, కొటాన రాము, సబ్బవరపు నారాయణమూర్తి,  బలిరెడ్డి సత్యవతి, పల్లా నరసింగరావు, మొల్లి తాతబాబు, వజ్రపు సూర్యనారాయణ, వైఎస్సార్‌ కడప నుంచి వీరప్రతాప్‌రెడ్డి,  శ్రీకాకుళం జిల్లా నుంచి కిల్లి సత్యనారాయణ, సువ్వారి గాంధి, ఎం.రామునాయుడు, పైడి విజయరామారావు తదితరులు పాల్గొన్నారు. 

మరిన్ని వార్తలు

20-09-2018
Sep 20, 2018, 04:11 IST
ప్రజా సంకల్ప యాత్ర నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి: ‘అన్నా.. లక్షలాది ఉద్యోగాలు ఇచ్చామని చంద్రబాబు, ఆయన కుమారుడు మంత్రి...
20-09-2018
Sep 20, 2018, 02:57 IST
19–09–2018, బుధవారం  పప్పలవానిపాలెం క్రాస్, విశాఖ జిల్లా   యువత బలిదానాలకు బాధ్యత మీది కాదా బాబూ? ఉదయం బస చేసిన ప్రాంతానికి దగ్గర్లోనే...
19-09-2018
Sep 19, 2018, 09:11 IST
సాక్షి, విశాఖపట్నం: వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీలోకి పెద్ద ఎత్తున నాయకుల చేరికలు కొనసాగుతున్నాయి. తాజాగా ప్రజాసంకల్పయాత్రలో ఉన్న పార్టీ అధ్యక్షుడు...
19-09-2018
Sep 19, 2018, 08:33 IST
నా పేరు కేవీఎన్‌ కార్తిక్‌. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం. వ్యక్తిత్వ వికాస నిపుణుడిగా హైదరాబాద్‌లో ఉంటున్నాను. దివంగత వైఎస్సార్‌...
19-09-2018
Sep 19, 2018, 08:28 IST
ప్రజాసంకల్పయాత్ర నుంచి.. వైఎస్సార్‌ సీపీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చేస్తున్న ప్రజా సంకల్పయాత్రకు వస్తున్న ప్రజాధరణ చూసి చంద్రబాబు సర్కారుకు దడ...
19-09-2018
Sep 19, 2018, 08:24 IST
సాక్షి, విశాఖపట్నం : ఆనందపురం ఆనంద పారవశ్యమైంది. ఆత్మీయత పంచింది. అభిమాన జల్లు కురిపించింది. కారుచీకటిలో కాంతిపుంజంలా దూసుకొస్తున్న సంకల్ప...
19-09-2018
Sep 19, 2018, 08:19 IST
‘బాబూ నాన్న పేరు నిలబెట్టాలి. ప్రజలంతా నీపై ఎంతో నమ్మకం పెట్టుకున్నారు. రాముడిలాంటి పాలన అందించు’ అని ప్రజా సంకల్ప...
19-09-2018
Sep 19, 2018, 03:44 IST
ప్రజా సంకల్ప యాత్ర నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి: ‘అధికారంలోకి రాగానే బెల్ట్‌ షాపులన్నీ రద్దు చేస్తానని ఎన్నికలప్పుడు చంద్రబాబు...
19-09-2018
Sep 19, 2018, 03:28 IST
18–09–2018, మంగళవారం  ముచ్చెర్ల క్రాస్, విశాఖపట్నం జిల్లా బాబు పాలనలో విద్యా వ్యాపారులకు ఎర్ర తివాచి  మంచి చేసినవారు కలకాలం గుండెల్లో నిలిచిపోతారంటారు. ఈరోజు...
18-09-2018
Sep 18, 2018, 20:35 IST
సాక్షి, విశాఖపట్నం: వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు, ఏపీ ప్రతిపక్షనేత వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర 266వ రోజు షెడ్యూల్‌...
18-09-2018
Sep 18, 2018, 14:38 IST
సినీ న‌టుడు ఫిష్‌ వెంక‌ట్.. వైఎస్ జ‌గ‌న్‌ను క‌లిసి సంఘీభావం తెలిపారు.
18-09-2018
Sep 18, 2018, 09:23 IST
సాక్షి, విశాఖపట్నం : వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు, ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర...
18-09-2018
Sep 18, 2018, 07:21 IST
సాక్షి, విశాఖపట్నం : రాష్ట్ర ప్రతిపక్ష నాయకుడు, వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర మంగళవారం కూడా భీమిలి...
18-09-2018
Sep 18, 2018, 07:12 IST
సాక్షి, విశాఖపట్నం : రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన విశాఖ భూకుంభకోణానికి కేంద్రం భీమిలి నియోజకవర్గం. ఇక్కడ ప్రభుత్వ, ఎసైన్డ్,...
18-09-2018
Sep 18, 2018, 07:08 IST
సాక్షి, విశాఖపట్నం: జన క్షేమమే తన క్షేమమంటూ జననేత వేస్తోన్న ప్రతి అడుగూ కష్టాల కడలిని ఎదురీదుతున్న ప్రజల్లో ఆత్మవిశ్వాసాన్ని...
18-09-2018
Sep 18, 2018, 06:59 IST
విశాఖపట్నం :విశాఖ స్టీల్‌ప్లాంట్‌ ను విస్తరించినా ఎన్‌ఎండీసీ తగి నంత ఐరన్‌ ఓర్‌ను సరఫరా చేయడం లేదు. దీంతో సామర్థ్యం...
18-09-2018
Sep 18, 2018, 06:54 IST
ప్రజా సంకల్పయాత్ర బృందం: విశాఖలో ఏర్పాటు చేయాల్సిన సిడాక్, బయో టెక్నాలజీ ఇంక్యుబేషన్‌ సెంటర్, ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ప్లాంటేషన్,...
18-09-2018
Sep 18, 2018, 04:47 IST
హుద్‌హుద్‌ వచ్చినప్పుడు సముద్ర అలలు మనవైపు రాలేదు. వర్షం, విపరీతమైన గాలులు వచ్చాయి.కానీ చంద్రబాబు హుద్‌హుద్‌నూ వదిలిపెట్టలేదు. ఈ తుపాన్‌ను...
18-09-2018
Sep 18, 2018, 04:18 IST
17–09–2018, సోమవారం  ఆనందపురం, విశాఖ జిల్లా   బరితెగించిన నేతలను నియంత్రించకపోతే..ఆటవిక పాలన కాక ఇంకేముంటుంది?! విశ్వబ్రాహ్మణుల ఆరాధ్య దైవం, దైవశిల్పి భగవాన్‌ విశ్వకర్మ...
17-09-2018
Sep 17, 2018, 20:57 IST
సాక్షి, విశాఖపట్నం: వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు, ఏపీ ప్రతిపక్షనేత వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర 265వ రోజు...
Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top