ఎవరూ ప్రాణాలు తీసుకోవద్దు: వైఎస్‌ జగన్‌

YS Jagan Shocked MadanaPalle Sudhakar Suicide For Special Status - Sakshi

సాక్షి, పెద్దాపురం : ప్రత్యేక హోదా కోసం తొందరపడి ఎవరూ ప్రాణాలు తీసుకోవద్దని, అందరం కలిసి పోరాడి సాధించుకుందామని ప్రతిపక్షనేత, వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి విజ్ఞప్తి చేశారు. చిత్తురు జిల్లా మదనపల్లిలో చేనేత కార్మికుడు సుధాకర్‌ ఆత్మహత్యపై ఆయన దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రజాసంకల్పయాత్రలో భాగంగా జననేత తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురంలో పాదయాత్ర చేస్తున్న విషయం తెలిసిందే.

సుధాకర్‌ ఆత్మహత్య విషయం గురించి తెలుసుకున్న వైఎస్‌ జగన్‌ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఇలా తొందరపడి కఠిన నిర్ణయాలు తీసుకోవద్దని, తల్లి తండ్రులకు శోకాన్ని మిగల్చవద్దని విజ్ఞప్తి చేశారు. బతికుండి పోరాడి సాధించుకుందామని పిలుపునిచ్చారు. సధాకర్‌ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. ‘ప్రత్యేక హోదా మన హక్కు’ అని సూసైడ్‌ నోట్‌ రాసి మదనపల్లి చేనేత కార్మికుడు సుధాకర్‌(26) శనివారం ఉదయం ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే.

చదవండి: హోదా కోసం మరొకరు ప్రాణత్యాగం

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top