నన్ను తీవ్రంగా కలచి వేసింది

YS Jagan shocked the boat accident in the Krishna river - Sakshi

కృష్ణా నదిలో బోటు ప్రమాదంపై వైఎస్‌ జగన్‌ దిగ్భ్రాంతి 

మృతుల కుటుంబాలకు ప్రగాఢ సంతాపం

సంకల్పయాత్ర నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి: కృష్ణా నదిలో జరిగిన ఘోర బోటు ప్రమాదంపై ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రజాసంకల్పయాత్రలో ఉన్న వైఎస్‌ జగన్‌.. దువ్వూరులో తన బస వద్ద మీడియాతో మాట్లాడుతూ.. ఈ ప్రమాదం తనను తీవ్రంగా కలచివేసిందని, ఇది చాలా బాధాకరమైన సంఘటన అని పేర్కొన్నారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం సహాయక చర్యలను వేగవంతం చేసి ప్రమాద బాధితుల కుటుంబాలను వెంటనే ఆదుకోవాలని కోరారు.

తమ పార్టీ సీనియర్‌ నేతలను ఘటనా స్థలానికి వెళ్లి సహాయక కార్యక్రమాల్లో భాగస్వాములు కావాలని ఆదేశించినట్లు తెలిపారు. వైఎస్‌ జగన్‌ సూచనల మేరకు శాసనమండలిలో ప్రతిపక్ష నేత ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, పార్టీ కృష్ణా జిల్లా ఇన్‌చార్జి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఒంగోలు ఎంపీ వైవీ సుబ్బారెడ్డి హుటాహుటిన ఘటనా స్థలికి వెళ్లారు.
 

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top