262వ రోజు ప్రారంభమైన ప్రజాసంకల్పయాత్ర

YS Jagan PrajaSankalpaYatra Started In Visakhapatnam On 262Th Day - Sakshi

సాక్షి, విశాఖపట్నం: వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర విశాఖపట్నం జిల్లాలో విజయవంతంగా కొనసాగుతోంది. శనివారం ఉదయం వైఎస్‌ జగన్‌ విశాఖ ఈస్ట్‌ నియోజకవర్గంలోని చనగదిలి క్యూ-1 ఆసుపత్రి ప్రాంతం నుంచి పాదయాత్ర ప్రారంభించారు. వైఎస్‌ జగన్‌ రాకతో పాదయాత్ర సాగుతున్న మార్గంలో పండుగ వాతావరణం నెలకొంది. అడుగడుగునా ప్రజల సమస్యలు తెలుసుకుంటూ వైఎస్‌ జగన్‌ ముందుకు సాగుతున్నారు.

చనగదిలి నుంచి రామకృష్ణా పురం, శ్రీకృష్ణ పురం, ఫైనాపిల్‌ కాలనీ, దరపాలెం వరకు వైఎస్‌ జగన్‌ పాదయాత్ర కొనసాగుతుంది. అక్కడ వైఎస్‌ జగన్‌  భోజన విరామం తీసుకుంటారు. తిరిగి మధ్యాహ్నం 2.45 గంటలకు పాదయాత్ర ప్రారంభమవుతుంది. లంచ్‌ క్యాంప్‌ నుంచి దరపాలెం, అడవివరం, లండ గరువు క్రాస్‌ మీదుగా దువ్వపాలెం వరకు జననేత పాదయాత్ర కొనసాగుతుంది. ఆయన అక్కడే రాత్రి బస చేయనున్నారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top