అవరోధాలను అధిగమించి...

YS Jagan Praja Sankalpa Yatra in Vizianagaram - Sakshi

రెట్టించిన ఉత్సాహంతో జగన్‌ ప్రజాసంకల్ప యాత్ర

హత్యాయత్నం నుంచి బయటపడిన అనంతరం

ప్రారంభమైన పాదయాత్ర

అభిమాన నాయకుడిని చూసేందుకు తరలివచ్చిన జన ప్రవాహం

జననేతను చూసి ఉద్వేగానికి లోనైన ఆడపడుచులు

పటిష్ట భద్రత నడుమ సాగిన పాదయాత్ర

నేడు పార్వతీపురం నియోజకవర్గంలోని ప్రవేశం

జనమే ఆయన బలం... ప్రభంజనమే ఆయన ఆయుధం. అందుకే ఎన్ని కుట్రలనైనా ఎదుర్కొనగలరు. మృత్యువునైనా ఎదిరించగలరు. సంకల్ప బలంతో వేల మైళ్లు నడిచారు. అభిమానుల ఆశీస్సులతో అవరోధాలను అధిగమించారు. కుతంత్రాలను ఛేదించారు... మృత్యుంజయుడై వచ్చారు. మళ్లీ పల్లె బాట పట్టారు.మనకోసం... మన బాగుకోసం... మన భవిష్యత్తుకోసం బాటలు వేసేందుకు వచ్చిన ఆ బహుదూరపు బాటసారికి అడుగడుగునా నీరాజనాలు పలికారు. గండం నుంచి బ యటపడి కాస్తంత విరామం తరువాత వచ్చిన అభిమాన నేతకు ఆప్యాయంగా ఆదరించారు...  ఆరోగ్యంపై ఆరాతీ శారు. కష్టాలు కలబోసుకున్నారు.శాలివాహనులకోసం మహానేత చేసిన మహా మేలును వివరిస్తూనే... ఓ కార్పొరేషన్‌ ఏర్పాటు చేయాలని... మార్కెటింగ్‌కోసం సౌకర్యాలు కల్పించాలని కుమ్మరి కులస్తులు కోరారు. సెకెండ్‌ ఏఎన్‌ఎంలుగా పుష్కరకాలం నుంచి పని చేస్తున్నా తమకు సరైన గుర్తింపు లేదంటూ పలువురు చిరుద్యోగులు వేదన వినిపించారు. బడికి వెళ్లాలంటే రోడ్డు సమస్య వేధిస్తోందనీ, సకాలంలో బడికి చేరలేక అవస్థలు పడుతున్నామంటూ పలువురు విద్యార్థినులు వాపోయారు.అదే చిరునవ్వు... అదే నడక... అదే అభివాదం... అందరినీ పలకరిస్తూ... అందరి గోడు వింటూ... అందరికీ భరోసా కల్పిస్తూ జననేత జగన్‌మోహన్‌రెడ్డి ముందుకు సాగారు.

సాక్షిప్రతినిధి విజయనగరం: ఆయన ఆశయం ఎం తో గొప్పది. అందుకే ఎంతటి అవరోధాలనైనా అలవోకగా అధిగమిస్తున్నారు. తనను నమ్ముకున్నవారికి అండగా నిలవాలని మృత్యుంజయుడై తిరిగి వచ్చారు. వైఎస్సార్‌సీపీ అధినేత జగన్‌మోహన్‌రెడ్డి తనపై జరిగిన హత్యాయత్నం నుంచి బయటపడి చెరగని చిరునవ్వుతో జనంముందు కు వచ్చారు. అభిమానం అండగా మళ్లీ పాదయాత్రను సోమవారం ప్రారంభించా రు. మృత్యుంజ యుడై వచ్చిన జననేతను చూసేందుకు జనప్రవాహం వెల్లువెత్తింది. కనీవినీ ఎరుగని రీతిలో ఘన స్వాగతం లభించింది. పాదయాత్ర మొదలుపెట్టినప్పటి నుంచీ తమ కష్టాలు కన్నీళ్లు జగన్‌కు చెప్పుకుంటూ వినతులు ఇచ్చే జనం ప్రాణాపాయం నుంచి బయటపడి వచ్చిన జగన్‌ను చూసి ఉద్వేగానికి లోనయ్యారు. తమ సమస్యలు పక్కనబెట్టి ఆయన యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. వారి వాత్సల్యం పాదయాత్రను ముందుకు కదలనివ్వలేదు. అందరి దీవెనలు, ప్రేమాభిమానాల వల్లే తాను ఆ గండం నుంచి గట్టెక్కానని వారికి నచ్చజెప్పి ముందుకు కదిలారు. విజయనగరం జిల్లా సాలూరు నియోజకవర్గంలోని మక్కువ మండలం పాయకపాడు రాత్రిబస నుంచి పాదయాత్ర పాపయ్యవలస మీదుగా కొయ్యానపేటకు చేరుకుని ముగిసింది.

17 రోజుల విరామం తరువాత: గత నెల 25న 294వ రోజు ప్రజా సంకల్పయాత్ర ముగించుకుని హైదరాబాద్‌ వెళ్లేందుకు బయలుదేరిన  వై.ఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డిపై విశాఖ విమానాశ్రయంలో  హత్యాయత్నం జరిగింది. వైద్యుల సూచన మేరకు  పాదయాత్రకు తాత్కాలిక విరా మం ప్రకటించగా.. 17 రోజుల తరువాత పటిష్ట భద్రత నడుమ తిరిగి సోమవారం  ప్రారంభమైం ది. పోలీసు యంత్రాంగం జారీ చేసిన గుర్తింపు కార్డులు కలిగిఉన్న వారికి మాత్రమే జగన్‌ చుట్టూ ఉండేందుకు వెసులుబాటు కల్పించారు. పాయకపాడు శివారునగల శిబిరం వద్ద పాదయాత్ర పునః ప్రారంభం సందర్భంగా క్రైస్తవ మత పెద్దలు, వేదపండితులు ఆశీర్వచనాలు అందించారు.

అన్నను చూడాలన్నదే లక్ష్యం
ఒక్కటే లక్ష్యం ఆయన్ను చూడాలి. విశాఖలో జరిగి న హత్యాయత్నం దాడి అనంతరం అన్న యోగక్షేమాలను అడిగి తెలుసుకోవాలి. బాధలు చెప్పుకోవాలని అపన్నులు... తమ అభిమాన నాయకునితో కరచాలనం చేయాలని... సెల్ఫీలు దిగాలని అక్కచెల్లెమ్మలు, యువతీ యువకులు ప్రజా సంకల్పయాత్రకు పోటెత్తారు. చంటి పిల్లలను అప్యాయంగా ముద్డాడి దీవించిన జగనన్న ప్రజల కష్టాలను తెలుసుకునేందుకు చేపడుతున్న పాదయాత్రలో పడుతున్న కష్టాన్ని చూసి అక్క చెల్లెమ్మలు కన్నీటి పర్యాంతమయ్యారు. పాయకపాడు నుం చి ప్రారంభమైన పాదయాత్ర మేళాపువలస, మ క్కువ క్రాస్, ములక్కాయవలస కాశీపట్నం వద్దకు చేరుకుంది. మధ్యాహ్న భోజనానంతరం పాపయ్యవలస మీదుగా కొయ్యానపేట వద్ద ఏర్పాటు చేసిన శిబిరానికి చేరుకుంది.

శాలివాహనులతో మమేకమై....
సోమవారం ప్రజా సంకల్పయాత్ర ప్రారంభించిన జగన్‌మోహన్‌రెడ్డి ఎప్పటిలానే ప్రజలతో మమేకమవుతూ వారి కష్టాలను తెలుసుకుని భరోసా కల్పిస్తూ ముందుకు సాగారు. మక్కువ మండల శాలివాహన సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన శిబిరాన్ని సందర్శించిన వారి ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు. కాసేపు కుమ్మరి సారె తిప్పి వారికి మానసిక స్థైర్యాన్ని కల్పించారు. ఒక దివ్యాంగుడు తన భాధలు చెప్పుకుంటూ రూ.3వేలు లంచం ఇవ్వకపోవటంతో పింఛను మంజూరు చేయలేదంటూ వాపోయారు. కాశీపట్నం క్రాస్‌ వద్ద రాజమండ్రికి చెందిన పలువురు బీసీ నేతలు జననేతను కలిసి యాత్రకు సంఘీభావం తెలిపా రు. విద్యార్ధులు, మహిళలతోపాటు రైతులు తమ బాధలను చెప్పుకున్నారు. అందరితో ఆప్యాయంగా మాట్లాడిన జననేత వారికి భరోసా కల్పిస్తూ ముందుకు సాగారు.  

పాదయాత్రలో పార్టీ నాయకులు
పాదయాత్రలో వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి భూమన కరుణాకరరెడ్డి, రాజంపేట మాజీ ఎంపీ పి.వి.మిథున్‌రెడ్డి, పార్టీ రాష్ట్ర ప్రధాన కార్య దర్శి, రాష్ట్ర ప్రొగ్రామ్స్‌ కమిటీ కోఆర్డినేటర్‌ తలశి ల రఘురాం, మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ, మాజీ ఎంపీ బొత్స ఝాన్సీలక్ష్మి,  సాలూరు, కురుపాం, రాజాం, పాలకొండ ఎమ్మెల్యేలు పీడిక రాజన్నదొర, పాముల పుష్పశ్రీవాణి, కంబాల జోగులు, విశ్వాసరాయి కళావతి, ఎమ్మెల్సీ పిల్లి సుభాష్‌ చంద్రబోస్, పార్టీ జిల్లా రాజకీయ వ్యవహారాల సమన్వయకర్త మజ్జి శ్రీనివాసరావు, విజ యనగరం, అరకు పార్లమెంటరీ జిల్లాల అధ్యక్షులు బెల్లాన చంద్రశేఖర్, శత్రుచర్ల పరీక్షిత్‌రాజు, అరుకు పార్లమెంటరీ జిల్లా కోఆర్డినేటర్‌ మాధవి, రాష్ట్ర ఐటీ విభాగం అధ్యక్షుడు చల్లా మధుసూధన్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు బొత్స అప్పలనర్సయ్య, గొల్ల బాబూరావు, ఎస్‌కోట, బొబ్బిలి, భీమిలి ని యోజకవర్గాల సమన్వయకర్తలు కడుబండి శ్రీని వాసరావు, శంబంగి వెంకట చినఅప్పలనాయు డు, అక్కరమాని విజయలక్ష్మి, డీసీఎంఎస్‌ ఛైర్మన్‌ ఎస్‌.వి.రమణరాజు, రాష్ట్ర కార్యదర్శులు పాలవలస విక్రాంత్, మాజీ ఎమ్మెల్సీ సూర్యనారాయణరాజు, పార్టీ సీజీసీ సభ్యురాలు జక్కంపూడి విజయలక్ష్మి  తదితరులు పాల్గొన్నారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top