మా రాజువు నువ్వే

YS jagan Praja Sankalpa Yatra In Visakhapatnam - Sakshi

మహానేత అడుగు జాడల్లో..

కష్టాలు వింటూ..కన్నీళ్లు తుడుస్తూ..

మాడుగులలో ప్రవేశించిన జననేత పాదయాత్ర

దారిపొడవునా అపూర్వ స్వాగతం

సాక్షి, విశాఖపట్నం: ఆ అడుగులో ఓ విశ్వాసం..ఆ స్పర్శలో ఓ నమ్మకం ..ఆ పలకరింపులో ఆత్మీయత. అందుకే అన్న వస్తున్నాడంటే పల్లెలు ఉరకలెత్తుతున్నాయి. చేతిలో అధికారం లేదని తెలుçసు.. అయినా ప్రజలకు ఆయనంటే ఓ భరోసా. తమ సమస్య సత్వర పరిష్కారానికి నోచుకోదని తెలుసు.. కానీ తమ బాధలు చెప్పుకోవాలన్న తపన. నైరాశ్యపు చీకట్లు కమ్మిన ఆ బతుకుల్లో నవ్యకాంతుల దివిటీలు వెలిగిస్తోంది ప్రజాసంకల్పయాత్ర. చితికిన బతుకుల్లో కొత్త ఆశలు చిగురింపజేస్తోంది. మా రాజువు నువ్వే అంటూ జనం ఆత్మీయంగా అక్కున చేర్చుకుంటున్నారు. నడినెత్తిన భానుడు భగభగమండుతున్నా ఉక్కుసంకల్పంతో ఉరుకుతూ.. ఊరడిస్తూ.. నవరత్నాల సాక్షిగా సాగుతోంది.

చైనావాల్‌ మాదిరి గా దడికట్టినట్టుగా రహదారికిరువైపులా నిటారు న నిల్చొని తలలూపుతున్న తాటి చెట్లు ఓ వైపు.. పుడమిపై పచ్చబొట్లు వేసినట్లు పచ్చని పైరు మరొక వైపు... తీపిని పంచే చెరుకుగెడల ఊగిసలాటలు ఇంకొక వైపు..వీటి మధ్య జననేత నడుస్తుంటే వేలాది మంది అనుసరించారు. మహానేత వైఎస్, ఆయన తనయ షర్మిల పాదయాత్ర చేసిన దారుల్లో సాగిన ప్రజా సంకల్పయాత్రకు అడుగుడుగునా ప్రజలు బ్రహ్మరథం పట్టారు. మహానేత తొమ్మిదో వర్థంతి రోజున కాలినడక వస్తోన్న జననేతను చూసి ఉద్వేగానికి లోనవుతూ చమర్చిన కళ్లతోనే ప్రజలు అపూర్వ స్వాగతం పలికారు. 252వ రోజు ఆదివారం పాదయత్ర సాగిన రహదారుల్లో  జనజాతరను తలపించింది. దారిపొడవునా జోహార్‌ వైఎస్సార్‌..జోహార్‌ వైఎస్సార్‌ అంటూ ఆ మహనీయుడ్ని స్మరించుకుంటూ జననేతకు స్వాగతం పలికారు. తొలుత రాత్రిబస చేసిన అన్నవరం శిబిరం వద్ద మహానేత తొమ్మిదో వర్థంతి సందర్భంగా ఎంపీ విజయసాయిరెడ్డి, పార్టీ నేతలతో కలిసి వైఎస్‌ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.

మండుటెండలో సైతం..
ప్రజాకంటక పాలన అంతమే లక్ష్యంగా వైఎస్సార్‌ సీపీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చేస్తోన్న ప్రజాసకంల్పయాత్ర జిల్లాలో అప్రతిహాతంగా సాగుతోంది. చోడవరం నియోజకవర్గంలో రెండోరోజు అన్నవరం శివారు నుంచి ప్రారంభమైన పాదయాత్ర కండేపల్లి క్రాస్‌ రోడ్డు, లక్కవరం, మారుతీనగర్, గవరవరం, జి.జగన్నాథపురం క్రాస్‌ రోడ్డు మీదుగా వేచలం క్రాస్‌ (చీకటితోట) వద్ద మాడుగుల నియోజకవర్గంలోకి అడుగుపెట్టింది. దేవరాపల్లి మండలంలో వేచలం క్రాస్‌రోడ్, ములకలాపల్లి మీదుగా కొత్తపెంట వరకు సాగింది. ఉదయం నుంచి సాయంత్రం వరకు భానుడు ప్రతాపం చూపినా దారిపొడవున బారులు తీరిన ప్రజలు జననేతను చూసేందుకు బాలురు తీరారు. వారి కష్టాలు వింటూ...కన్నీళ్లు తుడుస్తూ జననేత ముందుకు సాగారు. వ్యవసాయ కూలీలు జననేత రాకను గమనించి పొలంలో నుంచి రోడ్డుపైకి వచ్చి తమ కష్టాలు చెప్పుకున్నారు.

మాడుగులలో బ్రహ్మరథం
చోడవరం నియోజకవర్గంలో ముగించుకుని మాడుగుల నియోజకవర్గంలో అడుగు పెట్టిన జననేత పాదయాత్రకు దేవరాపల్లి మండల ప్రజలు అపూర్వస్వాగతం పలికారు. శాసనసభ ఉపనేత, ఎమ్మెల్యే  బూడి ముత్యాల నాయుడు ఆధ్వర్యంలో వేలాదిమంది ప్రజలు వేచలం క్రాస్‌(చీకటితోట) వద్ద ఎదురేగి స్వాగతం పలికారు. దారిపొడవునా ఫ్లెక్లీలు..స్వాగతద్వారాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.

అడుగడుగునా వినతుల వెల్లువ
బాబూ.. నాకు ముగ్గురు కొడుకులు. డిగ్రీలు చదువుకున్నారు. కొలువుల్లేక కూలీ పనికి పోతున్నారయ్యా అంటూ లక్కవరానికి చెందిన కొప్పి జగన్నాథం లక్కవరం వద్ద వైఎస్‌ జగన్‌ను కలిసి కన్నీటి పర్యంతమైంది. ఎక్కడకు వెళ్లినా లంచాలు అడుగుతున్నారని...లక్షలు పోసి ఉద్యోగాలు కొనుక్కునే స్తోమత మాకు లేదని ఆవేదన వ్యక్తం చేసింది. రాష్ట్రంలో మరెక్కడా లేని విధంగా ఇక్కడ పింఛన్లన్నీ అధికార టీడీపీ నేతలే పంచుకుంటున్నారని, అర్హులైన మాలాంటోళ్లు కోర్టుకెళ్తే కానీ పింఛన్‌ రావడం లేదన్నా అంటూ సియ్యాద్రి దుర్గాప్రాసద్‌ కండేపల్లి క్రాస్‌ వద్ద జగన్‌ను కలిసి వాపోయాడు. ఏళ్లతరబడి పనిచేస్తున్న తమను రోడ్డుపాల్జేసారని సాక్షరభారత్‌ కో ఆర్డి్డనేటర్లు, మా పొట్ట కొట్టేందుకు సిద్ధమయ్యారని మధ్యాహ్నభోజన కార్మికులు మొరపెట్టుకున్నారు.

పాదయాత్రలో జగన్‌ రాజకీయ వ్యవహారా ల కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి, తిరుపతి మాజీ ఎంపీ వి.వరప్రసాద్, పాదయాత్ర ప్రోగ్రా మ్స్‌ కో–ఆర్డినేటర్‌ తలశిల రఘురామ్, శాసనసభ పక్ష ఉపనాయకుడు బూడి ముత్యాలనాయు డు, మాజీ మంత్రి బలిరెడ్డి సత్యారావు, నెల్లూరు జిల్లా ఎమ్మెల్యేలు కాకాణి గోవర్ధనరెడ్డి, అనిల్‌కుమార్‌ యాదవ్, కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి, రామిరెడ్డి ప్రతాప్‌రెడ్డి, జిల్లా ప్రధానకార్యదర్శి జి.ఎస్‌.సుధీర్‌కుమార్‌ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే గూనూరు మిలట్రీ నాయుడు, అనకాపల్లి పార్లమెంట్‌ జిల్లా అధ్యక్షుడు గుడివాడ అమర్‌నాథ్, పార్లమెంట్‌ సమన్వయకర్త వరుదు కల్యాణి, సమన్వయకర్తలు కరణం ధర్మశ్రీ, పెట్ల ఉమాశంకర గణేష్, విజయనగరం జిల్లా రాజకీయ వ్యవహారాల సమన్వయకర్త మజ్జి శ్రీనివాసరావు, సీఈసీ సభ్యుడు కాకర్లపూడి శ్రీకాంత్, రాష్ట్ర యువజన విభాగం అధికార ప్రతినిధి తుళ్లి చంద్రశేఖర్‌యాదవ్, డీసీసీబీ మాజీ చైర్మన్‌ ఉప్పలపాటి సుకుమార్‌ వర్మ, రాష్ట్ర అధికార ప్రతినిధి తాడి విజయభాస్కరరెడ్డి, రాష్ట్ర అదనపు కార్యదర్శులు పక్కి దివాకర్, రవిరెడ్డి, జిల్లా నాయకులు మళ్ల బుల్లిబాబు, కరణం జయదేవ్, ఎస్‌. ఎస్‌.ఎన్‌.రెడ్డి, కిరణ్‌రాజు, నాగులాపల్లి రాం బాబు, పి.వెంకటేష్, శ్రీరామమూర్తి, చిర్ల నాగి రెడ్డి, ఎం.శంకరరావు, ఎం. శ్రీకాంత్, జి.ఆర్‌.హెచ్‌ ప్రసాద్, గుమ్మడు సత్యదేవ్, తలారి ఆదిమూర్తి, లేగ ఉమ, అల్లం మాధవి, ఎం.వెంకటరమణ, పి. అప్పారావు, గొల్లవిల్లి రామకృష్ణ, డాక్టర్‌ లక్ష్మీకాంత్, వి.శ్రీనివాసరావు, బూరె బాబూరావు, కర్రి సత్యం, గొల్లవిల్లి సంజీవరావు పాల్గొన్నారు.

అదే దారిలోముగ్గురు నేతలు..
2003లో వైఎస్‌ రాజశేఖరరెడ్డి ప్రజాప్రస్థానం పేరిట పాదయాత్రగా ఇదే దారిలో వచ్చారు.ఆ తర్వాత ఆయన తనయ షర్మిల మరో ప్రజాప్రస్థానం పేరిట పాదయాత్రగా వచ్చారు. ఇప్పుడు రాజన్న బిడ్డ వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి వస్తున్నాడని తెలుసుకుని ఆ పల్లెలు పరవశించిపోయాయి. పార్టీ కో ఆర్డినేటర్, మాజీ ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ ఆధ్వర్యంలో లక్కవరం, గవరవరం గ్రామాల్లో అపూర్వ స్వాగతం లభించింది. పాదయాత్ర దారుల్లో పూలు చల్లారు. ప్రజాప్రస్థానంలో మహానేత బస చేసిన ప్రాంతమైన లక్కవరం వద్ద వైఎస్‌ విగ్రహానికి మాజీ ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ పూలమాలలు వేశారు. అదేవిధంగా గవరవరం వద్ద కొత్తగా ఏర్పాటు చేసిన దివంగత వైఎస్‌ విగ్రహాన్ని పార్టీ నేతలు అమర్‌నాథ్, వరుదు కళ్యాణి, ధర్మశ్రీలతో ఆవిష్కరింపజేశారు.

మరిన్ని వార్తలు

19-11-2018
Nov 19, 2018, 07:21 IST
సాక్షి ప్రతినిధి, విజయనగరం: జనం కోసం వేసిన తొలి అడుగు వేలాది కిలోమీటర్లు దాటినా అలసిపోనంటోంది. ప్రజా క్షేత్రంలోకి వచ్చి...
19-11-2018
Nov 19, 2018, 07:17 IST
సాక్షిప్రతినిధి, విజయనగరం : వైఎస్సార్‌సీపీ అధినేత వై.ఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి చేçపట్టిన ప్రజాసంకల్పయాత్రలో భాగంగా సోమవారంనాటి పాదయాత్ర వివరాలను ఆ పార్టీ రాష్ట్ర...
19-11-2018
Nov 19, 2018, 07:15 IST
ప్రజాసంకల్పయాత్ర బృందం: ఆంధ్రప్రదేశ్‌ ప్రతిపక్ష నేత, వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని అంతానికి ముఖ్యమంత్రి చంద్రబాబు కుట్ర...
19-11-2018
Nov 19, 2018, 07:13 IST
ప్రజాసంకల్పయాత్ర బృందం: జిల్లాలో 26 మండలాల్లో  కరువు ఏర్పడటానికి టీడీపీ ప్రభుత్వం నిర్లక్ష్యమే కారణమని  వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ విజయనగరం...
19-11-2018
Nov 19, 2018, 07:11 IST
ప్రజా సంకల్పయాత్ర బృందం: ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని అంతమొందించటమే ధ్యేయంగా ముఖ్యమంత్రి చంద్రబాబు కుట్రలు పన్నుతున్నారని వైఎస్సార్‌...
19-11-2018
Nov 19, 2018, 07:09 IST
ప్రజాసంకల్పయాత్ర బృందం: తోటపల్లి సాగునీటి ప్రాజెక్టు పేరు చెప్పగానే కురుపాం నియోజకవర్గంతో పాటు విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలో రైతులు, ప్రజలకు...
19-11-2018
Nov 19, 2018, 07:08 IST
విజయనగరం , ప్రజాసంకల్పయాత్ర బృందం: మహానేత, దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌.రాజశేఖర్‌రెడ్డి ఉమ్మడి రాష్ట్రంలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేసి దేశ...
19-11-2018
Nov 19, 2018, 06:59 IST
విజయనగరం ,ప్రజాసంకల్పయాత్ర బృందం: వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీకు రాష్ట్ర వ్యాప్తంగా ప్రజాదరణ పెరుగుతుండడంతో కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీలకు చెందిన పలువురు...
19-11-2018
Nov 19, 2018, 06:58 IST
విజయనగరం: అన్నా 15 సంవత్సరాలుగా గిరిజన సంక్షేమ శాఖ ఆశ్రమ పాఠశాలల్లో కాంట్రాక్ట్‌ రెసిడెన్షియల్‌ టీచర్లుగా పని చేస్తున్నాం.  మమ్మల్ని...
19-11-2018
Nov 19, 2018, 06:56 IST
విజయనగరం, ప్రజాసంకల్పయాత్ర బృందం: అన్నా నా పేరు లింగారెడ్డి వీరప్రతాపరెడ్డి. నేను వైఎస్సార్‌ కడప జిల్లా వీఎన్‌పల్లి మండలం, బుచ్చిరెడ్డి...
19-11-2018
Nov 19, 2018, 06:54 IST
విజయనగరం: ‘అయ్యా ! మేం తోటపల్లి నిర్వాసితులం. పార్వతీపురం పక్కనే బంటువానివలసలో నివసిస్తున్నాం. కన్నతల్లి లాంటి ఊరును, భూములను వదిలేసి...
19-11-2018
Nov 19, 2018, 06:50 IST
విజయనగరం: రెల్లి కులస్థులకోసం ప్రత్యేక కార్పోరేషన్‌ను ఏర్పాటు చేయాలని పార్వతీపురానికి చెందిన రెల్లికులస్తులు జననేత జగన్‌మోహన్‌రెడ్డిని వేడుకున్నారు. తమ కులాన్ని...
19-11-2018
Nov 19, 2018, 04:32 IST
ప్రజా సంకల్ప యాత్ర నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి: సడలని సంకల్పం, ఒడిదుడుకులను లెక్క చేయని పట్టుదల, ప్రజల హృదయాల్లో...
19-11-2018
Nov 19, 2018, 03:35 IST
ఇప్పటి వరకు నడిచిన దూరం: 3,261.6 కి.మీ  18–11–2018, ఆదివారం  తోటపల్లి రిజర్వాయర్‌ ప్రాంతం,  విజయనగరం జిల్లా బాబుగారు కేవలం శిలాఫలకాలకు చిరునామాగా మిగిలిపోయారు..  నేటితో ప్రజా సంకల్ప...
18-11-2018
Nov 18, 2018, 19:26 IST
సాక్షి, విజయనగరం : వైఎస్సార్‌ సీపీ అధ్యక్షుడు, ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర 300వ రోజు...
18-11-2018
Nov 18, 2018, 13:47 IST
చలి వణికించినా.. ఎండలు మండినా.. జడివానలు జడిపించినా.. వజ్రసంకల్పంతో ముందడుగు వేస్తున్నారు వైఎస్‌ జగన్‌. ప్రతి గుండెలో తాను కొలువై...
18-11-2018
Nov 18, 2018, 12:08 IST
సాక్షి, వైఎస్సార్‌: రాష్ట్రంలో కొనసాగుతున్న అరాచక పాలనకు వ్యతిరేకంగా వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి చేపట్టిన...
18-11-2018
Nov 18, 2018, 09:24 IST
సాక్షి, పార్వతీపురం: ప్రజల సమస్యలు తెలుసుకుంటూ.. వారికి నేనున్నానని భరోసానిస్తూ.. వైఎస్సార్‌ కాంగ్రెస్‌పార్టీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర...
18-11-2018
Nov 18, 2018, 06:50 IST
గ్రామాలు దేశానికి పట్టుగొమ్మలని పాలకులు ప్రకటనలు గుప్పిస్తున్నారే తప్ప ఆచరణలో అభివృద్ధి చేయడం లేదు. చాలా గ్రామాల్లో కనీసం మౌలిక...
18-11-2018
Nov 18, 2018, 06:45 IST
గిరిజన యువత పీజీ, డిగ్రీ, డైట్, బీఎస్సీ, నర్శింగ్, తదితర కోర్సులు చేసి నిరుద్యోగులుగా ఉన్నారు. బాబు వస్తే జాబు...
Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top