చిరుజల్లులలో.. చిరునవ్వులతో

YS Jagan Praja Sankalpa Yatra in Srikakulam District - Sakshi

వర్షంలోనూ ఆగని అడుగులు

అధికార పార్టీ నేతల అవినీతిపై జగన్‌కు వివరించిన జనం

టెక్కలి నియోజకవర్గంలో జగన్‌కు ఘన స్వాగతం

 సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం: జనం సమస్యలను తెలుసుకునేందుకు ఎండైనా, వానైనా.. వెరవకుండా ముందుకు సాగి న వాడే అసలు సిసలైన నాయకుడు. అలాంటి నిజమైన ప్రజా నాయకుడ్ని చిక్కోలు ప్రజలు అతి దగ్గరగా చూశారంటే అతిశయోక్తి కాదు. ప్రజాసంకల్పయాత్ర 324వ రోజులో భాగంగా మంగళవారం రాష్ట్ర ప్రధాన ప్రతిపక్ష నేత, వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నరసన్నపేట, టెక్కలి నియోజకవర్గాల పరిధిలో పాదయాత్ర నిర్వహించారు. తుఫాన్‌ ప్రభావంతో గాలులు, చిరుజల్లుల్లోనూ చెరగని చిరునవ్వుతోనే జనాలను కలుస్తూ వారికి అభివాదాలు చేస్తూ ముందుకుసాగారు. దారిపొడవునా ప్రజల కష్టాలను తెలుసుకు ని, వారి సమస్యలను ఓపిగ్గా విన్నారు. తిత్లీ తుఫాన్‌లో పంట నష్టపోయిన నేతలను, పింఛన్‌ కోల్పోయిన బాధితులను, అలాగే ఉద్యోగాలు లే ని యువకులను జగన్‌ ఓదార్చుతూ భవిష్యత్‌పై భరోసా ఇచ్చారు. మంగళవారం యాత్రను నిర్వి రామంగా కొనసాగించి మొత్తం 8.6 కిలోమీటర్ల మేర యాత్రను సాగించారు.

టెక్కలి నియోజకవర్గంలో ఘన స్వాగతం
ప్రజాసంకల్పయాత్రలో భాగంగా మంగళవారం నరసన్నపేట నియోజకవర్గంలోని లింగాలవలస, చల్లవానిపేట మీదుగా యాత్ర సాగించి నరసన్నపేట నియోజకవర్గంలో యాత్రను దిగ్విజయంగా పూర్తి చేశారు. అనంతరం కోటబొమ్మాళి మండలం సౌదాం గ్రామంలో ప్రవేశించి టెక్కలి నియోజకవర్గంలో అడుగుపెట్టారు. దీంతో ఈ ప్రాంతంలో పెద్ద సంఖ్యలో జనం, పార్టీ కార్యకర్తలు తరలి వచ్చి జగన్‌కు ఘన స్వాగతం పలికారు. డప్పు వాయిద్యాలతో సంబరంగా కార్యక్రమాన్ని జరి పించారు. శ్రీకాకుళం పార్లమెంట్‌ నియోజకవర్గ సమన్వయకర్త దువ్వాడ శ్రీనివాస్, టెక్కలి నియోజకవర్గ సమన్వయకర్త పేరాడ తిలక్‌ల ఆధ్వర్యం లో జగనన్నకు స్వాగత ఏర్పాట్లు చేశారు. అనంత రం జరిగిన యాత్రలో పలువురు జనాలు తమ అవస్థలను జగన్‌కు వివరించారు. తమ పిల్లల చదువుల కోసం కట్టిన డిపాజిట్లు తిరిగి ఇవ్వడం లేదంటూ కేశవరెడ్డి బాధితులు తమ ఆవేదన వ్యక్తం చేశారు. అలాగే గిరిజన తెగల్లో ఒకటైన ఏనే టి కులస్తులకు ఎస్టీ సర్టిఫికెట్లను దివంగత వైఎ స్సార్‌ హయాంలో ఇచ్చారని, కానీ టీడీపీ అధి కారంలోకి వచ్చిన తర్వాత ఎస్టీ జాబితా నుంచే తొలిగించారంటూ జగన్‌ వద్ద గోడు వెళ్లగక్కారు. అలాగే ఇటీవల తిత్లీ తుఫాన్‌తో నష్టం జరిగిన నిజ మైన బాధితులకు కాదని, జన్మభూమి కమిటీల సిఫారసులకు మాత్రమే ప్రాధాన్యత ఇచ్చారంటూ కొందరు జగన్‌ దృష్టికి తీసుకొచ్చారు. స్థానికంగా ఉంటున్న మంత్రి అచ్చెన్నాయుడు అవినీతి, అక్రమాలపై లిఖితపూర్వకంగా వివరాలను సౌదాం గ్రామస్తులు జగన్‌ దృష్టిలో పెట్టారు. దీనిపై స్థా నికంగా జరుగుతున్న అక్రమాలపై చర్చించారు.

యాత్రకు వెళ్లొద్దంటూ వచ్చిన ఒత్తిళ్లను ఎదిరిస్తూ..
జగన్‌ పాదయాత్రకు ఎవ్వరూ హాజరు కావద్దం టూ మంత్రి అచ్చెన్నాయుడు ఆదేశించడాన్ని ప్రజ లు తీవ్రంగా తిప్పికొట్టారు. మంగళవారం కోట బొమ్మాళి మండల పరిధిలో నియోజకవర్గ సరిహ ద్దు వద్ద కార్యక్రమానికి ఎవ్వరు వెళ్లినా వారి కుటుంబ సభ్యుల ఫింఛన్లు రద్దు చేస్తామని, అలా గే తిత్లీ తుఫాన్‌ పరిహారాలను కూడా కట్‌ చేస్తామంటూ ఒత్తిళ్లు తీవ్రతరమయ్యాయి. అయినప్పటికీ జనం దీన్ని ఏమాత్రం ఖాతరు చేయకుండా తమ అభిమాన నేత వైఎస్‌ జగన్‌ను కలిసేందుకు వచ్చారు. ఇది స్థానికంగా చర్చనీయాంశమైంది. వర్షాన్ని సైతం లెక్క చేయకుండా తమ కష్టాలు తెలుసుకునేందుకు, రాష్ట్ర భవిష్యత్‌ను మార్చేందు కు వస్తున్న జగన్‌ను ఎలాగైనా చూడాలన్న కారణంతో వర్షం కురుస్తున్నా వృద్ధులు సైతం రోడ్డెక్కారు. అక్కడితో ఆగకుండా సౌదాం గ్రామ మ హిళలు సంయుక్తంగా జగన్‌ను కలిసి, మంత్రి ఆగడాలు, అక్రమాలపై ఆధారాలతో వివరించారు.

పాదయాత్రలో పాల్గొన్న నేతలు
ప్రజాసంకల్పయాత్రలో మంగళవారం పలువు రు నేతలు జగన్‌ను కలిసి తమ మద్దతును ప్రకటించారు. అడుగులో అడుగు వేస్తూ జగన్‌తో నడిచారు. పాలకొండ ఎమ్మెల్యే విశ్వాసరాయి కళావతి, పార్టీ శ్రీకాకుళం పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు తమ్మినేని సీతారాం, రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యుడు ధర్మాన కృష్ణదాస్, పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు తలశిల రఘురాం, రెడ్డి శాంతి, శ్రీకాకుళం పార్లమెంట్‌ సమన్వయకర్త దువ్వాడ శ్రీనివాస్, టెక్కలి నియోజకవర్గ సమన్వయకర్త పేరాడ తిలక్, జిల్లా మహిళా విభాగం అధ్యక్షురాలు చింతాడ మంజు గణప తి, నియోజకవర్గ మహిళా సంఘ అధ్యక్షురాలు సత్తారు ఉష, యువజన విభాగ జిల్లా అధ్యక్షుడు పి.రాజేంద్ర, ఎన్ని ధనుంజయ, మామిడి శ్రీకాంత్, యువనేతలు తమ్మినేని చిరంజీవి నాగ్, ధర్మాన కృష్ణ చైతన్య తదితరులు పాల్గొన్నారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top