రేపటి నుంచి కర్నూలు జిల్లాలో ‘ప్రజాసంకల్పయాత్ర’

ys jagan praja sankalpa yatra in kurnool district for 14th november  - Sakshi

కర్నూలు(కొండారెడ్డి ఫోర్టు):  వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి చేపట్టిన ప్రజా సంకల్పయాత్ర ఈ నెల 14 నుంచి కర్నూలు జిల్లాలో ప్రారంభం కానున్నట్లు ఆ పార్టీ ప్రోగ్రామ్‌ కో ఆర్డినేటర్‌ తలశిల రఘురామ్, నంద్యాల పార్లమెంట్‌ జిల్లా అధ్యక్షుడు శిల్పా చక్రపాణిరెడ్డి, ఎమ్మెల్సీ గంగుల ప్రభాకరరెడ్డి ఓ ప్రకటనలో తెలిపారు. ఈ నెల 13వ తేదీ రాత్రి కర్నూలు–కడప జిల్లాల సరిహద్దు ప్రాంతమైన ఎస్‌ఎస్‌ డాబా వద్దకు ప్రజా సంకల్పయాత్ర చేరుకుంటుందని పేర్కొన్నారు. ఆ మరుసటి రోజు ఉదయం 8.30 గంటల నుంచి పాదయాత్ర చాగలమర్రి మండలంలో ప్రారంభమవుతుందని, ఈ మేరకు రూట్‌ మ్యాప్‌ ఖరారు అయినట్లు స్పష్టం చేశారు. ప్రజలు తాము ఎదుర్కొంటున్న సమస్యలను ప్రతిపక్ష నేత దృష్టికి తీసుకెళ్లాలని సూచించారు. ప్రజల వినతులు, సమస్యల నుంచే వైఎస్సార్‌సీపీ ఎన్నికల మేనిఫేస్టోను తయారు చేస్తుందని తెలిపారు.   

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top